సినిమా ప్రియులకు గుర్తుండే ఉంటుంది… అయిదేళ్ల క్రితం హిందీలో న్యూటన్ అనే సినిమా వచ్చింది… అప్పట్లో సూపర్ హిట్… 9, 10 కోట్ల ఖర్చుకు గాను 80 కోట్లు వసూలు చేసింది.,.. అప్పట్లో ఈ పాన్ ఇండియా కల్చర్ ఇంతగా ఇంకలేదు కదా… వదిలేశారు… కానీ దర్శకుడు ఏఆర్‌మోహన్ ఆ సినిమాలోని వోటింగ్ మెషిన్, టీచర్ ఎట్సెట్రా పార్ట్‌ను ఎత్తేసి, ఇక తనదైన కథను చుట్టూ అల్లుకున్నాడు… ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే పేరుతో తెలుగులో రిలీజైంది ఆ సినిమా ఇప్పుడు…
నిర్మాత గానీ, దర్శకుడు గానీ ఎప్పుడూ న్యూటన్ సినిమా ప్రస్తావనే తీసుకురాలేదు ఏ ప్రెస్‌మీట్లలో గానీ, ప్రెస్‌నోట్లలో గానీ… సరే, ఏదో ఓ కథ అనుకుందాం… ఎక్కడో ఎవరో విలేకరి అడిగితే దర్శకుడు మోహన్ ఏమన్నాడంటే… 2009లోనో, 2007లోనో తను ఓ ప్రెస్ క్లిప్పింగ్ చూశాడట, ఒక గర్భిణి ప్రసవం కోసం వెళ్లడానికి పడే అవస్థల ఫోటో అందులో పబ్లిష్ చేశారట, అప్పుడే కథ రాసుకున్నాడట… నిజమే కావచ్చుగాక… కానీ న్యూటన్ సినిమా నుంచి తీసుకున్న ఎపిసోడ్ల మాటేమిటి మరి..?!
ఇది ఓ సీరియస్ స్టోరీ… గిరిజనుల సమస్యల్ని ప్రస్తావిస్తూ, వాళ్ల తిరుగుబాటును, వాళ్ల ఆగ్రహాన్ని రెండు గంటల వ్యవధిలో చూపించడం అనేది పెద్ద టాస్క్… వాణిజ్య హంగులు ఉండవు కాబట్టి కథనం, సీన్స్ చిక్కగా ఉండాలి… పలుచోట్ల ఎమోషనల్ సీన్లు వావ్ అనిపించాలి… కేరక్టరైజేషన్ కూడా అలాగే ఉండాలి…
Ads
అదుగో అక్కడ మారేడుమిల్లి సినిమా తడబడింది… కామెడీ సినిమాలు చేసుకునే అల్లరి నరేష్ అవి వర్కవుట్ కావడం లేదని, సీరియస్ సినిమాల వైపు వచ్చాడు… నాంది ఆ కొత్త అడుగులకు నాంది… సంకల్పం మంచిదే కానీ ప్రజెంట్ ట్రెండ్ సీరియస్ స్టోరీలు కాదు… కొత్త తరహా కథలు, లేదా కొత్తతరహా కథన ప్రయోగాలు… ఆ జాడలేమీ ఈ సినిమాలో కనిపించవు… సింపుల్‌గా ఒక్క విషయం… ఏ ప్రాంతమైనా సరే, అభివృద్ధి అనేది ప్రభుత్వ విధానాల మీద ఆధారపడి ఉంటుంది… ప్రభుత్వ ఉన్నతాధికారులు తలుచుకోగానే సమస్యలు పరిష్కరించబడవు…
పోనీ, నరేష్ అసాధారణ నటన ఏమైనా ఉందా..? లేదు… ఆ పాత్రకు అవసరమైనంత చేశాడు… ఆ పాత్ర అంతకుమించి పర్మిట్ చేయదు… హీరోయిన్ సోసో… ఒక్క వెన్నెల కిషోర్ మాత్రమే కామెడీ పార్ట్‌ను ఒకింత ఎక్కువగానే మోశాడు… సామాజికాంశాల మీద సినిమాలు తీసినప్పుడు ఎక్కువ ఇష్యూస్ తీసుకుని కలగాపులగం చేయకూడదు… ఒకటీరెండు ఇష్యూస్ తీసుకుని బలంగా ఫోకస్ చేయాలి… ఆ సోయి కూడా కనిపించలేదు ఇందులో… కమర్షియల్ హంగులు లేని ఓ సీరియస్ స్టోరీ థియేటర్ల వద్దకు ప్రేక్షకులను రప్పించగలదా..? కష్టమే…!! ఓటీటీ హైనా…!! చివరగా :: ఈ సినిమాకు ఈ టైటిల్ అతి పెద్ద మైనస్…
Share this Article