.
Days of Response – డేస్ అఫ్ రెస్పాన్స్!
ఇరాన్ మీద దాడికి ఇజ్రాయేల్ పెట్టిన పేరు ‘ Days of Response ’.
Ads
అక్టోబర్ 1 న ఇరాన్ ఇజ్రాయేల్ మీద మిసైళ్ల తో దాడి చేసిన 26 రోజులకి ఇజ్రాయేల్ ప్రతి దాడి చేసింది!
అఫ్కోర్స్! ఇజ్రాయేల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటో ఇరాన్ కి చెందిన పెంటగాన్ అధికారి అరియనే ఇరాన్ కి లీక్ చేసిన తరువాత ఇజ్రాయేల్ కొద్ది రోజులు వేచి చూసింది!
అక్టోబర్ 26 శనివారం రాత్రి ఇజ్రాయేల్ ఇరాన్ మీద దాడి చేసింది!
ఇజ్రాయేల్ దాడి చేసిన క్రమం ఎలా ఉంది అంటే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఒక దేశం ఒకే సారి దాడిలో ఉపయోగించిన యుద్ధ విమానాల సంఖ్య 200 పైగానే!
*******
1.ఒక వ్యూహం ప్రకారం ఇజ్రాయేల్ దాడి చేసింది. రాత్రి పూట యుద్ధ విమానాలతో దాడి చేయడం అంటే అదీ 200 విమానాలని కో-ఆర్డినేట్ చేయడం కత్తి మీద సాము లాంటిదే!
2.మొత్తం మూడు దశలుగా విభజించి దాడి చేసింది IAF (Israel Air Force ).
3.మొదటి వేవ్ లో భాగంగా 15 F -16i జెట్ లు టెల్ అవీవ్ నుండి టేక్ ఆఫ్ చేసి జోర్దాన్ మీదుగా ఇరాక్ లోకి ప్రవేశించి ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించాయి! F-16 లకి రక్షణగా F-15i లు 7 జెట్లు కవర్ చేస్తూ వెంట వెళ్లాయి!
4.F-16I లు ఎలెక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ లు మాత్రమే తీసుకెళ్లాయి కాబట్టి వాటికి శత్రు విమానాలు దాడి చేస్తే, తిరిగి దాడి చేయలేవు, అందుకే వాటికి రక్షణగా F-15I లు AIR TO AIR, AIR TO GROUND మిసైల్ లోడ్ తో వెళ్లాయి.
5.ఇరాన్ భూభాగంలో ఉన్న గ్రౌండ్ రాడార్లని జామ్ చేస్తూ ముందుకు వెళ్లాయి! అంటే గ్రౌండ్ రాడార్లు వార్నింగ్లు ఇవ్వలేవు అన్నమాట!
6.ఇక రెండవ వేవ్ లో భాగంగా మరో 15 F-15I జెట్ ఫైటర్స్ PGB (Precision Guided Bombs ) తో ఇరాన్ లో ఉన్న గ్రౌండ్ రాడార్స్ ని ధ్వంసం చేశాయి.
7.మూడవ వేవ్ లో భాగంగా F-35I లు కొన్ని ఇరాక్ భూభాగం మీద ఎగురుతూ ఇరాన్ లోని లక్ష్యాల మీద దాడి చేశాయి!
8.సంఖ్య ఎంతో ఇతమిద్ధంగా తెలియదు కానీ కొన్ని F-35i లు ఇరాన్ లోకి ప్రవేశించి ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ని ధ్వంసం చేశాయి!
9.ఇజ్రాయేల్ దాడి అనేది కేవలం ఇరాన్ మిలిటరీ వ్యవస్థలని టార్గెట్ చేసింది.
********
ప్రస్తుతం ఇరాన్ లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటూ ఏదీ లేదు. ఇజ్రాయేల్ ఇరాన్ లో ఉన్న నాలుగు S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని పూర్తిగా నాశనం చేసింది!
ఇక పదుల సంఖ్యలో ఉన్న గ్రౌండ్ రాడార్స్ అయితే ఒక్కటి కూడా పనిచేయకుండా నాశనం చేసింది IAF. ఇరాన్ మిసైల్, డ్రోన్ ఫాక్టరీలని ధ్వంసం చేసింది IAF!
ప్రస్తుత దాడి లక్ష్యం కేవలం ఒక శాంపుల్ మాత్రమే!
ఇరాన్ మీద మరో సారి దాడి చేసే అవకాశం ఉంది. అది కూడా అమెరికాలో వచ్చే నెలలో జరిగే అధ్యక్ష ఎన్నికల తరువాత!
