Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జస్ట్, ఓ ప్రాంతీయ పార్టీ పేరు మార్పిడి ప్రొసీజర్… ఇంతగా గాయిగత్తర..?!

October 5, 2022 by M S R

జస్ట్, పార్టీ పేరు మారింది… అంతే… ఎందుకు..? ఇప్పుడున్న పేరులో తెలంగాణ అని ఉంది కాబట్టి, అదీ మరీ ప్రాంతీయతను సూచిస్తున్నది కాబట్టి, తనకు జాతీయ స్థాయి కావాలి కాబట్టి…! కొత్త పార్టీ పెట్టుకుంటే ఇప్పుడున్న ఎన్నికల గుర్తు పోతుంది… ఎన్నికల సంఘం దగ్గర ప్రొసీజర్ మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టాలి… పైగా రాష్ట్రానికి ఓ పార్టీ, దేశానికి ఓ పార్టీ బాగుండదు కాబట్టి…!

మరి ఈ కొత్త పేరునైనా జనంలోకి తీసుకుపోవడం కష్టం కాదా… కష్టమే… బీజేపీ, కాంగ్రెస్ సరిగ్గా వాడుకుంటే టీఆర్ఎస్‌కు నష్టమే… కానీ కేంద్రంలో చక్రాలు తిప్పాలంటే తప్పదు కదా… మరి చంద్రబాబు తెలుగుదేశం అనే పేరు కూడా ప్రాంతీయతను సూచించేదే ఐనా దాన్నే జాతీయ పార్టీని చేశాడు కదా… చేశాడు… నిజానికి టీఆర్ఎస్ అనే పేరున్నా పెద్ద ఫరకేమీ పడదు… కానీ కేసీయార్‌కు ఎవరు చెప్పగలరు..? అందుకని జరిగేది చూడటమే…

ఇదేమైనా కొత్త విషయమా..? జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తా, దేశమంతా అగ్గిపెడతా, గాయిగత్తర లేపుతా అని గత లోకసభ ఎన్నికల ముందు నుంచీ చెబుతూనే ఉన్నాడు… పోనీ, ఇదొక్కటే కొత్తగా జాతీయ పార్టీ అవుతోందా..? ఇదే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలతో పాటు తెలుగుదేశం, మజ్లిస్ కూడా జాతీయ పార్టీలే… చివరకు ఒక్క సీటూ లేని జనసేన కూడా రెండు రాష్ట్రాల పార్టీ… వీటిలో బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించిన జాతీయ పార్టీలు…

Ads

ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి అని పేరు మార్చగానే టీఆర్ఎస్ కాస్తా జాతీయ పార్టీ అయిపోదు… దానికి కొన్ని లెక్కలుంటయ్… ఈ పేరుమార్పిడి ముహూర్తానికి గాంధీ క్విట్ ఇండియా మూమెంట్‌కు పిలుపునిచ్చినట్టు… కలరింగ్ ఇచ్చింది నమస్తే తెలంగాణ పత్రిక… అప్పట్లో, యాభై ఏళ్ల కింద జయప్రకాశ్ నారాయణ ఇందిర ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పిలుపునిచ్చిన మహోజ్వల ఘట్టంతో పోల్చింది… సరే, ఆయన సొంత పత్రిక ఇంకేం రాయగలదు..? ఆ డప్పు, ఆ హైప్ అవసరం… కానీ మిగతా మీడియా..?

brs

మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమైనట్టు రాసేస్తున్నారు… నిజానికి ఒక పార్టీ పేరు మారితే అంత సీన్ ఉంటుందా అనడక్కండి… నిజంగా కేసీయార్ కావాలని అనుకుంటే ఏ పేరూ మార్చకుండానే జాతీయ రాజకీయాల్లో చురుకుగా కదలొచ్చు… ఎవరికీ అభ్యంతరాలుండవు… పేరు మారగానే హఠాత్తుగా వచ్చే రాజకీయ ప్రయోజనాలూ ఉండవు… ఇదొక చిన్న ప్రొసీజర్… కానీ చివరకు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి కూడా ఈ మాయలో పడి కొట్టుకుపోయాయి… ఏవో చిన్న పత్రికలు యాడ్స్ కోసం డప్పు కొట్టవచ్చుగాక… చివరకు ఈ మూడూ అంతేనా..? సరే, నమస్తే సాక్షిని కూడా వదిలేస్తే… రాబోయే రోజుల్లో తమ జన్యుబంధువు తెలుగుదేశాన్ని చికాకు పెట్టే బీఆర్ఎస్ గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఎందుకంత ప్రేమ..?

trs

చూశారు కదా… ఇదీ తీర్మానం… పార్టీలోని వివిధ స్థాయిల కమిటీలు సంతకాలు చేసి, ఎన్నికల సంఘానికి పేరు మార్పిడి తీర్మానాన్ని పంపించాయి… ఇక నెక్స్ట్ ఏమిటి..? కేసీయార్, తన ముఖ్య కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులతో ఫ్లయిట్ ఎక్కడం, తన ఫ్లయిటే… కొత్తగా కట్టిన పార్లమెంట్ భవనం బ్యాక్ యార్డులో దిగి, నేరుగా వెళ్లి కుర్చీలో కూర్చోవడం…! మోడీ దొడ్డిదారిలో హిమాలయాలకు వెళ్లిపోయి, ఏదో గుహలో తలదాచుకోవడం…! రాహుల్ భారత్ జోడోను వదిలేసి, మళ్లీ ఏదో మనకు తెలియని విదేశానికి చెక్కేయడం…! అబ్బే, వెటకారం కాదు, మన మీడియా ధోరణి ఆ కోణంలోనే సాగుతోంది మరి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!
  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions