అమరావతి భూకుంభకోణం లేదా ఇన్సైడర్ ట్రేడింగ్…. ఎక్కడ రాజధాని రాబోతున్నదో ముందే లీక్ చేసి, తన వారితో అడ్డగోలు తక్కువ రేట్లకు కొనుగోలు చేయించాడనేది చంద్రబాబు మీద జగన్ ప్రభుత్వం ఆరోపణ… హైదరాబాద్ హైటెక్ సిటీ విషయంలో ఏం జరిగిందో పక్కన పెడితే… అమరావతి రాజధాని అనేది ఓ పెద్ద ల్యాండ్ స్కామ్ అనేది జగన్ విమర్శ… మరి దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడా..? ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నాడు అనేది కూడా కాసేపు పక్కన పెడదాం…
తాజాగా హైకోర్టులో జరుగుతున్న ఓ కేసు విచారణలో ఒక అఫిడవిట్ దాఖలైంది… అందులో చాలా స్ట్రెయిటుగానే ప్రభుత్వం, అనగా సీఐడీ అడిషనల్ ఎస్పీ దాఖలు చేసిన అఫిడవిట్ ఏం చెబుతున్నదంటే…
Ads
చంద్రబాబుకు అన్నీ తెలుసు… తెలిసే చేశాడు… ఇదొక కుట్ర… తమ వాళ్లకు మేలు చేసే దుశ్చర్య… చంద్రబాబు స్వయంగా సంతకం చేసిన నోట్ ఫైల్ కు ఆధారమైన ‘రాజధాని ఊళ్ల’ గుర్తింపు జీవోలను సెక్రెటేరియట్లోని మున్సిపల్, రెవిన్యూ వ్యవహారాలు చూసే సిబ్బందికి సంబంధం లేకుండా విడుదలయ్యాయనేది ఓ ఆరోపణ… ఈమేరకు కొందరు సిబ్బంది అంగీకరించారనేది సీఐడీ చెబుతున్న మాట… దాన్నే హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించింది సీఐడీ విభాగం…
అంటే… ఈ మొత్తం ఇన్సైడర్ బాగోతానికి చంద్రబాబే సూత్రధారి, దురుద్దేశాలతోనే ఇదంతా జరిగింది అనేది తాజాగా ఏపీ ప్రభుత్వం వాదన… నేరుగా చంద్రబాబునే టార్గెట్ చేస్తోంది… ఒకసారి ఈ టైమ్స్ వార్త చూడండి…
కానీ సాక్షి సహా తెలుగు పత్రికలు కేవలం కోర్టులో విచారణాంశాల్ని మాత్రమే రిపోర్ట్ చేశాయి తప్ప, ఈ అఫిడవిట్ అంశాల్లోకి లోతుగా వెళ్లలేదేమో అనిపించింది… ఈనాడు, ఆంధ్రజ్యోతి సహజంగానే… భూములు కొంటే తప్పేమిటి అనే లాయర్ వాదననే హైలెట్ చేసుకున్నాయి… వాటి పొలిటికల్ లైన్ అదే కాబట్టి అలాగే రాసుకుంటాయి… కానీ సాక్షికి ఎందుకు సోయి లేదు..? అసలు ఈ అఫిడవిట్ ముఖ్యం కదా అంటారా..? సర్లెండి, సాక్షి గురించి చెప్పుకోవడానికి ఏముంది..?
కానీ ఏతావాతా మనకు అర్థమయ్యేది ఏమిటీ అంటే… ఈ కేసులో క్రమేపీ చంద్రబాబును ఫిక్స్ చేస్తున్నారు… ఒక సీఎంగా తను అనైతికంగా వ్యవహరించాడు, కుట్రపూరితంగా నడుచుకున్నాడు అని జగన్ ప్రభుత్వం వాదించదలుచుకుంది… తద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్ అనబడే ఓ వేల కోట్ల రూపాయల పెద్ద బాగోతానికి చంద్రబాబే సూత్రధారి, పాత్రధారి అని అన్నిరకాలుగా నిరూపించే ప్రయత్నాల్లో ఉందీ అని అర్థం… అఫ్ కోర్స్, ప్రస్తుతం జగన్ ప్రభుత్వం వర్సెస్ జుడిషియరీ అనే అధ్యాయంలో ఏం జరుగుతుంది అనేది అనూహ్యం… కానీ జరుగుతున్న పరిణామాలు కూడా తెలుగు పత్రికల్లో సరిగ్గా, నిష్పక్షపాతంగా రిపోర్ట్ కావడం లేదూ అనేదే ఇక్కడ మనం చెప్పుకునేది…!!
Share this Article