ప్రపంచంలో అత్యంత ఘోరమైన ఊచకోతలకు గురైన జాతి యూదులు… holocaust… ఏ దేశం వెళ్లినా కష్టాలే… కేవలం భారతదేశమే వాళ్లను కడుపులో పెట్టుకుంది… తరువాత వాళ్లకూ ఓ దేశం ఏర్పడింది… దాని రక్షణకు వాళ్లకు నిత్యసమరమే… అలాంటి యూదుల్లో పుట్టిన ఓ ఇజ్రాయిలీ సినిమా కేరక్టర్ నాదవ్ లాపిడ్ కాశ్మీర్‌లో కూడా ప్రజలు అలాంటి ఊచకోతలకు గురయ్యారనే నిజం, ఆ నిజాన్ని చిత్రీకరించిన ది కశ్మీరీ ఫైల్స్ సినిమా నచ్చలేదు…
వల్డర్, ప్రాపగాండా అని వ్యాఖ్యానించాడు… మన మీడియాకు గోకుడు సబ్జెక్టు దొరికిందిగా రెచ్చిపోయింది… ఇక ప్రకాశ్ రాజ్ వంటి డస్టబిన్ కేరక్టర్లు దొరికింది చాన్స్ అనుకుని రెచ్చిపోయారు… అదేం బుర్రో గానీ దేశాన్ని తిట్టినా, హిందువుల్ని తిట్టినా భలే ఆనందపడిపోతారు… కడుపుకు డ్యాష్ డ్యాష్… తనొక మేల్ రిచా చద్దా… ఆ కేరక్టర్ గురించి రాయడం, చదవడం, ఆలోచించడం వేస్ట్… తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలకు మాత్రమే ఆత్మీయుడు… వదిలేద్దాం…
సదరు నాదవ్ లాపిడ్ విమర్శలతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ ఉలిక్కిపడింది… వెంటనే ఆ దేశ రాయబారి నౌర్ గిలోన్ ఖండించాడు… ‘‘మేం యూదులం, చాలా భయంకరమైన చేదు అనుభవాలతో బాధపడుతున్న జాతి, ఇతరుల బాధల్ని పంచుకుంటాం, కశ్మీర్ ఫైల్స్ నేను చేశాను, కళ్లల్లో నీళ్లు తిరిగాయి… ఇలాంటి సినిమాపై చెత్త విమర్శలు చేసిన నిర్మాత నాదన్ లాపిడ్ తనకు తాను సిగ్గుపడాలి… భారతదేశ ఆహ్వానాన్ని దుర్వినియోగం చేశాడు… అఫ్‌కోర్స్, ఇలాంటి కేరక్టర్ల వల్ల రెండు దేశాల మితృత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు’’ అంటూ దాదాపు సారీ చెప్పాడు…
Ads
ఇక్కడ ఓ ప్రశ్న… ఆఫ్టరాల్ ఒక జూరీ సభ్యుడు, ఒక సినిమాపై ఏదో కామెంట్ చేస్తే… ఇజ్రాయిల్ ఇండియాకు వివరణ ఇచ్చుకోవాలా..? ఇచ్చుకోవాలి… In reality అధికారంలో ఉన్న పార్టీ ఆ సినిమాకు బలమైన మద్దతునిచ్చింది… కశ్మీర్‌లో హత్యాకాండపై ఓ సమగ్ర చిత్రం వచ్చిందని సమర్థించింది… అలాంటప్పుడు ఇండియా ఆహ్వానం మీద వచ్చిన ఓ యూదు నిర్మాత దానిపై కామెంట్స్ చేస్తే రాజకీయ స్పందన ఉంటుంది… అది మున్ముందు ఎంబరాసింగ్ సంభాషణలకు దారితీయకుండా సదరు రాయబారి వెంటనే డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలకు దిగాడు… (చిత్రం బాధ్యులు అనుపమ్ ఖేర్, వివేక్ అగ్నిహోత్రి కూడా సీరియస్‌గా రియాక్టయ్యారు)…
అఫ్‌కోర్స్, ఇండియా అంటే ప్రకాష్ రాజ్‌లు ఉంటూనే ఉంటారు, కేసీయార్‌కు అత్యంత ఆప్తులైనా సరే… ఇజ్రాయిల్ అంటే నాదవ్ లాపిడ్‌లు కూడా ఉంటారు… ఏదో కూస్తుంటారు… వాటిని సీరియస్‌గా తీసుకునే అపరిపక్వ పాలనావ్యవస్థ కాదు ఇండియాది… కానీ ఇజ్రాయిల్‌కు ఇండియాతో ఓ అనిర్వచనీయ బంధం… అసలే అది కొత్త కొత్త సవాళ్లతో సతమతం అవుతోంది… దానికి ఇండియా వంటి మిత్రదేశాలు కావాలి ఇప్పుడు… సో, ఇండియాతో స్నేహసంబంధాల మీద చిన్న మరక పడినా అది సహించదు… అందుకే సదరు రాయబారి సుదీర్ఘ వివరణ… అవునూ, అలాంటి అరబుర్ర యూదుడిని ఆహ్వానించింది ఎవరబ్బా..?!
Share this Article