.
సినిమా రంగానికి సంబంధించి… తెలంగాణ ముఖ్యమంత్రి దిల్ రాజు, సినిమాటోగ్రఫీ మంత్రి రోహిణ్ రెడ్డిల అనాలోచిత, అడ్డదిడ్డం వ్యవహార శైలితో… తెలంగాణ ప్రభుత్వం పరువు పోగొట్టుకుంటోంది… తాజాగా హైకోర్టు సినిమా టికెట్ రేట్ల పెంపుపై వేసిన అక్షింతలు తాజా ఉదాహరణ…
- ముందుగా ఓ విషయం చెప్పుకుని వివరాల్లోకి వెళ్దాం.,. ఏపీని పాలిస్తున్నది సినిమా కుటుంబాలే కాబట్టి అక్కడ అలవోకగా, అడ్డగోలుగా రేట్లను పెంచేస్తున్నారు… కానీ తెలంగాణలో..? అస్తవ్యస్తత..!
రాజా సాబ్ సినిమా టికెట్ల రేట్ల పెంపు సరైన విధానం కాదనీ, పదే పదే చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం వినిపించుకోవడం లేదనీ, తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శి తన అధికార పరిధి కాకపోయినా రేట్ల పెంపుకి మెమో పేరిట ఆదేశాలు ఎలా జారీ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది… మెమోను రద్దు చేసింది… పాత రేట్లే వసూలు చేయాలని ఆదేశించింది…
Ads

- సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోయే మన శివశంకర్ ప్రసాద్ గారు సినిమాకు కూడా ఇదే వర్తిస్తుంది… ఒకవేళ నిర్మాతలు మళ్లీ ధర్మాసనంలో అప్పీల్ చేసుకుని, అక్కడ సానుకూల తీర్పు వస్తే తప్ప..!
సంక్షిప్తంగా గతాన్ని నెమరేసుకుంటే… సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ తప్పిదం కారణంగా జరిగిన తొక్కిసలాట అనంతరం… తెలంగాణలో నో బెనిఫిట్ షోస్, నో ప్రిరిలీజ్ ఈవెంట్స్, నో టికెట్ రేట్స్ హైక్ అని సాక్షాత్తూ రేవంత్ రెడ్డి చెప్పాడు…

కొన్నాళ్లకే అది కొట్టుకుపోయింది… అన్నీ స్టార్టయ్యాయి… తరువాత 20 శాతం అదనపు ఆదాయం సినిమా కార్మికులకు ఇవ్వాలి అన్నాడు… దిల్ రాజు ఏది చెబితే అదే చెలామణీ… హైకోర్టు గతంలోనే ఓసారి కొన్ని సినిమాల టికెట్ రేట్ల పెంపును కొట్టిపారేసినా మళ్లీ అదే తరహా మెమోలు జారీ చేయడం విధానపరంగా తప్పే…
ధర్మాసనం కూడా హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు పర్టిక్యులర్‌గా ఆ కేసుకు సంబంధించిన సినిమాలకే వర్తిస్తుందని, ప్రభుత్వమే అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవచ్చునని చెప్పింది… ఐనా సరే, రాజా సాబ్ టికెట్ రేట్ల పెంపు మెమో కూడా జారీ చేయడానికి ముందు ఓ డ్రామా…

అంతకుముందే సంబంధిత మంత్రి కోమటిరెడ్డి ఇకపై నేను టికెట్ రేట్ల పెంపునకు అనుమతించబోను అని ప్రకటించాడు… నిర్మాతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు… ప్రీమియర్లు పడాల్సిన టైమ్ సమీపిస్తోంది… ఈలోపు ఓ ఐఏఎస్ అధికారిణి- మంత్రి సాన్నిహిత్యం బాపతు దుమారం… చివరకు ఎలాగోలా లేటుగా మెమో ఇచ్చారు… కానీ..?
ఓ లాయర్ ఈ మెమో జారీ విషయంలో ప్రొసీజరల్ ల్యాప్స్, అధికార పరిధుల మీద కోర్టులో పిటిషన్ వేశాడు… అసలు జిల్లాల్లో కలెక్టర్లు, కమిషనరేట్లలో కమిషనర్లు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప హోం శాఖ ఈ నిర్ణయాలు ఎలా తీసుకుంటుందనేది కీలక ప్రశ్న… దాంతోపాటు మంత్రి చేసిన ప్రకటన, గతంలో వచ్చిన తీర్పు నేపథ్యంలో హైకోర్టు రాజా సాబ్ టికెట్ రేట్ల పెంపు మెమో రద్దు చేసింది…
ఇదీ నేపథ్యం..! ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? ప్రభుత్వంలో బాధ్యులకు అసలు ప్రొసీజర్, అధికార పరిధులు తెలియడం లేదా..? రోజురోజుకూ ప్రభుత్వం పరువు పోగొట్టుకుంటున్న దుస్థితికి నిజంగా ఎవరు బాధ్యులు..?
అప్ డేట్ :: చిరంజీవి సినిమాకు రెండు రోజుల ముందే, అంటే ఎనిమిదో తేదీన టికెట్ రేట్లు పెంచుతూ మెమో జారీ కావడం… అది మీడియాకు తెలియకపోవడం… వావ్, తెలంగాణ ప్రభుత్వం.,.!! నైజాంలో చిరంజీవి సినిమా రిలీజు చేసేది దిల్ రాజు… అర్థమైంది కదా… తెలంగాణ సినిమా ముఖ్యమంత్రి దిల్ రాజు అని ఎందుకన్నానో..!!

Share this Article