ఏదో యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ నటుడు నాగబాబు అన్నాడట… ‘‘పిలిస్తే మళ్లీ జబర్దస్త్‌కు వెళ్లడానికి రెడీ’’ అని..! చదవగానే కాస్త నవ్వొచ్చింది… ఈసారి లేటుగా వచ్చిన బార్క్ రేటింగ్స్ చూస్తుంటే జబర్దస్త్ ఢమాల్ అని పేలిపోతున్న తీరు గమనిస్తే జాలేసింది… ఫాఫం ఈటీవీ అనిపించింది… మల్లెమాల ఎంటర్‌టెయిన్‌మెంట్ కంపెనీని నమ్ముకుని ఈటీవీ కూడా మునిగిపోతున్నదా..? నాగబాబు వెళ్లి చేయడానికి ఏముందని అక్కడ..? దుబ్బ… మట్టి… తను వెళ్లి జడ్జి సీట్లో కూర్చోగానే అది ఉద్దరింపబడుతుందా..?
తనే గతంలో మల్లెమాల కంపెనీతో విభేదించి జీతెలుగుకు వెళ్లి, క్రియేటివ్ డైరెక్టర్లను కూడా తీసుకుపోయి అదిరింది షో స్టార్ట్ చేశాడు… నాలుగు రోజులకే అది స్టాప్… తరువాత మాటీవీలో కామెడీ స్టార్స్ షో… అదీ కొన్నాళ్లకే స్టాప్… ఇప్పుడు మళ్లీ ఈటీవీ జబర్దస్త్‌కు వెళ్తాడట… జడ్జిలు మారగానే జాతకం మారేంత సీన్ ఏమీ లేదక్కడ… ఆల్‌రెడీ చెడగొట్టేశారు…
ఇప్పటికే తెలుగు వినోద చానెళ్లలో మాటీవీ ఫస్ట్ ప్లేస్… జీతెలుగు, ఈటీవీలకు అందనంత దూరంలో ఉంది… అది జాతీయ స్థాయిలోనే టాప్-4 చానెల్ ఇప్పుడు… దాన్ని కొట్టడం మాట అటుంచి, కాస్త రేటింగ్స్‌లో దిగజారితే మాత్రం ఈటీవీ మరీ జెమిని టీవిని కూడా దాటేసి, నాలుగో ప్లేసుకు వెళ్తుందేమో అనిపిస్తోంది…
Ads
నిజానికి చానెళ్ల నడుమ పోటీల్లో కొన్నాళ్లు వాళ్లు, కొన్నాళ్లు వీళ్లు పైకీ కిందకు పడిలేస్తుంటారు… అయితే తమకు మంచి రేటింగ్స్ తెచ్చి పెట్టి, తమ ఉనికిని నిలబెట్టే ప్రోగ్రామ్స్‌ను కాపాడుకోవడానికి, స్ట్రెంథెన్ చేయడానికి ఏ చానెల్ అయినా ప్రయత్నిస్తుంది… ఒక్క ఈటీవీ తప్ప… తనకు ఆక్సిజెన్ వంటి జబర్దస్త్‌ను కూడా అది ప్రొటెక్ట్ చేసుకోలేకపోతోంది… పూర్ నిర్వహణ సామర్థ్యంతో చేజేతులా బొక్కపెట్టుకుంటున్నది…
సాధారణంగా ఈటీవీ అనగానే ఈటీవీ న్యూస్ బులెటిన్, జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, రీసెంటుగా శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్స్ తెచ్చిపెడుతుంటాయి అని అందరికీ తెలుసు… క్యాష్, ఢీ, ఆలీతో సరదాగా వంటి షోలు ఎప్పుడో దారి తప్పి, నేల మీద పాకుతున్నాయి… కొత్తదనం లేదు, క్రియేటివ్ నిర్ణయాలు లేవు, డైనమిక్ పోకడలు లేవు… ఇప్పుడు ఆ జబర్దస్త్ కూడా ఢమాల్ అంటోంది… దానికి తాజా బార్క్ రేటింగ్సే రుజువు…
హైదరాబాద్ కేటగిరీ ఓసారి చూద్దాం… ఈటీవీ టాప్-30 లిస్టులో జబర్దస్త్ లేదు, ఎక్సట్రా జబర్దస్త్ లేదు… వెతికితే ఎక్కడో 3.02 రేటింగ్ జబర్దస్త్ షోకు, 2.99 రేటింగ్ ఎక్సట్రా జబర్దస్త్ షోకు కనిపించాయి… రంగులరాట్నం, మౌనపోరాటం, శతమానంభవతి, మనసంతా నువ్వే వంటి సీరియళ్లకు రేటింగులున్నయ్ తప్ప జబర్దస్త్ ఎక్కడో దిగువన కొట్టుకుంటోంది… అఫ్ కోర్స్, ఈటీవీలో కూడా ప్రేక్షకులు సీరియల్స్ చూస్తున్నారనేది దానికి ఆనందకరమైన విషయమే…
అనసూయ వెళ్లిపోయింది, సుధీర్ వెళ్లిపోయాడు… పలువురు సీనియర్ కమెడియన్లు వెళ్లిపోయారు… చంటి బిగ్‌బాస్ వెళ్లి అటే… ఫైమా హౌజులోనే ఉంది… మిగిలిన కొందరు కమెడియన్లు పాపులర్ చేయలేకపోతున్నారు… షోని పైకి లేపడం వాళ్ల వల్ల కాదు… చివరకు హైపర్ ఆది మళ్లీ వచ్చాడు, గెటప్ సీను మళ్లీ వచ్చాడు అని ఎంత డప్పు కొట్టుకున్నా, వాళ్లతో కూడా ప్రయోజనం లేకుండా పోయింది… జడ్జిలు వస్తున్నారు, పోతున్నారు… కొంతలోకొంత కృష్ణ భగవాన్, ఇంద్రజ నయమే… కానీ బేసిక్‌గా స్కిట్ల ఫార్మాటే జనానికి నచ్చకుండా పోతోంది…
శ్రీదేవి డ్రామా కంపెనీకి ఖర్చు ఎక్కువ పెడుతున్నారు… ఏవో ప్రయోగాలు చేస్తున్నారు… అదీ నాసిరకంగా మారుతున్నా సరే, జబర్దస్త్ షోతో పోలిస్తే కొంత బెటరే… ఆదివారం మధ్యాహ్నం జనానికి ఏకైక వినోద కార్యక్రమం అదొక్కటే… వేరే టీవీల్లో కనీసం ఆ స్థాయి నాణ్యత ఉన్న ప్రోగ్రామ్స్ కూడా చేతకావడం లేదు… అవునూ, జబర్దస్త్‌ను అవసరమైన మేరకు మార్చుకుంటారా..? లేక అలా వదిలేస్తారా..? వదిలేస్తే మాత్రం ఈటీవీ, జెమిని టీవీ నాలుగో ప్లేసు కోసం కొట్లాడక తప్పదు… ఫాఫం ఈటీవీ…!!
Share this Article