పుతిన్ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహూ కి ఫోన్ చేశాడు. అక్టోబర్ 7 న హమాస్ దాడి చేస్తే 10 రోజుల తరువాత ఫోన్ చేసాడు పుతిన్! ఫోన్ చేసి ఏం మాట్లాడాడు? ’’వీలున్నంత త్వరగా హమాస్ తో సంధి కుదుర్చుకోవడానికి నా వంతు సహాయం చేస్తాను. మీరు గాజా ముట్టడిని ఇంతటితో ఆపేయండి, గాజాలో పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు! గాజాకి నీరు, విద్యుత్, నిత్యావసరాలని ఇవ్వండి!’’
*********************
ఇజ్రాయెల్ మీద హమాస్ దాడిచేసిన 10 రోజుల తరువాత పుతిన్ నేతన్యాహూకి ఫోన్ చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి.
Ads
1.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యా తీర్మానం పెట్టింది. ఆ తీర్మానం సారాంశం ఏమిటి? ‘‘ఇజ్రాయెల్ గాజా ముట్టడిని వ్యతిరేకించాలి, వెంటనే దాడులు ఆపాలి, మానవతా దృక్పధంతో నిత్యావసరాల సప్లయ్ పునరిద్దరించాలి మరియు ఇజ్రాయెల్ చర్యని ఖండించాలి!’’
2. కానీ రష్యా తీర్మానం పరిశీలన దశలోనే తిరస్కరణకు గురయింది!
3. సౌదీ ప్రిన్స్ తో ఆంటోనీ బ్లింకెన్ సమావేశమయినప్పుడు నేతన్యాహూ జోబిడెన్ ని లెక్కచేయట్లేదు, గాజా విషయంలో కాబట్టి మేము ఇజ్రాయెల్ ని ఆపలేము అన్నాడు.
4.ఇది పుతిన్ ని ప్రేరేపించింది. తన పాచికలు పారేట్లు లేవు అని వెంటనే నేతన్యాహూ కి ఫోన్ చేసాడు.
5.పుతిన్ అమెరికా ,యూరోపు తరహాలో గేమ్ ఆడాలనుకున్నాడు కానీ విఫలం అయ్యాడు.
**********************
******************
పుతిన్ కి పశ్చిమ దేశాల నుండి కంటే తన స్వదేశంలోనే శత్రువులు ఎక్కువ! తన దేశంలోని శత్రువుల నుండి ప్రాణ హాని ఎక్కువ. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే పుతిన్ కి వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను అనే భావనలో ఉన్నారు మిత్రులు కొందరు. పుతిన్ అవినీతిపరుడు, మూర్ఖంగా రష్యాని అధోగతి పాలు చేస్తున్నాడు అని తెలుసుకున్నాక నేను వ్యతిరేకిస్తున్నాను.
రష్యా భూభాగాలని ఇప్పటికే చైనాకి అప్పచెప్పాడు పుతిన్. వ్లాడి వొస్టాక్ ని చైనా చేతిలో పెట్టాడు పుతిన్. పూర్తిగా తన భజనపరుల చేతిలో బందీ అయిపోయి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే గాజాలో పుతిన్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు దొరికినట్లు తెలుస్తోంది! పరిస్థితులు కుదుటపడ్డాక మొస్సాద్ రష్యాలో ముఖ్యంగా మాస్కోలో తన ప్రభావాన్ని చూపిస్తుంది!
రష్యన్ DUMA (పార్లమెంట్) లో మొస్సాద్ ఏజెంట్లు ఉన్నారు. తప్పు చేసి దానిని సమర్ధించుకునే క్రమంలో పుతిన్ నేతన్యాహూకి ఫోన్ చేయాల్సి వచ్చింది. సమీప భవిష్యత్తులో పుతిన్ అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు! రష్యా లో పుతిన్ కంటే ప్రతిభ, ధైర్యం, క్రమశిక్షణ కలిగిన నాయకులు ఉన్నారు. మరీ ముఖ్యంగా ఒక అంగుళం భూమిని చైనాకి వదులుకోవడానికి ఇష్టపడని నాయకులు ఉన్నారు….. Article By… పార్ధసారధి పోట్లూరి …….
Share this Article