.
ఎస్, ఓ మిత్రుడు చెప్పినట్టు… ఇంగ్లండ్‌తో జరిగిన మూడో మ్యాచు ఇంగ్లండ్ గెలుపు కాదు, ఇండియా ఓటమి… రెండూ ఒకటే కదానొద్దు… తేడా ఉంది… ఇంగ్లండ్ మెరిట్ సరే, కానీ ఇండియా స్వయంకృతాలే ఈ ఓటమికి కారణం అని…
నిజానికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రెండు జట్లూ సేమ్ స్కోర్… కాకపోతే రెండో ఇన్నింగ్స్ ఇంగ్లండ్ 192 రన్స్ మాత్రమే చేసింది… మన బౌలర్లు తమ డ్యూటీ తాము చేశారు… గుడ్… అయితే బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్ మీద ఆ స్కోర్ కూడా బీట్ చేయడం ఇండియాకు ఓరకమైన పరీక్షే…
Ads
కుంబ్లే చెప్పినట్టు… చివరి ఇన్నింగ్స్‌లో ఎప్పుడూ డ్రామా ఉంటుంది… కానీ మరీ ఇండియా ఫ్యాన్స్ మరీ ఇంత నిరాశపడే ఆటతీరు మాత్రం ఊహించలేదు… సరే, కేవలం 22 పరుగులతో ఓడిపోయారు, మరీ అవమానకరమైన ఓటమి కాదు అనే సంతోషం ఒక్కటే మిగిలింది… కానీ మన ఫెయిల్యూర్ల మాట..?
రెండు జట్లకూ బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది… ఎవరూ తక్కువ కాదు… కానీ మన బ్యాటింగ్ వనరులను ఎలా ఉపయోగించాం అనేదే ప్రధాన ప్రశ్న… యశస్వి జైస్వాల్ ఓపెనర్… ఐపీఎల్‌లో మంచి కన్సిస్టెన్సీ చూపించాడు… ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ సింపుల్‌గా చెత్తా ఆట…
అసలు మొదట్లోనే తను ఆడుతున్న షాట్లు చూస్తుంటే ఏమిటీ పిల్లాడు, ఈ పిచ్చి షాట్లు, త్వరపడుతున్నాడు అనిపించింది… అనుకున్నట్టే త్వరగా ఔటయిపోయాడు… కరుణ్ నాయర్‌ను ఇండియా జట్టు ఎంత త్వరగా వదిలించుకుంటే అంత బెటర్… తనకు ఏమాత్రం టెస్టు బ్యాటింగ్ అంటే ఏమిటో తెలియదు… అఫ్‌కోర్స్, మన జట్టు కోచ్ ఈమేరకు వాళ్లను మోటివేట్, గైడ్ చేయకపోవడం కూడా ఓ ట్రాజెడీ…
పంత్ ఎప్పుడు సరిగ్గా ఆడతాడో, ఎప్పుడు తన విచిత్రమైన బాడీ లాంగ్వేజీతో బ్యాట్ పారేసుకుంటాడో తెలియదు… గిల్ వోకే… జాగ్రత్తగానే ఆడాడు గానీ టైమ్ అనుకూలించలేదు… వాషింగ్టన్ సుందర్ కూడా వోకే… ఎటూ బుమ్రా, సిరాజ్ జస్ట్ బౌలర్లే… నిజానికి సిరాజ్ రవీంద్ర జడేజాకు చాలాసేపు సపోర్ట్ ఇచ్చాడు… ఈ మూడు మ్యాచుల్లోనూ బుమ్రాతో పాటు ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ కూడా తమ మెరిట్ చూపించారు… అదొక్క ఉపశమనం…
చెప్పుకోవాల్సింది రవీంద్ర జడేజా గురించే… వరుసగా ఇంగ్లండ్ మీద నాలుగు హాఫ్ సెంచరీలు… అవీ కీలకమైన దశల్లో… మరీ ఈ టెస్టు మ్యాచులో తన ఆటను మెచ్చుకోవాలి… నిజమైన టెస్టు బ్యాటింగ్ తనది… 30, 35 స్ట్రయిక్ రేటు మాత్రమే… అంత ఆచితూచి ఆడాడు… తనను ఔట్ చేయడానికి ఇంగ్లండ్ నానాపాట్లూ పడి, ఇక తనను వదిలేసి, మిగతా బ్యాటర్లను టార్గెట్ చేసుకుంది…
వోకే, ఇది క్రికెట్… ఫలితాన్ని ముంచే ఊహించలేం… ఇప్పుడు రెండు జట్లూ సేమ్… ఎవరూ తక్కువ కాదు… సో, రిజల్ట్ ఊహించలేం గానీ… చేజేతులా మ్యాచు అప్పగించిన వైఫల్యాల్ని, తప్పుల్ని, పొరపాట్లను చెప్పుకోకుండా ఉండలేం..!!
Share this Article