మీడియాకు మండుతోంది..! సైట్లు, చానెళ్లు తెగ తిట్టిపోస్తున్నయ్ సమంతను…! ఆమెకు అంత పొగరెక్కిందా..? అసలు తన గురించి తను ఏమనుకుంటోంది..? ప్రశ్న అడిగితే బుద్ధి ఉందా అని తిడుతుందా…? అసలు ఆమెకు బుద్ధి ఉందా..? సిగ్గుందా..? మీడియాను అంత మాట అంటుందా…… అంటూ తెగ గింజుకుంటోంది పొద్దున్నుంచీ..! కానీ సమంత చేసిన వ్యాఖ్యలో ఏమాత్రం తప్పులేదు… జస్ట్, బుద్ధి ఉందా అని మాత్రమే తిట్టి సంయమనం పాటించడం మాత్రమే ఆమె చేసిన తప్పు నిజానికి… మీడియాకు కోపం రావచ్చుగాక… కానీ తప్పదు… మీడియా అయితేనేం..? అన్నింటికీ అతీతమా..?
విషయం ఏమిటంటే..? ఆమె శ్రీకాళహస్తి వెళ్లింది, పూజలు చేసింది… తరువాత తిరుమల వెళ్లింది, దర్శించుకుంది… బయటికి రాగానే గద్దలు చుట్టుముట్టాయ్… ఈ గద్దలు అనే వ్యాఖ్య పట్ల నాకెలాంటి బాధ లేదు, సమీక్ష కూడా అవసరం లేదు… అందరినీ తప్పించుకుంటూ మాస్క్ సర్దుకుంటూ తన మానాన తను వాహనం వైపు వెళ్తోంది… వదిలేయాలి కదా… ఏదో ఒక చానెల్ రిపోర్టర్ పదే పదే వెంటబడి ఆమె విడాకుల వ్యవహారంపై ఏదో అడుగుతున్నాడు… మొహం మీద మైక్ పెట్టేస్తున్నాడు, కెమెరా షూట్ చేస్తూనే ఉంది… అప్పుడామె గుడికి వచ్చాను, ఏమైనా బుద్ధుందా అని కోపంగా ఓ కామెంట్ చేసి వెళ్లిపోయింది… అదీ ఇప్పుడు మీడియాకు ఉక్రోశం…
Ads
ఎందుకు ఈ ఏడుపు..? నిజమే కదా… ఆ గుడి నుంచి బయటికి రావడమే ఆలస్యం, కెమెరాలు సెలబ్రిటీల వెంటపడుతున్నయ్… అదొక మీడియా పాయింట్ అయిపోయింది… నిజంగా బుద్ధి లేనిది, సిగ్గుపడాల్సింది టీటీడీ… పవిత్రంగా, ఇలాంటి రచ్చకు దూరంగా ఉంచాల్సిన గుడి ఆవరణను కూడా ఓ మీడియా పాయింట్ చేస్తున్నందుకు…!! అసలు అక్కడ కెమెరాలు ఎందుకు కాపుకాయాలి..? చివరకు దేవుడి దగ్గర కూడా సెలబ్రిటీలకు ప్రైవసీ అక్కర్లేదా..? ఎవడు మీద వాలిపోయి ఏమడుగుతాడో అని వణికిపోవాలా..? ఆమె ఇష్టం… అక్కినేని కుటుంబం నుంచి విడిపోవాలా..? ఇష్టం లేకపోయినా కలిసి ఉండాలా అనేది ఆమె పర్సనల్… కాకపోతే రీడర్ ఇంట్రస్ట్ ఉంటుంది కాబట్టి అడుగుదాం, కానీ అది తిరుమలలో కాదు… వాళ్లు ప్రెస్ మీట్లలో దొరికినప్పుడు అడగండి, అది కూడా చెప్పాలా వద్దా అనేది ఆమె ఇష్టం…! ఇప్పుడు విడాకుల మీద ఏదో ఒకటి అడుగుతారనే భయంతోనే చైతు గానీ, సమంత గానీ మీడియాకు దూరదూరంగా ఉంటున్నారు… లవ్‌స్టోరీ ప్రమోషన్ ఇంటర్వ్యూలు కూడా ఈ ప్రశ్న లేకపోతేనే ఇస్తానని చెబుతున్నాడు… వాస్తవంగా సమంత బుద్ధుందా అని తిట్టింది మీడియాను కాదు… ఉడుక్కోకండి… తిరుమల గుడి దగ్గర కూడా మీడియా కంపును అనుమతిస్తున్న దిగ్రేట్ టీటీడీ అధికారులు, బోర్డు బాధ్యులను… తప్పేమీ లేదు… అసలు సరిగ్గా తిట్టలేకపోయింది ఆమె..!! #Isupportsamantha, @Samanthaprabhu2
Share this Article