Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆరాధన… ఆ రఫీ పాటలు ఈరోజుకూ చెవుల్లో గింగురుమంటూనే ఉంటాయి…

August 18, 2024 by M S R

1976 లోకి వచ్చాం . 1970 లో హిందీలో హిట్టయిన గీత్ అనే సినిమా ఆధారంగా ఈ ఆరాధన సినిమా తీయబడింది . హిందీలో రాజేంద్రకుమార్ , మాలా సిన్హా హీరోహీరోయిన్లుగా నటించారు . మన తెలుగులో NTR , వాణిశ్రీలు నటించారు . కులూ వేలీలో ఔట్ డోర్ షూటింగ్ జరిగింది .

సుందరమైన ప్రదేశాలను వీక్షిస్తాం . It’s a great musical and visual feast . మహమ్మద్ రఫీ – జానకమ్మ పాడిన పాటలు ఈరోజుకీ హిట్టే . ముఖ్యంగా రాధాకృష్ణుల నృత్య రూపకం . నంద కిశోరా బృందా విహారా పాటను జానకమ్మ అద్భుతంగా పాడారు . వాణిశ్రీ హావభావాలు , నాట్యం ఇంకా అద్భుతం . అలాగే మరో గీత రూపకం లైలా మజ్ను . లైలా లైలా అంటూ ప్రారంభమయ్యే పాటను రఫీ , జానకమ్మలు బాగా పాడారు .

సాలూరి హనుమంతరావు సంగీత దర్శకత్వంలో మిగిలిన పాటలు కూడా సూపర్ హిట్టయ్యాయి . నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై , నేడే తెలిసింది ఈనాడే తెలిసింది పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . దాశరధి , సి నారాయణరెడ్డి సాహిత్యాన్ని అందించారు . గొల్లపూడి మారుతీరావు సంభాషణలను వ్రాయగా బి వి ప్రసాద్ దర్శకత్వం వహించారు .

Ads

యన్టీఆర్ subdued గా పాత్రకు తగ్గట్టుగా చాలా హుందాగా నటించారు . రాజేంద్రకుమార్ కన్నా బాగా నటించారా అని కూడా అనిపిస్తుంది . వాణిశ్రీ అయితే మాలా సిన్హా కన్నా చాలా గొప్పగా నటించింది . ఇతర పాత్రల్లో విజయలలిత , జగ్గయ్య , గుమ్మడి , రాజనాల ప్రభృతులు నటించారు .

14 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . సిల్వర్ జూబిలీ చేసుకుంది . హిందీ గీత్ సినిమా శ్రీలంక లోని కొలంబోలో 604 రోజులు ఆడిన మొదటి సినిమా అట . ఈ గీత్ సినిమాను బంగ్లాదేశ్ లో ప్రేం గీత్ అనే టైటిల్ తో రీమేక్ అయింది . ఆరాధన అనే టైటిల్ తో మన తెలుగులో మూడు సినిమాలు వచ్చాయి .

1962 లో ANR , సావిత్రి , జగ్గయ్యలు ప్రధాన పాత్రధారులు … 1987 లో ఇదే టైటిల్ తో చిరంజీవి , సుహాసినిలు ప్రధాన పాత్రల్లో నటించారు… NTR , ANR సినిమాలు సూపర్ హిట్టయ్యాయి … జగ్గయ్య ఈ రెండు సినిమాలలోనూ నటించటం విశేషం .

థియేటర్లో , టివిలో ఎన్ని సార్లు చూసి ఉంటానో ! Definitely an unmissable movie . సినిమా యూట్యూబులో ఉంది . సంగీత ప్రియులకు బాగా నచ్చుతుంది . హిందీ సినిమా కూడా చాలా బాగుంటుంది . అదీ యూట్యూబులో ఉంది . సినిమా ప్రియులు తప్పక చూడండి . రెండు సినిమాలు కనులకు విందే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ….. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions