Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొత్తేమీ కాదు… అప్పుడెప్పుడో మొదలై మళ్లీ కదలిక… ఇంతకీ ఎవరీ వృింద..?!

June 10, 2025 by M S R

.

కృష్ణ విృంద విహారి… అసలు సినిమా పేరే చాలామందికి నచ్చలేదు… పైగా ఇది కొత్త సినిమా ఏమీ కాదు… అప్పుడెప్పుడో స్టార్టయి, ఆగిపోయి, కాస్త కదిలి, మళ్లీ ఆగిపోయి, ఇప్పుడు మళ్లీ కదులుతోంది… మామూలుగానే వృంద అనే పేరు ఎవరికీ తెలియదు… పైగా వృంద అని రాస్తే సరిపోయేది… దానికి విృంద అని రాయడం దేనికో..?

సరే, నేములోనేముందిలే అనుకుని వదిలేస్తే… నాగశౌర్య కొత్త లుక్కుతో కనిపిస్తున్నాడు… తన బర్త్‌డే సందర్భంగా ఈ లుక్కు ఏదో రిలీజ్ చేసినట్టున్నారు… ఫన్, కామెడీ ప్రధానంగా సాగే రొమాంటిక్ ఎంటర్‌టెయినర్ అని చెబుతున్నారు…

Ads

sherley

వరుడు కావలెను వర్కవుట్ కాలేదు… దిగుదిగునాగ అంటూ ఓ వెగటు పాటను పెట్టినా, ప్రేక్షకులు కిందకు దింపేశారు తప్ప మెచ్చుకోలేదు… తరువాత లక్ష్య అని మరో సినిమాలో ఏకంగా ఎయిట్ ప్యాక్ ప్రదర్శించినా సరే, ప్రేక్షకుడు లక్ష్యపెట్టలేదు… ఫోఫోవోయ్ అనేశారు…

అసలు ఆ బాడీ ఎక్స్‌పోజర్ కోసం తొమ్మిది రోజులు నీళ్లు తాగలేదు అని నాగశౌర్య చేసిన ప్రకటన నవ్వు పుట్టించింది, అదేనండీ లాఫింగ్ స్టాక్ అయిపోయింది… సో, ఇక ఈ ప్రయోగాలన్నీ వేస్ట్ అని తీర్మానించేసుకుని, వేరే నిర్మాతలూ అక్కర్లేదనుకుని, ఓ సాదాసీదా సరదా కథతో తనే సొంతంగా తీసేస్తున్నాడు… అంటే ఆగిపోయిన ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించాడు…

shirley

నిజానికి ఈ సినిమా 2020లో స్టార్టయింది… నిజం… ఆ ఏడాది నవంబరులో హీరోయిన్ షిర్లే సెతియా స్వయంగా తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసుకున్న డిటెయిల్స్ ఓసారి చూడండి… టాలీవుడ్‌కు వచ్చేస్తున్నానహో అని సంబరపడిపోయింది ఫాఫం… దర్శకుడు, నిర్మాత, హీరో, సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ తదితరుల పేర్లనూ చెప్పేసింది అప్పుడే…

kvv

తరువాత ఏమైందో ఆగిపోయింది… బహుశా డబ్బు సమస్యో, లేక ఇతర ప్రాజెక్టులను ముందుగా పూర్తిచేయాలనుకున్నాడో గానీ… మళ్లీ ఆ సినిమా వార్తలేమీ రాలేదు… హఠాత్తుగా జూలై 2021లో షూటింగ్ రీస్టార్ట్ చేశారు… త్వరత్వరగా పూర్తిచేసి, రిలీజ్ చేయాలనీ అనుకున్నారు…

