Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జస్ట్, ఇది ట్రెయిలర్ మాత్రమే… అసలు సినిమా ముందుంది…:: ఇజ్రాయిల్

September 23, 2024 by M S R

ఇజ్రాయేల్ Vs హెజ్బొల్లా! Part 2
మేము ఇంకా పూర్తి స్థాయి ఎటాక్ మొదలు పెట్టలేదు!
అసలు ఆ అవసరం కూడా రాకుండా హెజ్బొల్లా ని కట్టడి చేయుగలం!
ప్రతీ దాని మీదా మాకు నియంత్రణ ( Control ) ఉంది.
మేము ఇజ్రాయేల్ లో ఉంటూనే లెబనాన్, సిరియా లలో ఉన్న మా ప్రత్యర్థులని భయపెట్టగలం!
ఇప్పటివరకూ జరిగింది కేవలం కొద్దిపాటి టెక్నాలజీ తో జరిగింది. ఇంకా మేము వాడాల్సిన టెక్నాలజీ చాలా ఉంది….. ఇజ్రాయేల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్!

హెజ్బొల్లా ప్రతీకారం తీరుకుంటాము అంటూ భీకర ప్రతిజ్ఞ చేసిన దానిమీద ఇజ్రాయేల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చేసిన బహిరంగ ప్రకటన అది!
పేజర్లు పేలడం వల్ల భయాందోళనలతో ఉన్న హెజ్బొల్లా కి వాకీ టాకీ లు, వైర్లెస్స్ రేడియో లు, స్మార్ట్ ఫోన్ లు పేలడం అనేది అంతుబట్టడం లేదు.

వాష్ రూమ్ లో కమోడ్ లు పేలడం ఆశ్చర్యకరం!
ఇంటి పైకప్పు మీద ఉన్న సోలార్ ప్యానల్స్ పేలడం ఆశ్చర్యకరం!
అంతెందుకు IoT అంటే Internet of Things అనేది ఎంతటి విధ్వంసానికి గురి చేస్తుందో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Ads

*********
అయితే IoT తో పనిచేసే ప్రతీ గాడ్జెట్ ని పేల్చేయవచ్చా?
సమాధానం అవును, కాదు అని చెప్పవచ్చు!
ప్రతీ గాడ్జెట్ ని ఒకే వ్యక్తి లేదా సంస్థ చేతిలోకి వెళ్లాలంటే శక్తివంతమైన ఫైర్ వాల్ ని చేధించి చొచ్చుకు పోవాల్సి ఉంటుంది! ఇది చాలా కష్టమైన పని కానీ అసాధ్యం కాదు! అలా అని ఆపలేమా అంటే అదీ సాధ్యమే!

********
Trojan Horse – ట్రోజాన్ హార్స్!
ఇది చాలా పురాతనమైన పధ్ధతి!
గ్రీకులు చెక్క గుర్రం లోపల మనిషిని ఉంచి శత్రు కోటలోకి ఆ గుర్రాన్ని చేర్చిన తరువాత గుర్రం లోపల ఉన్న మనిషి బయటికి వచ్చి కోట పై నుండి తాడుని కోట కిందకి వదిలే వాడు.

ప్రస్తుత కంప్యూటర్ యుగంలో trojan horse అనే పేరుతో చిన్న స్టాండ్ alone ప్రోగ్రాం ని పంపిస్తారు. ఇది ప్రకటనలు క్లిక్ చేస్తే, తెలియని మెయిల్స్ మీద క్లిక్ చేస్తే కంప్యూటర్ లేదా మొబైల్ లోకి వచ్చి చేరతాయి.

ట్రోజాన్ హార్స్ ఎలా పనిచేస్తుంది?
ఏదన్నా ఎలెక్ట్రానిక్ గాడ్జెట్ లోకి ఒకసారి ప్రవేశించిన తరువాత అది మొబైల్ అయినా, కంప్యూటర్ అయినా, టాబ్ అయినా దాని లోని డేటాని తనకి నిర్దేశించిన వారికి పంపుతూ ఉంటుంది. ఉదా : పాస్వర్డ్స్, క్రెడిట్, డెబిట్ కార్డ్ సమాచారం దొంగిలిస్తుంది.

