ఆది అంటే అసలు చెప్పాలనుకున్న విషయం వేరే గుర్తొచ్చింది… మొన్నటి నుంచీ ఈటీవీ ఢీ షో ప్రోమో వేసి చావగొడుతున్నారు… బోలెడు సైట్లు… హవ్వ, హైపర్ ఆదికి ఘోర అవమానం, సిగ్గుందా, సిగ్గుంటే కూర్చో, లేకపోతే వెళ్లు అని జడ్జి పూర్ణ మొహం పట్టుకుని వాయించేసింది అని రాసేస్తున్నాయి… అవి చదువుతుంటే నవ్వొచ్చింది…
ఈటీవీ, మల్లెమాల సంస్థల్లో ఎవరైనా ఇప్పుడు హైపర్ ఆదిని పల్లెత్తు మాట అనే సీనుందా అసలు..? ఢీ, జబర్దస్త్, డ్రామా కంపెనీ… ఎక్కడ చూసినా తనే, డాన్సులు చేస్తుంటాడు… ఎవరు కనిపించినా రాగింగు చేస్తుంటాడు… ఎవరైనా బాధితులే… కిక్కుమనరు… అలాంటిది ఈ పూర్ణ అయినా, సంపూర్ణ అయినా, పరిపూర్ణ అయినా హైపర్ ఆదిని సిగ్గుందా అనేంత సాహసం చేస్తుందా..? పైగా అది అసలే ఢీ షో… నానాటికీ కొడిగడుతున్న షో… దారుణమైన రేటింగ్స్..,.
ఎప్పుడు ఏ జడ్జి వచ్చి కూర్చుంటుందో, కూర్చుంటాడో ఎవరూ చెప్పలేరు… అలాంటిది కొత్తగా పెళ్లి చేసుకున్న పూర్ణ హైపర్ ఆదిని పట్టుకుని సిగ్గుందా అని గోక్కునే పని ఎందుకు చేస్తుంది..? జస్ట్, ఉత్త ప్రోమో హడావుడి… తీరా చూస్తే షోలో ఏమీ ఉండదు… భజగోవిందం, బభ్రాజమానం… సరే, పూర్ణను అలా పక్కన పెట్టేస్తే… ఎవరీ సౌమ్య..?
Ads
బేసిక్‌గా తనది షిమోగా… అక్కడే చదువుకుంది… తరువాత కొన్నాళ్లు న్యూస్ ప్రజెంటర్‌గా చేసింది… తమిళంలో టీవీ నటిగా మొదలుపెట్టి, కన్నడంలో క్లిక్కయి… ఈమధ్య తెలుగు సీరియళ్లలో కనిపిస్తోంది… తెలుగు టీవీ సీరియళ్లలో మొత్తం కన్నడ లేడీ స్టార్లే కదా… ఈమె మొదటిసారి ఎక్కడ ఈటీవీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందంటే ఆమధ్య భలే మంచిరోజులు అనే ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసింది… హైపర్ ఆది పంచులు వేసేకొద్దీ ఆమె తెలిసీతెలియని తెలుగులో కౌంటర్లు వేసింది…
కావాలని ఉద్దేశపూర్వకంగా కౌంటర్లు వేసినట్టు గాకుండా… కాస్త తెలియనితనమే కనిపించింది… ఈటీవీ సీరియళ్లు, స్పెషల్ షోలో పార్టిసిపెంటు… ఇంకేముంది..? తెచ్చి యాంకర్ కుర్చీలో కూర్చోబెట్టారు… రాగానే ఆది మళ్లీ ర్యాగింగ్ స్టార్ట్ చేశాడు, నువ్వు యాంకర్‌వా అనే వెటకారంతో… ఏం, నువ్వు కమెడియన్ కాగా లేనిది నేను యాంకర్ కావద్దా అని వేసింది… అంతేకాదు, ఆది ఎత్తు తనకన్నా తక్కువ అని చూపిస్తూ అబ్బే వర్కవుట్ కాదు అన్నట్టుగా ఫీలింగ్, ఎక్స్‌ప్రెషన్ పెట్టింది… సో, వచ్చే ఎపిసోడ్ల నుంచి ఆది పంచులకు గురికాబోతోంది…
నిజానికి జబర్దస్త్ జడ్జిలు స్కిట్లు చేయాల్సిన పనేమీ లేదు కదా… స్కిట్లను ఫాలో అవుతూ, అప్పుడప్పుడూ హహహ అని నవ్వుతూ… జడ్జిల అభిప్రాయాలు అడగడమే కదా… మరి ఇన్నాళ్లు రష్మి, అనసూయ చేసింది కూడా అదే కదా… మరి సౌమ్య ఎందుకు పనికిరాదు..? నాలుగురోజులు పోతే అలవాటైపోతుంది… అందరూ అర్జెంటుగా సుమాంటీలు కాలేరు కదా… సో, ఆల్ ది బెస్ట్ సౌమ్య…!!
Share this Article