ఒక్క నెలలో ఇరాన్ అటు రష్యా నుండి కానీ ఇటు చైనా నుండి కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనలేదు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ రోజు ఆర్డర్ పెడితే కనీసం ఆరు నెలల సమయం పడుతుంది డెలివరీ ఇవ్వడానికి, అది కూడా చైనా మాత్రమే ఆ పని చేయగలదు! అఫ్కోర్స్! మోడల్ నంబర్, పేరు వేరుగా ఉండవచ్చు కానీ చైనా ఇవ్వగలిగేది రష్యన్ S-300 కాపీ మాత్రమే!
ఇజ్రాయేల్ ఇరాన్ S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని అందులోనూ నాలుగు సిస్టమ్స్ ని మూడు గంటల ఆపరేషన్ లో ఎలా నాశనం చేయగలిగింది?
గ్రీస్ దేశం!
గ్రీస్ దగ్గర రష్యా సప్లై చేసిన S-300 లు ఉన్నాయి! గత రెండేళ్లుగా ఇజ్రాయేల్ ఇంజినీర్లు గ్రీస్ దేశంలో ఉండి S-300 లని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు!
అంటే S-300 ల ని యాక్టివేట్ చేసి రాడార్, కంట్రోల్ కామాండ్ సూట్లు ఎలా పనిచేస్తున్నాయి అని డాటా కలెక్ట్ చేసింది. ముఖ్యంగా S-300 FIRE CONTROL RADAR సిస్టంలో చిన్న చిన్న బగ్స్ ఉన్నట్లుగా ఇజ్రాయేల్ ఇంజినీర్లు గుర్తించారు. పని సులభం అయిపొయింది!
F-35 I లు ఇరాక్ భూభాగంలో ఎగురుతూనే ANTI RADIATION మిసైల్స్ తో రెండు S-300 బాటరీలని ధ్వంసం చేశాయి.
మిగిలిన రెండు S-300 లని F-15I లు ఇరాన్ లోకి వెళ్లి ధ్వంసం చేశాయి.
దాదాపుగా మూడు గంటల పాటు దాడి జరిగితే ఒక్క ఇరాన్ మిసైల్ కూడా గాల్లోకి ఎగరలేదు ఎందుకని?
ఒక్క ఇరాన్ జెట్ ఫైటర్ కూడా గాల్లోకి ఎగరలేక పోయింది ఎందుకని?
ఎందుకంటే ఇరాన్ ఎయిర్ ఫోర్స్ అనేది పెద్ద జోక్!
ఎప్పుడో అమెరికాతో సంబంధాలు బాగున్నప్పుడు F-14 TOM CAT జెట్ ఫైటర్స్ ని అమెరికా నుండి కొన్నది ఇరాన్! 70వ దశకం చివరలో ఆయుతోల్లా ఖోమేని ఇరాన్ రాజు షా ని దింపేసి ఇరాన్ ని ఇస్లామిక్ రిపబ్లిక్ గా మార్చిన తరువాత అమెరికా ఆంక్షలు విధించడం వలన F-14 టామ్ కాట్ లకి స్పెర్ పార్ట్స్ దొరకడం కష్టం అయ్యింది.
SO! ఇరాన్ ఎయిర్ ఫోర్స్ అనేది పెద్ద ఫార్స్!
********
మరో విశేషం ఏమిటంటే..
Tel Aviv ఎయిర్ బేస్ నుండి F -16I జెట్స్ స్క్వాడ్రాన్ బయలుదేరి జోర్దాన్ మీదుగా ఇరాక్ వెళ్లే సమయంలో సిరియా దేశ సరిహద్దుల ( మ్యాప్ చూడండి) వెంట ఎగురుతున్నప్పుడు సిరియా రాడార్లు గుర్తించాయి మరియు విషయం ఇరాన్ చెవిన వేసింది సిరియా!
అయితే IRGC మాత్రం ఆయుతోల్లా అలీ ఖోమేని ని ఒక చోట నుండి మరో చోటకి మారుస్తూ వెళ్లారు కానీ ఇజ్రాయేల్ కి తమ విమానాలు ఇరాన్ లోకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఖోమేని ఏ అండర్ గ్రౌండ్ బంకర్ లో ఉన్నాడో తెలిసిపోయింది కానీ ఖోమేనిని టార్గెట్ చేయలేదు!……….. (పార్థసారథి పొట్లూరి)
Share this Article