ఆర్ఆర్ఆర్ పేరిట ఓ అపూర్వ చిత్రరాజం, ఓ కళాఖండం జనంలోకి వస్తోంది కదా… 500 కోట్లు తగలేశారట… చెప్పింది నమ్మాలి… ఎవడు ఆడిట్ చేస్తాడు..? ఎవడు లెక్కలు అడిగే దమ్మున్నోడు..? జగన్ భయ్యా, మేం మా సినిమా ధరల్ని పెంచేసుకుంటాం అని దర్శకరత్నుడు రాజమౌళి ప్రభువుల వారిని కలిశాడు… ఇంకేముంది..? ప్రొసీడ్, గోఎహెడ్ అనేశాడు ప్రభువు… అప్పట్లో ది గ్రేట్ అమరావతి నగర నిర్మాణానికి ప్లాన్లు గీసిన రాజమౌళి కదా… చంద్రబాబు అనుంగు శ్రేయోభిలాషి కదా… వెంటనే ఆ జగన్ చక్రవర్తి పది రోజులపాటు 75 రూపాయల చొప్పున ధరలు పెంచి కుమ్ముకోవోయ్ అని చెప్పేశాడు… నవ్వు, జాలి కలిగేది ఎక్కడ అంటే… ఈ 75 రూపాయల పెంపు అనేది 30 రూపాయల టికెట్ కు కూడా వర్తింప చేయవచ్చు… హహహ…
హబ్బ… ఇది కదా విజ్ఞత కలిగిన ప్రభుత్వం అంటే…!! ఎలాగూ పవన్ కల్యాణుడి బీమ్లానాయక్ పోయింది కదా… మళ్లీ ఇంకేదైనా కొత్త సినిమా వచ్చినప్పుడు చూద్దాం, మనం మళ్లీ ఆదేశాలు ఇస్తే కదా టికెట్ల ధరలు పెంచుకునేది… తిక్క వేషాలు వేస్తే థియేటర్లను సీజ్ చేస్తే సరి… రాజమౌళిలాగే పవన్ వచ్చి కలిసేది లేదు… నిర్మాత వచ్చి కలవాలి అనుకున్నా గేట్లు తెరుచుకోవు…
Ads
మన మంత్రులు, మన అధికారులు కూడా ఆలోచనారాహిత్యాన్ని అలవాటుగా చేసుకున్నారు కదా… కిమ్మనరు… అసలు వాళ్లకు సినిమాలో ఏముందో తెలిస్తే కదా… ఏది చరిత్రో, ఏది వక్రీకరణతో తెలిస్తే కదా… ఆ బుర్రలే ఉంటే… ఏమోయ్, రాజమౌళీ, అల్లూరి పాత్రను మరీ అంత నీచంగా చిత్రించావు, అసలు నీ సినిమా ఎందుకు రిలీజ్ కావాలి చెప్పు అని ఉంటే ఎలా ఉండేది…? జనం మెచ్చిన మహానేత వైఎస్ పాత్రను అలా చిత్రిస్తే ఊరుకునేవాడా..?! అక్కడే ఉరితీసేవాడు..!!
నీ పాన్ ఇండియా వేషాలు మా దగ్గర చెల్లవు, అల్లూరికి ఆ పిచ్చి డాన్సులు, బ్రిటిష్ సైన్యంలో పోలీస్ పాత్ర ఏమిట్రోయ్ అనడిగి ఉంటే ఎలా ఉండేది..? ఎంత క్రియేటివ్ ఫ్రీడమ్ అయినా సరే, కొన్ని ప్రాంతాల ప్రజలు పూజించే చారిత్రిక పాత్రకు ఈ కమర్షియల్ మరకలేమిటోయ్ అని నిలదీసి ఉంటే..?! సర్లెండి, అన్నీ సక్కంగ ఉన్నయ్ గానీ, ఇదొక్కటే పద్ధతిగా లేదా మా బాస్ ప్రభుత్వంలో… భలేవారు…!!!
Share this Article