- తిరుపతి నుంచి విశాఖ వరకు ఒక రైలును ప్రారంభించి అందులోనే రాజధాని ఉంటుందని ప్రకటిస్తే ఏ గొడవా ఉండదు. ఎవరికి వారు తమ ఊరికే రాజధాని వచ్చిందని మురిసిపోవచ్చు. ఇందుకు పెద్దగా ఖర్చు కూడా అవదు.
- రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తే ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారు. అదే జరిగితే ప్రజలు తనకు ఓటు బ్యాంకుగా ఉండబోరు. అధికారం కూడా దూరమవుతుంది. తన కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలంటే అధికారం ఉండాలి. అందుకోసం ప్రజల మద్దతు కావాలి. కనుక నవరత్నాల పేరిట డబ్బు పంచుతూ ఓటు బ్యాంకును అభివృద్ధి చేసుకుంటున్నారు.
…… ఇవి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకున్న ‘కొత్త పలుకు’లోని కొన్ని వాక్యాలు… ఇక మీకు చెప్పడం నావల్ల కాదు, మీ ఖర్మ, అనుభవించండి అని ప్రజలకు కూడా చెప్పేశాడు ఫాఫం… అవును మరి, చెప్పీ చెప్పీ… రాసీ రాసీ అలిసిపోతున్నాడు గానీ జనం మారడం లేదు, ప్రశ్నించడం లేదు, వీథుల్లోకి రావడం లేదు, జగన్ దిగిపోవాల్సిందే అని ఉద్యమించడం లేదు… కేంద్రం పట్టించుకోవడం లేదు, వెంటనే జగన్ కుర్చీ కాళ్లు నరికేయడం లేదు, జైలుకు పంపించడం లేదు, రాష్ట్రపతిపాలన పెట్టడం లేదు… ప్చ్, ఆర్కే అవిశ్రాంత రచయితే కానీ ఎంత చెప్పినా జనం వినకపోతే, ఏదీ జరక్కపోతే కాస్త నిరాశకు గురికావడం సహజమే కదా… అందుకే పైన చెప్పినట్టు ‘అపర మేధావి’ అంటూ పలు వెటకారాలు రాతల్లో ఎక్కువైపోయినయ్…
నిజానికి ఈరోజు కొత్తపలుకులో ప్రస్తావించిన జగన్ వైఫల్యాలు చాలావరకూ నిజాలే… ప్రత్యేకించి ఏపీ ఆర్థిక పరిస్థితి… అప్పులు తీసుకొస్తున్న తీరు, దానికి రూల్స్ ఉల్లంఘనలు… కొత్త కొత్త డొంకతిరుగుడు పద్దతులు, కేంద్రం కళ్లుగప్పే ప్రయత్నాలు… ఆర్కే అడిగిన ప్రశ్న సబబే… 180 శాతం వరకూ అప్పులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వొచ్చునని రాష్ట్రమే బిల్ పాస్ చేసుకుంటే ఇక ఎఫ్ఆర్‌బీఎం దేనికి అని..! నిజమే… కట్టడి చేయలేకపోవడం కేంద్రం వైఫల్యమే… అంగీకరిద్దాం, కానీ ఆర్థిక సంస్థలు, బ్యాంకులు జగన్ అడగ్గానే అప్పులు ఎందుకు ఇచ్చేస్తున్నయ్… ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే సరిపోతుందా..? వాటికి బాధ్యత లేదా..? ఇదొక పెద్ద సబ్జెక్టు… ఇది డిస్కస్ చేస్తున్నప్పుడు కాస్త సీరియస్‌నెస్ అవసరం… అదేదీ లేకుండా నాలుగు వెటకారాలు రాయగానే… పాఠకుడికి ఓ తేలిక అభిప్రాయం ఏర్పడిపోయింది… ఆర్కే ఇంతేలే… ఎంతసేపూ జగన్ మీద ద్వేషం, చంద్రబాబు మీద మమకారం, తెలుగుదేశం కార్యకర్తలాగే రాశాడు అంటారు… ప్రత్యేకించి రాష్ట్రం డెవలపైతే జనం తనకు వోటేయరు కాబట్టి ఇలా డబ్బు పంచేసి తనవైపు తిప్పుకుంటున్నాడు అనే వాదన జస్ట్, అబ్సర్డ్… పైగా తన రాతల్లో ఓ విజ్ఞత లేదు, గాఢత లేదు అనే అభిప్రాయానికి తనే తావిస్తున్నాడు ఆర్కే…
Ads
జగన్ తీసుకునే చాలా నిర్ణయాల మీద చాలా విమర్శలున్నయ్… వస్తున్నయ్… ఉదాహరణకు, మండలి… అదొక శుద్ధ దండుగ అన్నది జగనే… మళ్లీ ఆ రద్దు బిల్లు వాపస్ తీసుకునేదీ తనే… ఇలా చాలా… ఏ విషయం మీద కూడా ఫరమ్ స్టాండ్ లేదు… మూడు రాజధానులు అనేది ఓ ప్రహసనం… డప్పు కొట్టే భృత్యగణం… తూచ్ నిర్ణయాలు, దిగజారిపోతున్న ఆర్థికం… కొత్త పెట్టుబడుల్లేవు… నిజంగానే రెండున్నరేళ్లలో ఏం చేశావయ్యా అనడిగితే… సమాధానం..?! అఫ్ కోర్స్, అంతటి చంద్రబాబు అయిదేళ్లలో చేసింది కూడా అంతేగా… మాట్లాడితే ఆ కమీషన్ల పట్టిసీమ తప్ప మరొకటి ఏముంది..? అసలు రాజధాని వ్యవహారాన్ని ఓ పెద్ద ఫెయిల్యూర్ ప్రాజెక్టు చేసిందే తను… సరే, అవన్నీ వదిలేస్తే… జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడు, లేటయితే ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది, ఈలోపే ఎన్నికలు పెట్టేసి, చంద్రబాబు కళ్లు తెరుచుకుని, ప్లాన్ చేసుకునేలోపు మళ్లీ గెలిచి కుర్చీ కాపాడుకోవాలి అని జగన్ భావిస్తున్నాడట… సో వాట్, అది నిజమా కాదా వదిలేస్తే, అందులో తప్పేమీ లేదుగా… ఆఫ్టరాల్, ఆ అధికారం కావాలంటే రాజకీయాలు, అవి సక్సెస్ కావాలంటే ప్లాన్లు తప్పవు కదా… కానీ నిజంగా ఎర్లీ పోల్స్ వైపు పరుగు తీయాల్సిన స్థాయిలో జగన్ పట్ల జన వ్యతిరేకత పెరిగిందా..? ఇది కూడా ఓ తూచ్ ప్రచారమేనా…? ఆర్కే కాదు, ఏదైనా థర్డ్ పార్టీ న్యూట్రల్ సర్వే ఏజెన్సీలు చెప్పాలి..!
Share this Article