.
మతం ముఖ్యమా? దేశ రక్షణ ముఖ్యమా?
రెండూ ముఖ్యమే… నెతన్యాహు!
Ads
ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నారు.
హమాస్, హెజ్బొల్లాలతో పాటు ఇరాన్, హుతిలని ఎదుర్కోవాల్సిన స్థితిలో యుద్ధం కావొచ్చు మరియు ప్రత్యర్థి దాడులు కావొచ్చు మొత్తానికైతే ఇజ్రాయేల్ సైనికులు చనిపోతున్నారు!
IDF లెబనాన్ లో హెఙబొల్లా మీద దాడులు చేస్తున్న సందర్భంలో IDF సైనికులు ఎక్కువ సంఖ్యలో మరణించారు! ఇక్కడ IDF అంటే ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ లో యువకులతో పాటు మధ్య వయస్కులు, 50 ఏళ్ళు పైబడిన వారూ ఉన్నారు. ఇజ్రాయేల్ జనాభా తక్కువ కావడంతో వచ్చిన సమస్య ఇది.
50 ఏళ్ళు దాటిన వాళ్ళు కమ్యూనికేషన్, మిలిటరీ ట్రాన్పోర్ట్ లాంటి వాటిలో అయితే పనిచేయగలరు కానీ యుద్ధ టాంకులతో పాటు నడుస్తూ శత్రువులని ఎదుర్కునే పని అంటే కష్టం!
గత అక్టోబర్ లో IDF లెబనాన్ లోని దక్షిణ ప్రాంతంలో దాడికి దిగినప్పుడు హెజ్బొల్లాతో ముఖాముఖి తలపడిన సందర్భంలో పది నిముషాలలో 15 మంది IDF సైనికులు మరణించారు. మరో 40 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు కానీ చికిత్స అనంతరం తిరిగి మిలిటరీలో పనిచేయడానికి కావల్సిన ఫిట్నెస్ అయితే ఉండదు వీళ్ళకి!
ఇజ్రాయేల్ సైన్యం ( army ) హెఙబొల్లా ముందు నిలబడలేదు. హెఙబొల్లాలో ఉన్న ఫైటర్స్ శరీరదారుడ్యం శిక్షణ పొందిన ఏ దేశ సైనికులకంటే తక్కువ కాదు, కాకపోతే అత్యాధునిక ఆయుధాలు ఉండకపోవడం వల్ల ఓడిపోతున్నారు!
ప్రస్తుతం IDF తన సైన్యాన్ని లెబనాన్ నుండి వెనక్కి తెప్పించింది కానీ విమానాలతో దాడులు కొనసాగిస్తున్నది!
********
No Rules of Engagement
వారం క్రితం ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైన్యాన్ని ఉద్దేశించి ప్రకటన చేస్తూ యుద్ధం చేస్తున్నప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటించించాల్సిన అవసరం లేదు అన్నాడు! అంటే దీనర్ధం శత్రువుని చంపడానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వండి కానీ ప్రజల ఆస్థులు, ప్రాణాలు పోతాయేమో అని భయపడవద్దు అని చెప్పడమే!
ఈ ప్రకటన IDF లోని ఉన్నత స్థానాలలో ఉన్న అధికారులకి నచ్చలేదు, దరిమిలా అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు!
నేతన్యాహూ : IDF లోకి మతాధికారులని ( రబ్బీ ) తీసుకోకూడదు!
నేతన్యాహు ఉద్దేశ్యం ఏమిటంటే యూదు మతాధికారులు యుద్దానికి దూరంగా ఉండాలి మరియు మతపరమైన కార్యక్రమాలకి మాత్రమే వాళ్ళని పరిమితం చేయాలి అని.
ఇక్కడే నెతన్యాహుకి ఇజ్రాయేల్ రక్షణ మంత్రి మరియు చీఫ్ ఆఫ్ స్టాఫ్ (IDF ) కి తీవ్రమైన అభిప్రాయ భేదాలు వచ్చాయి.
నేతన్యాహు ఇజ్రాయేల్ రక్షణ మంత్రి యోవ్ గలంట్ ( Yoav Galant ) ని రాజీనామా చేయమని కోరాడు!
గలంట్ రాజీనామా చేసి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నెతన్యాహు తనని ఎందుకు రాజీనామా చేయమని కోరాడో చెప్పేసాడు.
1.నేను IDF లోకి కొత్తగా 7 వేలమందిని రిక్రూట్ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చాను.
2.కానీ ప్రధాని నేతన్యాహు అల్ట్రా అర్ధడాక్స్ యూదులని IDF లోకి తీసుకోవద్దని కోరాడు. నేతన్యాహుకి అల్ట్రా ఆర్ధడాక్స్ యూదుల లాబీ నుండి రాజకీయ మద్దతు ఉంది కాబట్టి వాళ్ళని సైన్యంలోకి తీసుకోవద్దని కోరుతున్నాడు కానీ ఎలాంటి భేదం లేకుండా అందరిని తీసుకోవాలని నా ఉద్దేశ్యం! సైన్యంలోకి తీసుకోవాలంటే ఎలాంటి తరతమ భేదాలు ఉండకూడదు కదా?
3.నేను గాజాలో కాల్పుల విరమణ చేసి సంధి చేసుకుందాము అని ప్రతిపాదించాను కానీ నేతన్యాహు ఒప్పుకోలేదు.
4.గాజా లో హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి గాను గాజా ప్రజలకి పునరావాసం కల్పించాలి అని ప్రతిపాదించాను కానీ నేతన్యాహు ఒప్పుకోలేదు. అందుకే రాజీనామా చేయమన్నాడు!
***********
ఇజ్రాయేల్ రక్షణ మంత్రి ఒక్కరేనా రాజీనామా చేసింది?
ఇజ్రాయేల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జెనరల్ హార్జీ హలేవి ( Herzi Halevi ) ని కూడా రాజీనామా చేయమని అడగవచ్చు.
షిన్ బెట్ ( Shin Bet ) చీఫ్ రొనేన్ బార్ ( Ronen Bar ) ని కూడా రాజీనామా చేయమని అడగవచ్చు. షిన్ బెట్ అనేది ఇజ్రాయేల్ అంతర్గత సెక్యూరిటీ సంస్థ.
******
So! ఇజ్రాయేల్ లో కూడా లెఫ్ట్ లిబరల్స్ ఉన్నారు కానీ దేశ రక్షణ కోసం పని చేస్తారు, అలా అని తమ లెఫ్ట్ లిబరల్ సిద్ధాంతాలని ఒదులుకోరు!
పోనీ, మాజీ రక్షణ మంత్రి గలంట్ కోరినట్లు గాజాలో పునరావాసం కల్పిస్తే అరబ్బులు మళ్ళీ దాడులు చేయరని గ్యారంటీ ఉందా?
మరీ ఎక్కువ దూరం చరిత్రలోకి వెళ్ళక్కరలేదు!
2005 దాకా గాజా ఇజ్రాయేల్ అధీనంలోనే ఉంది. గాజా ప్రజలకి ఉచిత వంటగ్యాస్ తో పాటు నిత్యావసరాలు ఇచ్చేది!
2005 లో మిమ్మల్ని మీరే పాలించుకోండి అని గాజా ప్రజలకి అప్పచెప్పింది! అలా అని ఉచిత వంట గ్యాస్ ఇవ్వడం ఆపలేదు. సబ్సిడీ ఇచ్చి డీజిల్, పెట్రోల్, గృహనిర్మాణ వస్తువులని సరఫరా చేస్తూ వచ్చింది.
అర్హత ఉన్న వాళ్లకి ఇజ్రాయేల్ లో ఉద్యోగాలు ఇచ్చి ఇజ్రాయేల్ పౌరులతో సమానంగా జీతాలు ఇచ్చింది.
ఇవి కాక యూరోపియన్ యూనియన్, అమెరికా, ఖాతార్ ల నుండి మిలియన్ల కొద్దీ డాలర్లు అందాయి.
హమాస్ మాత్రం 450 km మేర భూగర్భ సొరంగాలని తవ్వడానికి అంతర్జాతీయ సహాయాన్ని వాడుకుంది.
23 ఏళ్ళ తరువాత ఇజ్రాయేల్ మీద దాడి చేసింది!
ఇంక పునరావాసం కల్పించి ఉపయోగం ఏముంది?
IDF దాడులలో బయటపడ్డ డాలర్లు, యూరోలు, దినార్లు కట్టలకి లెక్కలేదు. ఇజ్రాయేల్ పూర్తిగా బయట పెట్టలేదు కానీ భారీ మొత్తంలోనే దొరికాయి.
********
1947 లో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ నిరాహార దీక్ష చేసి మరీ 45 కోట్ల రూపాయలు పాకిస్థాన్ కి ఇప్పించాడు!
ఏమైంది?
1947 నుండి ఇప్పటి వరకూ పాకిస్థాన్ ఒక్క గుర్తింపు కలిగిన పరిశ్రమని ఏర్పాటు చేయలేదు. ఎంతసేపటికీ మత రాజకీయంతో అమెరికా, బ్రిటన్ లనుండి ఆర్ధిక, సైనిక సహాయం పొందుతూ వచ్చింది!
గత ట్రంప్ హయాంలో అమెరికా ఇచ్చే ఆర్ధిక సహాయం ఆపేసే సరికి అసలు రంగు బయటపడ్డది!
పాకిస్థాన్ లో కిలో ఉల్లిపాయలు 180 /- ఇవి రెండో రకం ఉల్లిపాయలు. మొదటి రకం ఉల్లిపాయలు అయితే కిలో 220/- పైమాటే.
బియ్యం ఒక కిలో 300/-
రిఫైన్డ్ ఆయిల్ ఒక లీటర్ 750/-
విద్యుత్ బిల్లు 200 యూనిట్ల కి 10,000/-
ప్రస్తుతం గాజాలో కూడ పాకిస్థాన్ ధరలే అమలవుతున్నాయి కాకపొతే ప్రజలు ఆందోళన చేస్తే హమాస్ నాయకులు పెరిగిన ధరలకే కొనమని బెదిరిస్తున్నారు! వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడనుండి వస్తుంది? కాబట్టి మళ్ళీ అంతర్జాతీయ సహాయం అనే డ్రామా మొదలవుతుంది!
మద్దతుగా ఇజ్రాయేలు ప్రజలు ఫ్లెక్సీలు పట్టుకొని ప్రదర్శనలు చేస్తారు!
తుమ్మ చెట్టుని వేళ్ళతో సహా నరికివేసి పెట్రోల్ పోసి కాల్చినా రెండు నెలల్లో మళ్ళీ అదే చోట మొలుస్తుంది నీళ్లు లేకపోయినా సరే! ……….. (పొట్లూరి పార్థసారథి)
Share this Article