వాడే వారి యాక్టివిటీని అంటే ఎక్కడికి వెళుతున్నారు (GPS ఉండి ఉంటే ), ఆన్లైన్ లో ఏం చేసున్నారో లాంటి సమాచారాన్ని హ్యాకర్ కి చేరవేస్తుంది!
అవసరం అయితే సదరు గ్యాడ్జెట్ లో ఉన్న సిస్టమ్ ఫైల్స్ ని నాశనం చేస్తుంది. హ్యాకర్ చేసిన ప్రోగ్రామింగ్ ని బట్టి ఎలాంటి యాక్టివిటీ లేకుండా నిర్దేశించిన తేదీ, సమయంలో యాక్టివేట్ అయి చెప్పిన పని చేస్తుంది!
ట్రోజాన్ హార్స్ మిగతా మాల్వేర్ (Malware ) లలాగా సిస్టమ్ ఫైల్స్ లోకి వెళ్లి వ్యాప్తి చెందదు! కాబట్టి వాడే వాళ్లకి అనుమానం రాదు!

 

********
మరి మోస్సాద్ ట్రోజాన్ హార్స్ ని ఎలా ఇంస్టాల్ చేసింది?

హెఙబొల్లా కి కావాల్సిన పేజర్లు, స్మార్ట్ ఫోన్లు, వాకీ టాకీలు, వైర్లెస్ రేడియోలు ఇరాన్ లోని కొన్ని షెల్ (Proxy ) కంపెనీలు ఆర్డర్ చేసాయి!

మోస్సాద్ కి ఇరాన్ ఒక ఆట స్థలం!
మిగతా దేశాలలో కంటే ఇరాన్ లోనే మోస్సాద్ కి ఎక్కువ యాక్సెస్ ఉంది! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం!

ఇరాన్ లోని ఆయుతోల్లా అలీ ఖోమైనీ మత చాందస ప్రభుత్వం మీద అక్కడి ప్రజలలో ద్వేషం ఉంది! ఇరాన్ ప్రజలు స్వచ్చందంగా మోస్సాద్ కి సహకరిస్తున్నారు!
హెజ్బొల్లా ఇరాన్ లోని షెల్ కంపెనీల ద్వారా ఇచ్చే ఆర్డర్లు వాటి సమాచారం మొత్తం షెల్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులే మోస్సాద్ కి సమాచారం ఇస్తున్నారు! కానీ హెఙబొల్లాకి ఈ విషయం తెలియదు!

నాలుగు నెలల క్రితం హెజ్బొల్లా 4 వేల పేజర్స్ కోసం ఇరాన్ లోని షెల్ కంపెనీ ద్వారా ఆర్డర్ ఇచ్చింది! మోస్సాద్ కోసం పనిచేస్తున్న ఉద్యోగులు విషయం చేరవేశారు. బల్క్ లో పేజర్లు తయారు చేసేది తైవాన్ మాత్రమే. ఆర్డర్ తైవాన్ లోని గోల్డ్ అపోలో కంపెనీ కి వెళ్ళింది! ఇక్కడి వరకూ అంతా సవ్యంగానే జరిగింది!

******
విలేఖరులు తైవాన్ లోని గోల్డ్ అపోలో సంస్థని సంప్రదించగా ఇరాన్ నుండి మాకు ఆర్డర్ వచ్చిన మాట నిజమే కానీ ఆ లో -టెక్ పేజర్లు మేము తయారు చేయము, మా సంస్థ లైసెన్స్ కలిగిన BAC CONSULT, BUDAPEST, HUNGARY కి ఇచ్చాము అని పేర్కొంది.

ఇక బుడాపెస్ట్ లోని BAC CONSULT కార్యాలయంని సంప్రదించగా ఎలాంటి స్పందన రాలేదు!

క్రిస్టియనా (Cristiana Bársony-Arcidiacono, Italy ), అనే ఇటలీకి చెందిన మహిళ BAC కన్సల్ట్ కి CEO గా ఉన్నట్లు ఆమె లింక్డ్ ఇన్ ( Linkedin ) ప్రొఫైల్ లో తెలుస్తున్నది.

లేబనాన్, సిరియాలలో పేజర్లు పేలి సంచలనం సృష్టించిన రోజు నుండి క్రిస్టియానా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది!

