వివక్ష… బాలీవుడ్ సినిమాలన్నీ తన్నేస్తున్నా సరే, సౌత్ నుంచి డబ్బింగైన సినిమాలే వేల కోట్లు దున్నేస్తున్నా సరే, నార్త్ ఇండియన్ క్రియేటివ్ ఫీల్డ్ వట్టిపోయినా సరే… దక్షిణం మీద ఏదో వివక్ష, కక్ష, చిన్నచూపు… ప్రత్యేకించి టీవీ, సినిమా, మోడలింగ్ తదితర రంగాల్లో… నార్త్ ఇండియన్స్ అస్సలు సౌత్ ఇండియన్స్‌ను సహించరు అదేమిటో… అసలు వీళ్లు మన దేశం వాళ్లేనా అన్నట్టు వ్యవహరిస్తారు… ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే..?
ఇండియన్ ఐడల్ షో తెలుసు కదా… టాప్ రేటింగ్స్ వచ్చే షో… భారీగా ఖర్చు పెడతారు… స్క్రిప్టెడే అయినా జనరంజకంగా సాగే షో… ఆ ఆడిషన్స్ దగ్గర నుంచి సెలక్షన్స్ దాకా అదోరకం నార్త్ వాసన… సగటు సౌత్ ఇండియన్‌కు ఏదో ఇబ్బంది… మద్రాసీ యాస అని నార్త్ మ్యూజిక్ ప్రపంచం మనల్ని ఈసడించుకుంటుంది… అంతటి బాలసుబ్రహ్మణ్యాన్నే నానా అవస్థలూ పెట్టింది… ఆ ప్రతికూలతలోనూ మన శ్రీరామచంద్ర, రేవంత్, రోహిత్, కారుణ్య తదితరులు ఫైనలిస్టులో, విన్నర్సో అయ్యారు…
అలా హిందీ నేర్చుకున్నారు… ఒడుపుగా ఆ పాటలోని సొగసు పట్టుకున్నారు… నేర్చుకున్నారు… అప్పట్లో ప్రేక్షకుల వోటింగు అనే క్లాజ్ లేదు కాబట్టి జడ్జిలు మార్కులేసేవాళ్లు… కానీ సోనీ వాడు తరువాత ఆడియెన్స్ వోట్లనూ లెక్కలోకి తీసుకోవడంతో ఇక నార్త్ ఆడియెన్స్ సౌత్ సింగర్స్ మీద ఫుల్ వివక్ష చూపిస్తున్నారు… గత సీజన్‌లో విజేత అని మొదటి నుంచీ అనిపించుకున్న మన షణ్ముఖప్రియ మీద విపరీతమైన ట్రోలింగ్ చేశారు… కావాలని ముంబై, కోల్‌కతా, ఢిల్లీ సింగర్లను పైకి లేపారు…
Ads
ఈ ప్రభావం సోనీ మీద ఎంత ఘోరంగా పడిందంటే… సెప్టెంబరు 10 నుంచి ప్రారంభమైన 13వ సీజన్‌లో 15 మంది కంటెస్టెంట్లలో ఒక్కరంటే ఒక్కరూ సౌత్ ఇండియన్ సింగర్స్ లేరు… నిజం… సేమ్ గత సీజన్‌లాగే అదే ఆదిత్య నారాయణ్ హోస్ట్, అదే హిమేష్, నేహ కక్కర్, విశాల్ దడ్లాని జడ్జిలు… ఒక్కసారి కంటెస్టెంట్ల పేర్లు చూడండి… వీరిలో జార్ఖండ్‌కు చెందిన షాగున్ పాఠక్, కోల్‌కతాకు చెందిన ప్రీతమ్ రాయ్ ఆల్‌రెడీ ఎలిమినేట్ అయిపోయారు…
Name | Hometown | ||
---|---|---|---|
Shivam Singh | Vadodara | ||
Rishi Singh | Ayodhya | ||
Deboshmita Roy | Kolkata | ||
Navdeep Wadali | Amritsar | ||
Senjuti Das | Kolkata | ||
Sonakshi Kar | Kolkata | ||
Chirag Kotwal | Jammu and Kashmir | ||
Vineet Singh | Lucknow | ||
Bidipta Chakraborty | Kolkata | ||
Kavya Limaye | Vadodara | ||
Anushka Patra | Kolkata | ||
Sanchari Sengupta | Kolkata | ||
Rupam Bharnarhia | Amritsar | ||
Pritam Roy | Kolkata | ||
Shagun Pathak | Jharkhand |
మిగిలిన 13 మందిలో ఆరుగురు కోల్‌కతాకు చెందినవాళ్లే… అంటే ఎలిమినేటెడ్‌తో కలిసి ఏడుగురు… సగం మంది వాళ్లే… ఇది ఇండియన్ ఐడలా..? బెంగాలీ ఐడలా..? ఇద్దరు అమృత్‌సర్, ఇద్దరు వడోదర… ఇదేందిర భయ్… ఇండియన్ ఐడల్ అంటే దేశం మొత్తాన్ని రిప్రజెంట్ చేసే సెలక్షన్ ఏది..? బహుళ వైవిధ్యత ఏది..? అసలు సౌత్ ఇండియన్స్ మొత్తాన్నే కట్ చేయడం ఏంది..?
ఎందుకు చూడాలి ఈ షోను..?’సౌత్ ఇండియన్స్ గతంలో ఎంత పరిపుష్టం చేశారు ఈ షోను… ఆ సోయి ఏమైంది సోనీ టీవీకి…? నార్త్ ఇండియన్స్‌కు నచ్చదని భయపడిందా..? మరెందుకు ఇండియన్ ఐడల్ అనే పేరు… నార్త్ ఇండియన్ ఐడల్ అని పెట్టుకోవచ్చు కదా… ఇడియాటిక్, ఫూలిష్… ఈ మాట అనేందుకు సందేహించడం లేదు… సంకోచించడం లేదు…!!
Share this Article