పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేయడం మీద గతంలో నానా యాగీ చేసిన టీఆర్ఎస్ కిక్కుమనడం లేదు ఇప్పుడు…! అది జగన్‌తో దోస్తీయా, మరింకేదో కారణమా తెలియదు గానీ… ఈ అంశం టీఆర్ఎస్కు దక్షిణ తెలంగాణలో మైనస్ కాబోతోంది… ఇది కేసీయార్‌కు తెలియదని ఎవరూ భావించడం లేదు… కానీ ఎందుకు ఉపేక్షిస్తున్నాడో ఎవరికీ అర్థం కాదు… జగన్‌తో ఉన్న హార్ధిక, ఆర్థిక ప్రయోజనాలకు తెలంగాణ మనోభావాల్ని కూడా పణంగా పెడతాడా అనేది నమ్మలేం కానీ… ఏదో ఎక్కడో భీకరంగా తేడా కొడుతున్నది అనేది మాత్రం వాస్తవం…
కేంద్ర జలశక్తి శాఖ చెప్పినా… ఇంకెవరు చెప్పినా… రాయలసీమ లిఫ్టు, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు మీద జగన్ ఔట్‌రైట్‌గా ముందుకే వెళ్తున్నాడు… మొండి ఘటం, పైగా బోలెడన్ని రాజకీయ సమీకరణాలు ఇమిడి ఉన్నాయి అందులో… తను ఊరుకోడు… ఆరు నూరైనా ముందుకే వెళ్తాను అంటున్నాడు… పులివెందుల మీటింగులోనూ అదే చెప్పాడు… వేరే పత్రికలకు ఈ పాయింట్ ఇంపార్టెన్స్ అర్థం అయ్యిందో లేదో తెలియదు కానీ.,. జగన్ మాత్రం క్లియర్ కట్‌గా నా బాట నాది, కేసీయార్ గీసీయార్ ఏం చెప్పినా సరే, జాన్తానై అంటున్నాడు స్పష్టంగానే…
Ads
తాను తలపెట్టిన ప్రాజెక్టులే రాయలసీమకు బెస్ట్ అని ఆల్రెడీ జనంలోకి వెళ్తున్నాడు… ‘‘భయ్యా కేసీయార్, నీ పొలిటికల్ ఇంట్రస్టుల సంగతి నాకేమిటి గానీ, నాకు మాత్రం ఇది ముఖ్యం… నేను ఆగను… అవి పూర్తిచేయకుండా ఊరుకోను… నా ఇంట్రస్టు అది…’’ అనే మెసేజ్ క్లియర్‌గానే కేసీయార్‌కు చెబుతున్నాడు…
ఇది ఎవరికి నష్టం..? ఎవరికి లాభం..? అనేది పక్కన పెడితే… రేప్పొద్దున ఈ పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు, రాయలసీమ లిఫ్టు అనేవి ఎల్ఆర్ఎస్, ధరణిలాగే కేసీయార్‌కు నష్టం చేయబోతున్నాయి అనేది క్లియర్… ఎలాగూ టీఆర్ఎస్లో వేరే ఎవరూ ఆలోచించేవాళ్లు, చెప్పేవాళ్లు ఉండరు కాబట్టి… కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీయారే కాబట్టి…. జగన్‌తో ఏం లావాదేవీలు ఉన్నాయనేది వదిలేస్తే… తనకు రాజకీయంగా నష్టం చేయబోయే ఈ అంశాలపై కేసీయార్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అనేది ఆశ్చర్యకరమే…!!
Share this Article