Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పేజర్లు, వాకీటాకీలు పేలిపోయాయ్, అయిపోయాయ్… తరువాత ఏమిటి..?

September 25, 2024 by M S R

ఇజ్రాయెల్ Vs హెఙబొల్లా! Part 3

Well  లెబనాన్, సిరియాలలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అన్నది ఖచ్చితమైన రిపోర్టులు లేవు. Iphone లు కూడా పేలినట్లుగా తెలుస్తున్నది! తక్కువ ధరకి Iphone వస్తే ఎవరు కొనకుండా ఉండగలరు? తక్కువ ధరకి ఎవరు ఎందుకు అమ్ముతున్నారో తెలుసుకోవాలి కదా?

ఐ ఫోన్ అనేది భద్రత విషయంలో చాలా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉంటుంది అని ప్రచారంలో ఉంది. అఫ్కోర్స్! ఐఫోన్ మొదటిసారిగా 2007 లో మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని Os చాలా పటిష్టంగా ఉంది అని నిపుణులు చెప్పారు.

Ads

2015 లో మొదటిసారిగా ఒక హ్యాకర్ apple స్టోర్ లోకి చొచ్చుకువెళ్లి ఐ స్టోర్ లో ఉన్న itunes ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే విధంగా మార్చేశాడు!
అక్కడితో ఆగకుండా i mac, iphone యాక్ససరీస్ ధరలని అన్నిటిని ఒక డాలర్ కింద మార్చేశాడు. తరువాత కొద్ది గంటల్లోనే apple తన రక్షణ వ్యవస్థని సరిచేసుకుంది.

******
సమాచార విప్లవంలో యూదుల పాత్ర తిరుగులేనిది!
కాబట్టి కంపెనీ, బ్రాండ్ అనేవి మార్కెటింగ్ కి సంబంధించినది! టెక్నాలజీ యూదుల చేతిలో ఉంటూ వచ్చింది, ఇక ముందు కూడా ఉంటుంది! తప్పించుకోవడం కష్టం!
చైనాకి ఈ విషయం తెలుసు కాబట్టి HUAWEI ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నది!

*******
పేలిపోయిన పేజర్లు, స్మార్ట్ ఫోన్ల నుండి డాటాని రిట్రీవ్ చేసిన మోస్సాద్ హెజ్బొల్లా అంతర్గత రహస్య డాక్యుమెంట్ ని కనుక్కుంది. డాటాలో ఎంత మంది ఎలా గాయపడ్డారు, చనిపోయారో వివరాలు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ ని హెజ్బొల్లా మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రిపేర్ చేసినట్లుగా తెలుస్తున్నది!

1.మొత్తం 879 మంది పేజర్లు, వాకీ టాకీలు పేలిపోవడం వల్ల మరణించారు.

2.చనిపోయిన వారిలో 131 మంది ఇరాన్ దేశంకి చెందిన వాళ్ళు, 79 మంది యెమెన్ దేశానికి చెందిన వాళ్ళు, 291 మంది హెజ్బొల్లా సీనియర్ ఆఫీసర్లు!

3.తీవ్రంగా గాయపడిన వారు 602 మంది. వీళ్ళు తమ పనులు తాము చేసుకోలేని విధంగా గాయపడ్డారు కాబట్టి మరణించిన వారితో సమానం.

4.కళ్ళు కోల్పోయిన వారు 509 మంది.

5.జననేంద్రియ అవయువాలు (reproductive organs ) కోల్పోయిన వారు 1735 మంది.

******
ట్రోజాన్ హార్స్ ని ఉపయోగించి ఇంతమందిని ఎలిమినేట్ చేయడం ఇదే మొదటిసారి!
ఇక లాప్ టాప్ లు, డెస్క్టాప్ కంప్యూటర్లు పేలడానికి సిద్ధంగా ఎన్ని ఉన్నాయో తెలీదు.
హెజ్బొల్లా దగ్గర ఉన్న వీటిని ఆన్ చేయగానే మోస్సాద్ కి తెలిసిపోతుంది కాబట్టి వాటిని ఇకముందు ఆన్ చేయబోరు.
పోనీ ట్రోజాన్ హార్స్ ని రిమూవ్ చేసే టూల్స్ తో దానిని తీసేయాలి అంటే ముందు అది ఎలా పనిచేస్తుందో, దాని పేరు ఏమిటో దానిని రిమూవ్ చేసే టూల్ డాటాబేస్ లో ఉండాలి కానీ అది ఉండదు.

సాధారణంగా ట్రోజాన్ హార్స్ రిమూవ్ చేసే టూల్స్ ఉచితంగా దొరుకుతాయి కానీ మోస్సాద్ క్రియేట్ చేసిన ట్రోజాన్ కి పేరు ఉండదు. ఏదన్నా Antivirus సంస్థ పరిశోధన చేసి దానికి పేరు పెట్టి రిమూవ్ చేసే టూల్ డేటా బేస్ ని క్రియేట్ చేయాలి. ఒక్కరి కోసం యే సంస్థ కూడా ఆ పని చేయదు.

ఒకవేళ హిజ్బొల్లా పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపినా ఆ విషయం మోస్సాద్ కి తెలిసిపోతుంది! ఒక్క మాటలో చెప్పాలి అంటే కంప్యూటర్ లు విస్తృతంగా వాడుకలోకి రావడం మొదలైన కొత్తల్లో వైరస్ లని సృష్టించి వాటికి విరుగుడుగా antivirus కంపెనీలు అభివృద్ధి చెందడానికి కారకులు యూదులు!

కట్ చేస్తే antivirus బిజినెస్ అనేది ఇప్పుడు 5 బిలియన్ డాలర్ల వ్యాపారం! ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?…. పొట్లూరి పార్థసారథి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions