ఈ వార్త చదివారా..? జగన్ కాలి మడమకు నొప్పి అట… దేహంలో ఇంకెక్కడైనా మడమలు ఉంటాయా..? ఏమో… సదరు పత్రికకే తెలియాలి… ఉంటాయేమో… చేతి మడమ, నడుం మడమ, మెడ మడమ ఎట్సెట్రా ఉండే ఉంటాయి… మనకే అవి తెలియవు… అంతే…
అవునూ… ఏమయ్యా జగన్… మడమ నొప్పి అంటే సీరియస్ కదా… తిప్పినా తిప్పకపోయినా సరే, మడమ అంటూ క్షేమంగా ఉండాలి కదా… మరెందుకు ఈ అశ్రద్ధ..? మా కేసీయార్ చూడు, పన్ను నొప్పి వచ్చినా, కన్ను ఇష్యూ వచ్చినా ఢిల్లీకి ఉరుకుతడు… లేదంటే, కనీసం వాళ్ల యశోద దాకా పోతడు… మరి నువ్వేమిటయ్యా, మడమ నొప్పి అనగానే అక్కడే బెజవాడలో డయాగ్నయిజ్ చేయించేసి ఊరుకున్నవ్… కనీసం హైదరాబాద్ అపోలో లేదంటే కేర్ ఎట్సెట్రా పిలవలేదా..? అనగా, పోలేదా..?
Ads
ఐనా ఆశ్చర్యం గాకపోతే మరేమిటి..? మడమ తిప్పను తిప్పను అని భీష్మించుకుంటే ఎప్పుడోసారి మడమలోని ఎముకలోె, కండరాలో స్టక్ అయిపోయి నొప్పి లేస్తుంది… కానీ అప్పుడప్పుడూ మడమ తిప్పుతూనే ఉన్నాడు కదా… ఐనా మడమ నొప్పి రావడం ఏమిటి అసలు..? ప్రత్యేక హోదా, అమరావతి, శాసనమండలి, ఉద్యోగుల పెన్షన్ సిస్టం, కోడికత్తి, బాబాయ్ హత్య ఎట్సెట్రా చాలా అంశాల్లో మడమను చాలా కన్వీనియెంట్‌గా తిప్పాడు కదా… అలా మడమ తిప్పిన ఉదాహరణల్ని టీడీపీ వాళ్లను చెప్పమంటే పెద్ద జాబితాయే చెబుతారు…
అప్పుడిక మడమ ఫ్రీగా అయిపోవాలి కదా… ఐనా సరే మడమ నొప్పి రావడం ఏమిటి..? అదే డాక్టర్లకు అంతుపట్టిందో లేదో మరి… అందుకే ఓసారి ఢిల్లీ దాాకా వెళ్లి చూపించుకోవాల్సింది… అబ్బే, పీఎం ఆఫీసులో కాదు, ఎయిమ్స్ లేదంటే మరో హాస్పిటల్‌లో..! డాక్టర్ అమిత్ షా లేదంటే డాక్టర్ మోడీ వంటి ఈ మడమ తిప్పులకు, నొప్పులకు స్పెషలిస్టుల దాకా అవసరం లేదేమో… ప్చ్, అసలే కొంతకాలంగా మడమ నొప్పి అంటున్నాడు ఆంధ్రప్రభ వాడు… సో, జాగు చేయక, నిర్లక్ష్యపరచక అలా ఓసారి ఢిల్లీ వెళ్లిరావాలి జగన్ సార్… (జస్ట్, ఓ సరదా కథనం… ఆఫ్ బీట్…)
Share this Article