చాలారోజుల తరువాత మళ్లీ ఓసారి బార్క్ వాడి టీఆర్పీలను పరిశీలిస్తుంటే…. ఈటీవీ నిర్వహణ, క్రియేటివిటీ తీరును చూసి ఆశ్చర్యమేసింది… మనం ఎన్నాళ్లుగానో చెప్పుకుంటున్నాం కదా, ఈటీవీలో వచ్చే జబర్దస్త్ అంతటి నికృష్టమైన బూతు ప్రోగ్రామ్ మరొకటి లేదు.., మల్లెమాల, రామోజీరావు, రోజా జాయింటుగా సిగ్గుపడాలీ అనుకుంటున్నదే కదా… కానీ విశేషం ఏమిటంటే..? ఈటీవీకి ఆ ప్రోగ్రామ్ ఒక్కటే ఆక్సిజెన్… అది లేకపోతే ఈటీవీ ఏకంగా మరో పాతాళ చానెల్ జెమినికన్నా దిగువకు ఢమాల్‌మని పడిపోవాల్సిందే… బోలెడు రియాలిటీ షోలు, సీరియళ్లు, సినిమాలు గట్రా వస్తున్నా సరే, కేవలం ఓ బూతు షో మాత్రమే ఓ టీవీ చానెల్‌ను నడిపిస్తున్న తీరు ఆశ్చర్యకరమే… ఇక్కడ రష్మి, అనసూయ, ఆది, సుధీర్ వంటి ఆర్టిస్టులను తిట్టాల్సిన పనిలేదు, వాళ్లవి పొట్టతిప్పలు… ఎటొచ్చీ ఈటీవీ, మల్లెమాలే అసలు నిందితులు…
ప్రస్తుతం ఈటీవీ పరిస్థితి ఏమిటో తెలుసా..? (యాడ్స్, మార్కెటింగ్ సర్కిళ్లు ప్రధానంగా చూసే 15 ప్లస్ కేటగిరీ) ఈటీవీ 597 రేటింగ్స్, ఉందో లేదో అన్నట్టుగా నడుస్తున్న జెమిని టీవీ రేటింగ్స్ 455… గాలికి వదిలేసిన జెమినితో ఈక్వల్ అయిపోతోంది క్రమేపీ ఈటీవీ… ఫాఫం, ఒకప్పుడు నంబర్ వన్ స్థానం కోసం పోటీపడిన చానెల్ ఈటీవీ… చివరకు ఓ బూతు షో మీద ఆధారపడి నడుస్తోంది… మాటీవీ 1025 రేటింగ్స్, టాప్ రేంజ్… ఈటీవీ తలకిందులుగా తపస్సు చేసినా దాన్ని అందుకోలేదు, ఎందుకంటే… ఏక్‌సేఏక్ అనబడే దాదాపు 16 సినిమా హక్కుల్ని కొనేసింది అది… ఆగస్టులో బిగ్‌బాస్ రాబోతోంది… సో, మాటీవీ రేటింగ్స్ కనీసం 1300 దాటిపోతాయని అంచనా వేస్తున్నది ఇండస్ట్రీ…
Ads
జీ తెలుగు విషయానికొస్తే… మాటీవీతో పోటీపడాలని విశ్వప్రయత్నం చేస్తున్నది కానీ… దాని క్రియేటివ్ టీమే దానికి పెద్ద మైనస్… అలాగే దాని మార్కెటింగ్ టీం కూడా…! ఖర్చు పెడుతున్నారు కానీ ఫలితం ఉండటం లేదు… బట్, ప్రేక్షకులు దాన్ని నంబర్ టూ స్థానంలో ఉంచుతున్నారు… మరీ ఈటీవీని కరివేపాకులా తీసిపారేసినట్టుగా పారేయడం లేదు… అంతెందుకు, దిగువన ఓ టేబుల్ చూడండి… హైదరాబాద్ మార్కెట్‌లో ఇప్పటికీ జీ వాడే నంబర్ వన్… అది వదిలేస్తే ఇక రూరల్, అర్బన్ మార్కెట్లలో మాటీవీయే కింగ్… (రేటింగుల్లో మతలబులు ఉంటాయనే ఆరోపణ ఉన్నా సరే… )
దిగువన ఓ టేబుల్ నిశితంగా పరిశీలించండి… ఈటీవీ ఎక్కువ రేటింగ్స్ వచ్చే ప్రోగ్రాములు… సద్దురు సాయి, శతమానం భవతి, రావోయి చందమామా వంటి సీరియళ్లు ఉత్త ఫ్లాపులు… మనసు మమత, యమలీల, నాపేరు మీనాక్షి కాస్త బెటర్… ఇక రియాలిటీ షోలలో కూడా ఆలీతో సరదాగా గెస్టుల ఎంపిక ఈమధ్య దరిద్రంగా ఉండటంతో ఆ రేటింగ్సూ ఢమాల్ అంటున్నాయి… ఇక కిట్టీ పార్టీలాగే నడిచే సుమ క్యాష్ షో, దాదాపు అలాగే ఉండే సాయికుమార్ వావ్ కూడా అంతే… ఈటీవీకి దన్నుగా నిలబడుతున్నది ఈటీవీ న్యూస్ బులెటిన్… తరువాత డాన్స్ షో ఢీ… ఇక మిగిలింది జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్…
దీన్ని సొమ్ము చేసుకోవడానికి పాత బిట్లను చూపించే కక్కుర్తి షో జబర్దస్త్ ఎక్సట్రా డోస్… దాన్ని వదిలేస్తే జబర్దస్త్ షో 10 దాటి రేటింగ్స్ సాధిస్తోంది… అలాగే ఎక్సట్రా జబర్దస్త్ కూడా పది దాకా రేటింగ్స్… దాదాపు రెండూ సేమ్… టైమింగు తెలియని కొత్త కొత్త కమెడియన్లను పట్టుకొచ్చి, ఏవో పిచ్చి ప్రయోగాలు చేస్తున్నా సరే… తనకు అలవాటైన ఆ బూతునే పట్టుకుని వేలాడుతున్నా సరే… ఈరోజుకూ ఓ చానెల్‌ను నిలబెడుతున్నది అదే… ఎందుకు విశేషంగా చెప్పుకోవాలీ అంటే… మాటీవీ వాడు డాన్స్, కామెడీ షోలకు సంబంధించి అట్టర్ ఫ్లాప్… ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ మరీ ఎక్కువ రేటింగ్స్ సాధించడం లేదూ అంటే, మాటీవీ వాడి కామెడీ స్టార్స్ కూడా పెద్దగా క్లిక్ కాలేదు… ఈమధ్య ఈటీవీ ప్లస్ కోసం సుమ మొగడు రాజీవ్ జడ్జిగా చేస్తున్న రెచ్చిపోదం బ్రదర్ అనే కామెడీ షో కూడా ఫ్లాపే… జీవాడికి కామెడీ షోలు అచ్చిరాలేదు, ప్రస్తుతానికి ఏమీలేవు… సో, ఇన్ని ఫ్లాప్ కామెడీ షోల నడుమ ఓ పర్‌ఫెక్ట్ బూతు షో జబర్దస్త్ తన ప్రాభవాన్ని నిలుపుకుంటూ, ఓ చానెల్‌ను నిలబెడుతున్న తీరు ఆశ్చర్యకరమే…!!
Share this Article