.
బీజీఎం అంటే బాక్సులు పగిలిపోయేంత లౌడ్‌గా ఉండాలి… అలా ఉంటేనే సీన్లు భీకరంగా ఎలివేటవుతాయి… ప్రేక్షకుడిని ఉర్రూతలూగిస్తుంది….. థమన్ ఇంకా ఈ భ్రమల్లోనే ఉన్నాడు… అంతేకాదు, మెలొడీ ఇతర జానర్ల పాటలకన్నా ఐటమ్ సాంగ్స్ మీదే తన తపన, దృష్టి, శ్రమ, ప్రయాస కనిపిస్తున్నాయి…
జాట్ అనే ఓ సినిమా వచ్చింది కదా తాజాగా… అది చూస్తే అలాగే అనిపిస్తుంది… ఇది తనకు రెండో హిందీ సినిమా… ఉన్నవే మూడు పాటలు, అందులో ఒకటి టచ్ కియా అనే ఐటమ్ సాంగ్… అదీ దబిడిదిబిడి సాంగులో బాలకృష్ణతో చరిపించుకున్న ఆ ఊర్వశి రౌతేలా ఐటమ్ మీద చిత్రీకరించారు…
Ads
అచ్చం ఓ తెలుగు సినిమాను హిందీ డబ్బింగుతో చూస్తున్నట్టుగా… దర్శకుడు గోపీచంద్ మలినేని భలే తీశాడు… పుష్ప, కేజీఎఫ్ తరహాలో ఇప్పుడు ట్రెండ్ అంతా ఫుల్లు ఎలివేషన్స్, భీకరమైన యాక్షన్ సీన్లు కదా… మైత్రి, పీపుల్స్ మీడియా నిర్మాతలు అడగ్గానే రవితేజను హీరోగా అనుకుని ఓ కథ రాయడం మొదలుపెట్టాడు…
నిర్మాతలు మరోవైపు జగపతిబాబు, రమ్యకృష్ణ, అజయ్ ఘోష్, మురళిశర్మ, టూమినట్స్ రెజినీ కసాండ్రా, దివి వాద్‌త్యా తదితరుల కాల్షీట్లు తీసుకుని అడ్వాన్సులు కూడా ఇచ్చేశారు,.. చివరకు శ్రీకాంత్ అయ్యంగార్ కూడా… రవితేజతో పారితోషికమే సరిగ్గా కుదరలేదో, డేట్లే కుదరలేదో గానీ మొత్తానికి రవితేజ హీరోగా కుదరలేదు…
సో వాట్… మన సినిమాలు నార్త్‌లో సూపర్ నడుస్తున్నాయి కదా, హిందీలోనే తీసేసి రిలీజ్ ఎందుకు చేయకూడదు అనుకున్నారు దర్శకనిర్మాతలు… మరెవరు హీరో..? సన్నీ దేవల్‌ను అడిగారు… ఏకంగా 50 కోట్లు ఆఫర్ ఇచ్చారు… టెంప్టయ్యాడు, సరేనన్నాడు… మరి విలన్..? రణదీప్ హుడా… ఎహె, విలన్ పాత్ర నేను చేయనుపో అన్నాడు మొదట్లో…
సన్నీతో చెప్పించారు… ఒప్పుకో భయ్యా, మా బ్రో బాబీదేవల్ విలన్‌గా చేయలేదా ఏం..? పాత్ర ముఖ్యం, పారితోషికం ముఖ్యం అని కన్విన్స్ చేశాడు… అలా మొదలైంది… కథదేముంది..? ఏదో ఓ చిన్న పాయింట్… హీరో ఇండియన్ ఆర్మీలో ఓ మాజీ బ్రిగేడియర్… ఏదో ఊళ్లో ఆగినప్పుడు టిఫినీ చేస్తుంటే అక్కడ విలన్ గ్యాంగు హడావుడిలో టిఫినీ ముక్క కింద పడుతుంది…
ఒరేయ్ అబ్బాయిలూ సారీ చెప్పండ్రా అంటే వాళ్లు చెప్పరు… చెబితే తమ బాస్ పరువు పోతుంది కదా మరి… నామోషీ… సారీ చెప్పకపోతే తాటతీస్తా అంటాడు హీరో… ఒక్కొక్కడినీ తాటతీస్తూ వెళ్తుంటాడు… చివరకు విలనుడు తగుల్తాడు… వాడెవడు..?
శ్రీలంక నుంచి వచ్చి మన ప్రకాశం జిల్లాలో ఓ ఊరిని కబ్జా చేసి, అరాచకాలు చేస్తుంటాడు… హీరో వాడితోనే తలబడతాడు… వాళ్ల గతం ఏమిటనేదే కథ… దాదాపు కేరక్టర్ల పేర్లన్నీ తెలుగువే… తెలుగు నటీనటులే జస్ట్ హీరో, విలన్, మరికొన్ని పాత్రలు తప్ప… అందుకే తెలుగులో తీసి, హిందీలోకి డబ్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది…
పైగా హైవోల్టేజీ యాక్షన్ సీన్లు… థమన్ బీజీఎం చిరాకు పెడుతూనే ఉంటాయి… కానీ దర్శకుడు ప్రిక్లైమాక్స్, క్లైమాక్స్ గట్రా బాగా రాసుకుని, బాగా తీశాడు… సన్నీ, రణదీప్ కూడా బాగా చేశారు… మిగతా పాత్రలకు పెద్ద ప్రాధాన్యం ఏమీ లేదు…
మాస్ ప్రేక్షకులను, అదీ యాక్షన్ సీన్లను ఇష్టపడే ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని తీసిన సినిమా… అందరికీ నచ్చాలని ఏమీ లేదు… అఫ్‌కోర్స్, ఔట్ డేటెడ్ ఫార్ములా కథలే అయినా సరే నార్త్ ఆడియెన్స్‌కు ఇప్పుడు ఈ సినిమాలే నచ్చుతున్నాయి కదా… డబ్బులు రాలొచ్చు బాగానే..!!
Share this Article