……… ‘‘అవినాష్ ఇక టాప్ ఫైవ్‌లో చేరినట్టే… నిన్నటి ఎవిక్షన్ ఫ్రీ పాసుతో రెండు వారాల ఇమ్యూనిటీ వచ్చింది… ఇంకేముంది..? నేరుగా టాప్ ఫైవ్ జాబితాలోకే…’’ ఇవీ బోలెడు మంది నమ్ముతున్నది, రాస్తున్నది, ప్రసారం చేస్తున్నది… కానీ నిజం కాదు… అసలు ఆ టాస్కు ఏమిటో, అందులో అవినాష్ గెలుచుకున్నది ఏమిటో, దాని ఉపయోగం ఏమిటో తెలియకుండా మౌసుకొచ్చింది గీకడమే ఇది…
అవినాష్ మధ్యలో వచ్చాడు… తను పెద్ద కమెడియన్ అనీ, తనను కావాలని బిగ్‌బాస్ ఎన్నుకున్నాడనీ, తనను అంత తేలికగా వదులుకోడనీ, తనతో బిగ్‌బాస్ ఏదో అగ్రిమెంటు ఉందనే స్థాయిలో బిల్డప్ ఇస్తున్నాడు… కానీ తనకు తెలుసు, తన కథేమిటో… అందుకు సింపతీ కోసం తెగ ప్రయత్నం… జబర్దస్త్‌కు తనేదో 10 లక్షలు ఉల్టా చెల్లించి వచ్చినట్టు, వాళ్లు ఇక తనకు జబర్దస్త్ షోలో చాన్స్ ఇవ్వనట్టు… పదే పదే తన బ్యాచ్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు… కానీ అదంతా ఫేక్… అలాంటిదేమీ లేదని, మల్లెమాల టీం తనను మళ్లీ రానివ్వం అని చెప్పడం పెద్ద హంబగ్ అనీ అవినాష్ సోదరుడే క్లారిటీ ఇచ్చాడు…
కదిలిస్తే చాలు, తను గొప్ప ప్లేయర్ అనీ, ఈ షోకు 200 శాతం ఫిట్ అనీ ఏదో కోతలు కోస్తాడు… కానీ ఎలిమినేషన్ అనే పదం వినగానే గడగడా వణికిపోతాడు… గుండె ఆగిపోతుంది… చివరకు నిన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో ‘మీ కాళ్లకు దండం పెడతా, నాకు వోటేయండి’ అనే తరహాలో ప్రచారం చేసుకున్నాడు… ఇతరులు ఏమీ ఆడటం లేదు, నేనే ఆడుతున్నాను అని ఫీలింగ్… అసలు బిగ్‌బాస్ ఆట అంటే తనకే క్లారిటీ లేదని అర్థమవుతుంది దాంతో…
Ads
ఈ మాయలో చివరకు జబర్దస్త్ టీం కూడా పడిపోయింది… ఆటో రాంప్రసాద్, గెటప్ సీను తదితరులు సోషల్ మీడియాలో ప్రచారానికి దిగారు… మంచిదే… తోటి కమెడియన్‌కు మద్దతు మంచిదే… కానీ మరీ జనాన్ని కామెటీతో ఓలలాడించేంత సీన్ అవినాష్ వైపు నుంచి ఏమీ కనిపించడం లేదు ఈ షోలో… ఆ పాయింట్ మిస్సయ్యారు వాళ్లు… ఏదో ఆ పిచ్చి అరియానా తప్ప… అదీ పదే పదే అరియానా కేవలం ఫ్రెండ్ మాత్రమే అని అవినాష్ మొత్తుకుంటున్నా సరే… ఈ దెబ్బకు నా పెళ్లి సంబంధాలు దెబ్బతింటాయనే బాధ మరోవైపు… అసలే బ్రేకప్ బ్యాచ్ కదా…
ఇక ఎవిక్షన్ ప్రీ పాస్ సంగతికొద్దాం… అఖిల్, అవినాష్, మోనాల్, అరియానాల నడుమ జరిగిన పోటీ అది… తరువాత పూలదండల మద్దతు ఎపిసోడ్.,. హారిక అనే మెంటల్ కేసు పుణ్యమాని అవినాష్ గెలిచాడు..అది అఖిల్ మీద వ్యతిరేకత… అంతే… సరే, అవినాష్ ఆ ఫ్రీ పాస్ సంపాదించాడు… అది రెండు వారాల వేలిడిటీ ఉంటుంది అని చెప్పాడు బిగ్ బాస్… అంటే రెండువారాల దాకా ఇమ్యూనిటీ కాదు… రెండువారాల్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అని అర్థం…
ఒకవేళ ఈ వారం తక్కువ వోట్లు వచ్చి, తను ఎలిమినేషన్ గేటు ముందు నిలబడే పరిస్థితి వస్తే వాడుకోవచ్చు… అంటే వచ్చేవారానికి ఆ చాన్స్ ఉండదు… కేవలం ఒకసారి మాత్రమే వాడుకోవాలి… ఒకవేళ ఈవారం దాన్ని వాడుకుని, బయటపడి, బచాయించి, ఒకవేళ వచ్చేవారం మళ్లీ నామినేషన్లలో పడి, ఎలిమినేషన్ దరిదాపుల్లోకి చేరితే ఈ ఎవిక్షన్ పాస్ పనిచేయదు… అంటే అవినాష్ మెడపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నట్టే…
ఈలోపు నోయెల్, కుమారసాయి గనుక షోలో అడుగుపెడితే… కథ మారుతుంది… ఈ అఖిల్ ఫస్ట్ ప్రమాదంలో పడతాడు… అఫ్ కోర్స్, ఈ వారమే అరియానా డేంజర్ జోన్లో పడినట్టే… అంటే ఏతావాతా చెప్పుకునేది ఏమిటంటే నిన్న అవినాష్ గెలుచుకున్న పాస్ నేరుగా ఫినాలేకి ఎంట్రీ పాస్ ఏమీ కాదు అని లెక్క… ఐనాసరే, అవినాష్ దూసుకుపోతాడు అంటారా…? అది మీ అంచనా, మీ అభిమానం… కానివ్వండి, నష్టమేమీ లేదు…!!
Share this Article