క్రిస్టియానా హంగరీ దేశ ఇంటెలిజెన్స్ రక్షణలో ఉన్నట్లు తెలుస్తున్నది!
హంగరీ దేశం ముస్లిం శరణార్థులకి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించి యూరోపియన్ యూనియన్ పెనాల్టీకి గురైన సంగతి తెలిసిందే!
కాబట్టి క్రిస్టియానా ఇప్పట్లో బయటికి రాదు, విషయం ఏమిటో తెలియదు.
BAC కన్సల్ట్ కి బుడాపెస్ట్ లో ఒక అపార్ట్మెంట్ లో ఆఫీస్ మాత్రమే ఉంది తప్పితే ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కానీ, అసెంబుల్ చేసే షెడ్లు కానీ ఏమీ లేవు. అంటే ఇదీ ఒక షెల్ కంపెనీయే!

*******
ఒక షెల్ కంపెనీ నుండి మరో షెల్ కంపెనీ ద్వారా లావాదేవీలు జరిగాయాన్నమాట! So! పెజర్ల లో ట్రోజాన్ హార్స్ మాల్వేర్ ని ఇంస్టాల్ చేయడం, పేలుడు పదార్ధం పెట్టడం అంతా హంగరీ లోనే జరిగింది!

*****
PETN – Pentaerythritol – పెంటాఎరిథ్రిటోల్!
క్లుప్తంగా petn అని పిలుస్తారు.
Petn అనే పేలుడు పదార్ధం పేజర్లలో వాడినట్లు తెలుస్తున్నది.
Petn పేలుడు పదార్ధం పెద్ద పెద్ద బ్రిడ్జ్ లని, పెద్ద భవనాలని కూల్చాడానికి వాడతారు!

*******
హెజ్బొల్లా కొన్న ప్రతీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ మోస్సాద్ షెల్ కంపెనీలు సప్లై చేస్తూ వచ్చాయి కాబట్టి బయటికి కనపడకుండా petn ని అమర్చి సప్లయ్ చేశారు.

ఆఖరికి వాష్ రూమ్ లలో వాడే కమోడ్ లలో కూడా petn ని అమర్చి సప్లై చేశారు. వైర్లెస్ డిటోనేటర్ ని కమోడ్ లో పెట్టారు అంటే మోస్సాద్ కోసం పనిచేసే వాళ్ళు హెజ్బొల్లాలో కూడా ఉన్నట్లు తెలుస్తున్నది!

******
గత అయిదు రోజులుగా లెబనాన్, సిరియాలలో హెజ్బొల్లా కోసం పనిచేస్తున్న వారు పేజర్, వాకీ టాకీ, స్మార్ట్ ఫోన్ లని చూస్తే భయపడి పోతున్నారు. అఫ్కోర్స్ వాష్ రూమ్ కి వెళ్ళాలి అన్నా భయమే! …… Contd…part 3       – పొట్లూరి పార్థసారథి 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఉపరాష్ట్రపతి ధన్కర్ రాజీనామా వెనుక ఇవీ అసలు కారణాలు..!!
  • గత సంబంధాలన్నీ గుండె పగిలిన అనుభవాలే… నేనిప్పుడు ఒంటరిని…’’
  • టి.కృష్ణ ఇంకొన్నాళ్లు బతికి ఉంటే… ఎన్ని ‘ప్రతిఘటన’లు పేలేవో..!!
  • తెలుగు డబ్బింగ్ వెర్షన్లకూ యథాతథంగా అవే తమిళ టైటిళ్లు..!
  • ‘‘పొలిటికల్ లాబీయింగుతోనే అమితాబ్‌కు ఆ జాతీయ అవార్డు’’
  • అందరూ నిర్దోషులే… సరే, మరి ఆ పేలుళ్లు, ఆ మరణాలకు బాధ్యులెవరు..?
  • రష్మి గౌతమ్..! డిజిటల్ డిటాక్స్ మాత్రమే కాదు… ఇంకేదో బాధ..!!
  • ధనాధన్‌ఖడ్ నిష్క్రమణ సరే… కొత్త ఉపరాష్ట్రపతి వీరిలో ఎవరబ్బా..!?
  • మోడీ, నిర్మల వదిలేసిన భారీ స్టాక్ స్కాం..! ఆ ఫ్రాడ్‌కు ఇదేం రక్షణ..!?
  • ఉపరాష్ట్రపతి కేరళకు వెళ్లాడు… ఓ లేడీ టీచర్ ఇంటి తలుపుతట్టాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions