ఏదో పత్రికలో చదివాను… నటుడు రాజ్‌తరుణ్ (కావాలనే హీరో అనడం లేదు) పోలీసులకు తన న్యాయవాది ద్వారా ఓ వర్తమానం పంపించాడు అట… ‘నాకు కొత్త సినిమా షూటింగు ఉంది, ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి, ప్రస్తుతానికి నేను అందుబాటులో లేను…
విచారణకు హాజరు కాలేను, సారీ వీలున్నప్పుడు విచారణకు వస్తాను’ అనేది ఆ సమాచారం… తనకు ఈనెల 18న విచారణకు రావాలంటూ పోలీసులు తనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలుసు కదా… విచారణకు వెళ్లకుండా ఈ సమాచారం పంపించాడు తను… తను మరింత కూరుకుపోవడానికే తప్ప దీంతో వచ్చే ఫాయిదా ఏమీ లేదు…
ఇక్కడ రాజ్ తరుణ్, ఆయనపై పాత సహచరి పెట్టిన కేసులు, చేస్తున్న ఆరోపణలు ప్రస్తావించడం లేదు… ఆమెకు డ్రగ్స్ తీసుకుంటుంది, ఇంకెవరితో సంబంధాలున్నయ్ అంటాడు ఈయన… నో, నో, ఈయనకే అరియానాతో, మరో హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో మస్తు కనెక్షన్లున్నాయి అంటుంది ఆమె… కథలో బోలెడు ట్విస్టులు, ఎవరెవరి నడుమ సంబంధాలో బహిర్గతం అవుతూ పెంట పెంట అయిపోయింది ఇష్యూ…
Ads
సరే, పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టుకున్నారు… మెరిట్స్, డీమెరిట్స్ ఎలా ఉన్నాయి, చివరకు కోర్టు దాకా వెళ్తుందా… విచారణ జరిగితే కోర్టు ఆ సహజీవనాన్ని గుర్తిస్తుందా..? గుర్తించినా సరే, సహచరుడు వేరే వాళ్లతో సంబంధాలు పెట్టుకోవడాన్ని తప్పుపడుతుందా అనేవి ప్రస్తుతానికి జవాబుల్లేని ప్రశ్నలు… కానీ..?
నా ప్యాంటు బాగా లేదు, రాత్రి పబ్బుకు పోవాల్సి ఉంది, హ్యాంగోవర్ ఉంది, అంగీ ఇస్త్రీ చేసుకోలేదు వంటి కారణాలతో విచారణకు గైర్హాజరైతే తనకే నష్టం… తనపై ఏమేం సెక్షన్లు పెట్టారనే విషయంలో క్లారిటీ లేదు, వాటి తీవ్రత కూడా తెలియదు, కానీ పోలీసులకు అదే న్యాయవాదితోపాటు వెళ్లి ఉంటే బాగుండేది…
ఏ కేసులోనైనా అంతే… ఈమధ్య చాలా ఉదాహరణలు చూశాం కదా, ముందుగా మేం హాజరు కాలేం అని తప్పించుకోవడానికి ఈమధ్య కొందరు సినీ, పొలిటికల్ సెలబ్రిటీలు ప్రయత్నించడం, చివరకు పోలీసులు అరెస్టు చేయడం గట్రా… ఇప్పుడు కూడా పోలీసులు రాజ్ తరుణ్‌కు మరోసారి నోటీసులు ఇస్తారు, అవసరమైతే మరింత గట్టిగా బిగించి, కోర్టు ద్వారా వారెంట్ తీసుకుని మరీ లోపలేసే అవకాశాలనూ తోసిపుచ్చలేం…
అలాంటప్పుడు మరింత నష్టం… పోలీసుల ఎదుట హాజరై తన వాదనను తను వినిపించడం, ఒకవేళ కోర్టు దాకా కేసును తీసుకుపోతే కోర్టులో వాదనలకు సిద్ధపడటం ఒక మార్గం… కొత్త సినిమా షూటింగులున్నయ్, పబ్లిసిటీ కార్యక్రమాలున్నయ్ వంటివి సరైన కారణాలు కాబోవు… నేనెప్పుడూ బిజీగా ఉంటాను అంటే చట్టం ఊరుకోదు, తనూ గట్టిగా ఫిక్స్ చేయడంలో బిజీ అయిపోతుంది…!!
Share this Article