అప్పట్లో నాగశౌర్య తనే స్వయంగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు గట్రా పెట్టేసినట్టున్నాడు… హీరోయిన్ కూడా ముంబై నుంచి కొన్నాళ్లు వచ్చిపోయింది… తరువాత మళ్లీ ఆగిపోయింది…

kvv

సరే, మళ్లీ కదిలింది… ఆల్ ది బెస్ట్, ఇక ఆగొద్దని ఆశిద్దాం… ఇది సరే గానీ, ఆ హీరోయిన్ ఎవరు..? షిర్లే సెతియా… మన దేశంలోనే పుట్టింది… డామన్‌ ఆమె స్వరాష్ట్రం… కానీ ఏడేళ్ల వయస్సులోనే పేరెంట్స్‌తోసహా న్యూజిలాండ్‌లోని అక్లాండ్ వెళ్లిపోయింది…

చదువూసంధ్యా అక్కడే… నిజానికి తను నటిగా కాదు, సింగర్‌గానే పాపులర్… అదీ పాప్ సింగర్… బోలెడు ఆల్బమ్స్ చేసింది… కొన్నాళ్లు రేడియో జాకీ… యూట్యూబ్ వీడియోలు స్టార్ట్ చేసింది… అవి బాగా క్లిక్ కావడంతో తను ముంబైకి వచ్చి కొత్త అవకాశాలు వెతుక్కోవడం స్టార్ట్ చేసింది…

హైదరాబాద్‌తో ఆమె అనుబంధం ఇప్పుడేమీ కొత్త కాదు… 2015 నుంచీ కనెక్టయ్యే ఉంది… అప్పట్లో మస్కా అనే సినిమా చేసింది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం… తరువాత నికమ్మా అనే ప్రాజెక్టు చేస్తోంది… అప్పుడే తెలుగు నుంచి ఈ నాగశౌర్య సినిమా ఆఫర్ వచ్చింది..!!

.

(ఇది మూడేళ్ల క్రితం కథనం… తారలు వస్తుంటారు, పోతుంటారు, కొందరే నాలుగురోజులు మెరుస్తుంటారు… ఈమె యూట్యూబర్, గాయని, నటి… కానీ సదరు విృంద తరువాత మళ్లీ అయిపూజాడా లేదు… అంతే, ఈ ఫీల్డే అంత… అవునూ, ఇంతకీ ఆ సినిమా ఏమైందీ అంటారా..,? భలేవారే… నాగశౌర్య సినిమా అన్నాక ఫలితం ఏమిటో ఊహించలేరా..? హీరోయిన్ షిర్లే సెటియా, సెఠియా, సెతియా… ఎవరైతేనేం..?)

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రీల్ హీరోలు కాదురా… ఇదుగో వీళ్లు రియల్ హీరోలు… మార్గదర్శులు…
  • గుడ్లగూబ కళ్లతో అదరగొట్టేస్తయ్… ఈ జీవులేమిటో తెలుసా..?
  • వరల్డ్ ఫేమస్ గాంజాకు అడ్డా… అలెగ్జాండర్ ది గ్రేట్ సైనికుల వారసులు…
  • పులివెందుల… అప్పటి వైఎస్సూ లేడు, అప్పటి చంద్రబాబూ కాడు…
  • 74 ఏళ్లొచ్చినా… రజినీలో అదే స్టయిల్… అదే ఎనర్జీ… దీనికీ అదే ప్రాణం…
  • ఉద్యమ సంధానకర్తగా రేవంత్ గౌరవించాడు కాబట్టి… బీఆర్ఎస్ ట్రోలింగ్..!!
  • War-2 review ….. జూనియర్ ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది…!!
  • ఇవే వీథికుక్కల గాట్లకు చిన్నారులు మరణిస్తే… ఒక్క గొంతూ ఏడవలేదు…
  • కేసీయార్ చేస్తే సరస శృంగారమట… ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారమట..?!
  • హార్డ్‌వర్క్ ఎవరిక్కావాలి… లక్కు కావాలి… లేదంటే ఏవో గిమ్మిక్కులు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions