.
Jaganadha Rao ……. తెలంగాణ అనేది ఒక పవర్ హౌజ్. ఎలాగంటే..?
వివిధ రకాల ఉత్పత్తులు, ఆహారం, దుస్తులు, వివిధ రకాల సేవలు, కిరాయిలు, రవాణా ఖర్చులు మొదలైన వాటి ధరల పెరుగుదల రేటుని ద్రవ్యోల్బణం (Inflation) గా పిలుస్తారు.
Ads
భారత దేశంలో ప్రస్తుతం ది బెస్ట్ రాష్ట్రం అంటే తెలంగాణ. నిన్న రిలీజ్ చేసిన జాతీయ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) లెక్కల ప్రకారం మన దేశంలో తెలంగాణలో అతి తక్కువ ఇన్ ఫ్లేషన్ (1.3%) ఉంటే, ఎక్కువగా కేరళ (7.3%), చత్తీస్‌గఢ్ (4.9%), ఆ తర్వాత కర్ణాటక (4.5%), బీహార్ (4.5%) ఉన్నాయి.
తెలంగాణ తర్వాత తక్కువ ఇన్ ఫ్లేషన్ ఢిల్లీ 1.5%, ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ 2.4% ఉన్నాయి. నిజానికి మన దేశంలో ఎక్కువ పర్ క్యాపిటా ఉన్న రాష్ట్రం తెలంగాణ. సిక్కిం, గోవా లాంటి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో కూడా పర్ క్యాపిటా ఎక్కువే కానీ జనాభా పరంగా చూస్తే మన దేశంలో 2.7% జనాభా కలిగిన తెలంగాణ , GDP పరంగా చూస్తే దాదాపు 5% అంటే డబుల్.
అన్నింటిని పరిగణించి చూస్తే తెలంగాణ మన దేశంలో బెస్ట్ రాష్ట్రం. డబ్బులు ఉంటే హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ కొనుక్కోండి (నార్త్ హైదరాబాద్ లేదా వెస్ట్ హైదరాబాద్ లో కొంచెం తక్కువ ఉన్నై పస్తుతం ధరలు)
తెలంగాణ గ్రోత్ స్టోరీకి కారణం తెలంగాణ ప్రజలు, తెలంగాణ మట్టి మరియూ తెలంగాణ కల్చర్. మన దగ్గర కష్టపడే ప్రజలతో పాటు కష్టపడే విద్యార్ధులు ఉన్నారు. 1950 నుంచే గణితం, సైన్స్ సబ్జెక్ట్ లకి మన దగ్గర ప్రాధాన్యత ఎక్కువ.
దీనికి తోడు అనుకూల వాతావరణం. పీవీ నరసింహా రావు చేసిన సంస్కరణల ఫలితంగా ఫార్మా, టెక్నాలజీ కంపనీలు తమకు అనుకూలమైన దక్కన్ పీఠభూమిని ఎన్నుకోవటం కలిసి వచ్చింది.
మొన్న మొన్నటివరకు కూడా ప్రపంచంలో టాప్ 10 ఫార్మా కంపనీల్లో ఒక్కటీ లేదు హైదరాబాద్ లో. సర్కారు కృషి ఫలితంగా నోవార్టిస్ వచ్చింది, ఆ తర్వాత మెడ్ ట్రానిక్స్ వచ్చింది, ఇప్పుడు టాప్ 10 లో ఉన్న 7, 8 కంపనీలు హైదరాబాద్ కి లైన్ కడుతున్నాయి.
మన దగ్గర నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. తక్కువ రేటుకి నాణ్యమైన పని అవుతుంది, అన్నింటికీ అనుకూల ప్రాంతం. తెలంగాణ సక్సెస్ కి ఒక కారణం మన పరిశ్రమలు, ఐటీ మరియూ ఫార్మా సెక్టార్ అయితే ఇంకో ప్రధాన కారణం “తెలంగాణ అగ్రికల్చర్”. ఎలక్ట్రిసిటీ మరియూ నీళ్ళు రావటం వలన హైదరాబాద్ మాత్రమే కాకుండా రూరల్ తెలంగాణ కూడా అభివృద్ధి పథంలో నడవటం ప్రారంభం అయ్యింది.
అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఒక ఎకరం భూమి కొనండి. లేదా, హైదరాబాద్‌లో ఒక Flat లేదా plot కొనడం మంచి ఇన్వెస్ట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మాటలు కాకుండా, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం తీసుకుని కొనండి. (NOTE: ఇన్వెస్ట్ మెంట్ అనేది చాలా పెద్ద టాపిక్, అనేక అంశాలని పరిగణించి ఎవరికి ఏది సెట్ అవుతుందో అది చెయ్యాలి.., అందరూ భూమి, Flat లేదా plot కొనాలి అని చెప్పలేం, కానీ బాగుంటుందని సూచించగలం)…
Share this Article