Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ నెగెటివ్ రోల్‌లో జయసుధ…! ఆమెకు ఓ ఐటమ్ సాంగ్ కూడా..!!

July 17, 2024 by M S R

నోములు , వ్రతాలు అంటేనే ఆరోజుల్లో ఆడవారికి ఎంతో ప్రీతిపాత్రమైన విషయాలు . వాటికి తోడు పాతివ్రత్యం . వీటన్నింటికీ తోడు నాగరాజు సెంటిమెంట్ . తెలుగు మహిళలకు బ్రహ్మాండంగా నచ్చింది . వంద రోజులు ఆడించేసారు . ఎక్కడయినా ఒకటి రెండు చోట్ల సిల్వర్ జూబిలీ కూడా ఆడిందేమో !

భారతీయ సంస్కృతిలో పుట్టల్లోని పాములకు పాలు పోసి , ఆ పాములు ఊళ్ళల్లోకి , జనావాసాల్లోకి రాకుండా జాగ్రత్త పడేవారు . మా చిన్నప్పుడు మా నరసరావుపేటలో భరంపేటలో ఉన్న వాసుకీ క్షేత్రంలోని పుట్టలో ప్రతి ఆదివారం మా నాన్నగారితో కలిసి వెళ్లి పాలు పోసే వాళ్ళం . మా ఇళ్ళల్లో పిల్లల చెవులు కుట్టించే ఫంక్షన్లు అన్నీ అక్కడే . మళ్ళా సినిమాలోకి వద్దాం .

తమిళంలో సక్సెస్ అయిన Vellikizhamai Vratham సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . రామకృష్ణ , చంద్రకళ జోడీ రొమాంటిక్ గా ఉంటుంది . దానికి తోడు సత్యం సంగీతం సినిమాను సూపర్ హిట్ చేసింది . మంచి లిరిక్సును అందించిన సి నారాయణరెడ్డి , దాశరధి , ఆరుద్రలకు , శ్రావ్యంగా పాడిన సుశీలమ్మ , యస్ జానకి , బాల సుబ్రమణ్యంలకు అభినందనలు .

Ads

అందరి దైవం నీవయ్యా , నోము పండించవా స్వామీ పాటలు ఎంత హిట్టయ్యాయి అంటే ఇప్పటికీ పేరంటాళ్ళలో పాడుకుంటూనే ఉన్నారు . కలిసే కళ్ళలోన కురిసే పూలవాన , మనసే జతగా పాడిందిలే యుగళ గీతాల చిత్రీకరణ కూడా చాలా అందంగా ఉంటుంది .

jayasudha

పండంటి కాపురంతో సినిమా రంగంలోకి ప్రవేశించిన జయసుధ ఈ సినిమాలో వాంప్ / నెగటివ్ పాత్రలో నటించింది . తమిళంలో కూడా ఈ పాత్రను ఆమే నటించింది . ఆమెకో ఐటమ్ సాంగ్ కూడా ఉంది . శరత్ బాబు , కె వి చలం ప్రభృతులు నటించారు . కొత్త నటుడు శశి బాబు విలన్ పాత్రలో ఇంప్రెస్ చేయలేకపోయాడు . సినిమా అంతా బాగుండటం వలన అది కొట్టుకుపోయింది .

nomu

శాండో చిన్నప్ప దేవర్ అందరికీ తెలిసిన పేరే . జంతువులతో , పాములతో సినిమాలు తీయటంలో నిష్ణాతుడు . ఈ సినిమా కధ కూడా ఆయనదే . రాజేష్ ఖన్నా నటించిన హాథీ మేరే సాథీ అనే సినిమాను తీసింది కూడా ఇతనే . నోము సినిమాలో పాము , ముంగిస ఫైటింగ్ పిల్లలకు బాగా నచ్చింది . ఆరోజుల్లో రోడ్ల పక్క ఒక సంచార జాతి వారు ఈ పాము , ముంగిస ఫైటింగులు చూపిస్తుండేవారు . అందులో పడి స్కూలుకు పోకుండా దెబ్బలు కూడా తిన్నాం .

పట్టు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చక్కటి వినోదాత్మక , భక్తి పూర్వక సినిమా . మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసినట్లు గుర్తు . గుంటూరులో కూడా చూసా అప్పుడే . యూట్యూబులో ఉంది . సంగీత ప్రియులకు చాలా బాగుంటుంది . A feel good , romantic and entertaining movie #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……. ( By డోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జనగణనలో ‘సహజీవనాని’కీ గుర్తింపు… కానీ అది పెళ్లి సర్టిఫికెట్ కాదు…
  • పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ బజ్వాకు ఏమైంది..? తల ఎందుకు పగిలింది..?!
  • కాళేశ్వరంపై అభిశంసన సరే… మరి శిక్షించే చర్యలేవి మంత్రివర్యా…
  • కథ, లాజిక్కులు జాన్తా నై …. గరం మసాలాల దట్టింపుతోనే చల్తా…
  • అమెరికా- రష్యా… భలే గేమ్ వీళ్లది…
  • దశావతారం…! కథ కోసం పాత్రలా..? పది పాత్రల కోసం కథా..?!
  • ‘‘మీ ఏడుపే మాకు దీవెన’’… లారీల వెనుక కనిపిస్తుంటుంది కదా… ఇదే…
  • రియల్ లైఫ్‌పై రీల్ లైఫ్ ఇంపాక్ట్…! పాపం, ఓ సినిమా విలన్ కథ…!!
  • ఓటి కుండకు మోత ఎక్కువ- గిల్ట్ నగలకు మెరుపు ఎక్కువ…
  • పాపం సాక్షి..! పాత ఎడిటర్ వ్యాసాలకూ ఇంత నాసిరకం ప్రజెంటేషనా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions