ఇక ఈ దేశాన్ని, ఈ న్యాయవ్యవస్థను బాగుచేయడం నా వల్ల కాదు అన్నట్టుగా సాగిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాసంలోకి మరీ లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు… తన బాస్ జైలులో పడితే అర్జెంటుగా బెయిల్ ఇచ్చేయాలి, క్వాష్ పిటిషన్ క్లియర్ చేసి, చంద్రబాబును బయటికి పంపించేయాలి… కేసులు పెట్టిన సీఐడీ అధికారులను, వాళ్ల బాస్ జగన్‌ను శిక్షించాలి వీలైతే… అన్నట్గుగా సాగింది తన వ్యాసం…
సహజమే… చంద్రబాబు గురించి చంద్రబాబుకన్నా ఎక్కువ ఆందోళనపడే బ్యాచులో అగ్రగణ్యుడు రాధాకృష్ణ… తన రాతలు కూడా సగటు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు స్థాయిలో ఉంటున్నాయి… ఏసీ కావాలి, మంచం కావాలి, బయటి తిండిని అనుమతించాలి, ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడేమో కంటికి ఆపరేషన్ చేయాలి, అసలు భద్రతే కరువు, చంపేస్తారో ఏమో… వంటి చాలా సాకుల్ని వరుసగా బయటికి తీస్తున్నారు… అదీ సహజమే… ఏదో ఒక సాకు…
మరోవైపు చంద్రబాబు రిమాండ్‌కు ఆదేశించిన న్యాయమూర్తిని నిందిస్తూ, ఇలాంటోళ్లకు శిక్షలు లేవా..? దేవుడా, ఇక ఈ వ్యవస్థను ఎవరు బాగుచేయాలి మహాప్రభో అన్నట్టుగా రాస్తూపోయాడు… సరే, తన ఇష్టం, తన పత్రిక, తన ఫేవరెట్ లీడర్… కానీ ఇదే వైఖరి జగన్ జైలు జీవితం, అక్రమ కేసుల గురించి రాయలేదేం..? పైగా బెయిల్ వస్తే బాధపడటం… ఇక ఇప్పుడైతే ఇంకా ఎక్కడికో వెళ్లిపోయాడు రాధాకృష్ణ… అన్నట్టు జైలు నుంచి బయటికి రావడానికి జగన్ ఏ సాకులూ చెప్పలేదు…
Ads
రాధాకృష్ణ రాతల్లోని ఓ ముఖ్య పేరా చదవండి…
చంచల్‌గూడ విలాసాలు…
కొంతకాలం క్రితం హైదరాబాద్‌లోని చంచల్ గూడ జైలులో రెండు నెలల పాటు గడిపిన ఒక రాజకీయ ప్రముఖుడిని అక్కడి పరిస్థితుల గురించి నేను అడిగాను. ఆయన చెప్పిన మాటలు విన్నాక నేను నోరు వెళ్లబెట్టాల్సి వచ్చింది. ఆయన చెప్పిన దాని ప్రకారం.. చంచల్‌గూడ జైల్లో సకల సౌకర్యాలూ లభిస్తాయి. మాంసాహారంతోపాటు ఏం కావాలన్నా వండిపెట్టేవారు సిద్ధంగా ఉంటారు. కాళ్లూ, ఒళ్లూ మర్దన చేసే వాళ్లు కూడా ఉంటారు. రాత్రి వేళల్లో మందు కావాలన్నా సరఫరా చేస్తారు. ఇవన్నీ చేయడానికి చంచల్‌గూడ జైల్లో ఒక ముఠా ఎప్పుడూ రెడీగా ఉంటుందట. దాదాపు ఇరవై మంది విచారణ ఖైదీలు ఈ సేవలకోసం ఉంటారు. వాళ్లు బెయిల్‌పై వెళ్లిపోతే వెంటనే మరో ముఠా విచారణ ఖైదీలుగా వస్తారట.
జగన్ అండ్ కో చంచల్‌గూడ జైల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఏర్పాట్లు ఉండేవి. అప్పుడు అధికారంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం జగన్ అండ్ కోపై ప్రత్యేక దృష్టి పెట్టలేదు. దీంతో జగన్ అండ్ కో ఆడుతూ పాడుతూ జైలు జీవితం గడిపేశారు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి వేరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన పట్ల ఎంత కక్ష ఉందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు ప్రతి కదలికనూ ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. దీంతో జైలు అధికారులు కూడా చంద్రబాబుకు ఎటువంటి వెసులుబాటు ఇవ్వడం లేదు. చంచల్‌గూడ జైల్లో లభించే భోగాలు చంద్రబాబుకు అందుబాటులో ఉండవు.
అంటే… రాధాకృష్ణ బాధేమిటి..? చంచల్‌గూడలో జగన్ రాజభోగాలు, విలాసాలు అనుభవించాడు… ఆడుతూ పాడుతూ జైలు జీవితం గడిపాడు… మా చంద్రబాబుకు ఆ చాన్స్ ఏది..? రాజమండ్రి జైలులో అవేమీ కుదరడం లేదు అన్నట్టుగా ఉంది ఈ వాదన…
మాంసాహారం, కాళ్లూ-ఒళ్లూ మర్దన, మందు… ఇవేనా జగన్ అనుభవించింది..? ఇదేనా రాధాకృష్ణ రాసుకొచ్చింది… ఫాఫం, చంద్రబాబు మందు తాగడు,.. మాంసాహారం కూడా టేస్టుకు ఒకటీరెండు ముక్కలు… మర్దనలు అక్కర్లేదు… ఒకరకంగా ఆయన రాజసన్యాసి… జగన్ కూడా మందు తాగడు, (ఒకప్పుడు తాగేవాడేమో తెలియదు)… పెద్ద భోజనప్రియుడు కూడా కాదు… మరిక జగన్ అనుభవించిన విలాసం ఏమిటి..? చంద్రబాబు కోల్పోతున్నదేమిటి..? పోనీ, భద్రత గురించిన ఆందోళన అంటారా..? తీహార్ జైలు బెటర్ అంటారా..? విలాస జీవితం కావాలంటే చంచల్‌గూడ జైలు బెటరా..? ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి ఘన పాత్రికేయా..? ఆ రాజమండ్రి జైలులోనూ ఉండనివ్వరా ఆయనను..?!
Share this Article