Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీ బాంచెన్, బాబ్బాబూ… మా మూవీ ట్రెయిలర్ రిలీజుకు రండి ప్లీజ్…

November 11, 2024 by M S R

.

ఒక పదేళ్ళ క్రితం తెలుగు సినిమాలకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్లు, ఆడియో లాంచ్ లు గట్రా ఇప్పటంత ఉదృతంగా ఉండేవి కావు.

సక్సెస్ ఈవెంట్లు మాత్రం బ్రహ్మాండంగా చేసేవారు… ఇప్పుడు సినిమా సక్సెస్ అనేది కేవలం మూడు రోజుల ముచ్చట ఐనందున ఈ జైత్ర యాత్రలు, సక్సెస్ మీట్లు తగ్గి పోయి వాటి స్థానంలో సినిమా రిలీజుకి ముందే అన్ని పండుగలు పబ్బాలు మొదలెట్టారు మేకర్స్….

Ads

ఆ క్రమంలో పుట్టుకు వచ్చినవే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్స్, టీజర్, ట్రైలర్, పోస్టర్ హీరో లుక్ రివీల్, లిరికల్ సాంగ్ రిలీజ్ అని నానా సోది ప్రాగ్రామ్స్ కు రూపకల్పన చేశారు…

ఈ డిజిటల్ యుగంలో… అందునా విచ్చలవిడిగా దొరికే యూట్యూబ్ ఇన్‌స్టాగ్రాం రెవెన్యూ ఆధారం చేసుకుని ఆ డబ్బాని కూడా కొల్లగొట్టాలనే ప్రయత్నంలో, వాటిపైన కూడా ఫోకస్ పెట్టాయి ప్రొడక్షన్ హౌస్ లు. అసలు సినిమా సంగతి, దాని మేకింగ్ సంగతి గాలికొదిలేసి ప్రచార ఆర్భాటానికే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.

చిన్నా లేదు చితకా లేదు, పెద్ద లేదు, అందరూ అదే బాట. పెద్ద సినిమాలకు ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఉండవు. డబ్బులు గుమ్మరిస్తారు కాబట్టి అన్నీ సవ్యంగా సాగిపోతాయి. ఎటొచ్చి చిన్న సినిమాలకే అన్ని బాధలు.
కొత్త ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్ కొత్త హీరో ఐతే ఇంక ఆ కష్టాలు చెప్పనలవి కాదు….

రీసెంట్ గా రిలీజైన ‘జితేందర్ రెడ్డి’ అనే చిత్రరాజానికీ అవే ఇబ్బందులు. అది ఒక బయోపిక్. ఎన్నో ఈతిబాధలు, పురిటి కష్టాలను నెట్టుకుని సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఐనా కష్టాలు ఆగలేదు. రిలీజ్‌కి కష్టాలు, థియేటర్స్ దొరకడానికి ఇబ్బందులు. అవే కాకుండా ప్రి- రిలీజ్ ఈవెంటుకు కూడా ఆడియెన్సే కాదు అసలు గెస్ట్‌లుగా కూడా ఎవరిని పిలిచినా వస్తాము అనే భరోసానే ఇవ్వలేదంట.

ఫార్మ్ లో ఉన్న హీరోలు సెలబ్రిటీ ప్రొడ్యూసర్స్ మాత్రమే కాదు, ఎప్పుడో పాతికేళ్ళక్రితం సినిమా తీసిన ఒకానొక దర్శకుడు కూడా వస్తా అని చెప్పి డుమ్మా కొట్టాడంట…. చిన్న సినిమాలకి అన్నీ కష్టాలే… ఇలాంటి కష్టాలు ప్రతి చిన్న సినిమాకూ ఉన్నాయి…

ఓ మోస్తరు సెకండ్, థర్డ లేయర్ హీరోలు కూడా మొరాయిస్తున్నారు… ఏదో ఆశ… ఎవడైనా పెద్ద దర్శకుడో, పెద్ద నటుడో వస్తే, మార్కెటింగ్ ఈజీ అని ఆశ… ఐనా నాకు తెలియక అడుగుతాను, అసలు ఈ ప్రిరిలీజ్ ఈవెంట్లు చేసుడెందుకు, ఎవడూ దేకట్లేదని ఏడ్చుడెందుకు….

ఎంచక్కా మునుపటి లాగా హాయిగా కామ్‌గా రిలీజ్ చేసుకోవచ్చు కదా… ఇదే అనుకుంటే… కాదు, ఓటీటీ బిజినెస్, థియేటర్ల కేటాయింపు తదితర చాలా అంశాలెన్నో ముడిపడి ఉన్నాయి…

ఆ ప్రీరిలీజ్ ఈవెంట్లకు పెట్టే ఖర్చేదో డిజిటల్ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చెయ్యొచ్చు కదా అంటారా?  కనీసం నాలుగైదు యూట్యూబ్ ఛానెల్స్ లోనైనా ప్రేక్షకులకు కనపడతారు కదా అనేది ఓ వాదన… ఈ ఈవెంట్ల వల్ల చేతి చమురు, ఈవెంట్ సంస్థలను పోషించుడే కానీ ఉపయోగం ఏమీ ఉండదనే విషయం వీరి అర్థమైతే కదా అంటారా…. అంత అర్థమైయ్యేదుంటే ఆ సినిమానే అద్భుతంగా తీస్తారు కదా అంటారా…?!
ఏమో లెండి….! అంతా ఓ సినిమాయ..!!……….. (ప్రియదర్శిని కృష్ణ)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కంగనా రనౌత్… ‘క్వీన్’ కమ్-బ్యాక్ ఆశలపై ‘లీగల్’ మేఘాలు!
  • ఒకసారి పేకముక్కల్లో ఇరుక్కుంటే… జీవితం ఎప్పుడూ ఫుల్ కౌంటే..!!
  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!
  • విజయ్ బాటలో జూనియర్! జూలై 18న ఏం చెప్పబోతున్నాడు?!
  • నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?
  • ఏదో ఒకటి గోక్కోవడం అనసూయకు అలవాటే కదా… ఇదీ అదే..!!
  • కేసీయార్ క్షుద్ర జర్నలిజం! అసలు నీరో ఎవరు పెద్ద దొరవారూ!?
  • సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?
  • బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!
  • మరో రాజ్యాంగ పోరాటం! ఆ బిల్లును గెలుకుతున్న సీఎం విజయ్!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions