.
ఏపీ రాజకీయాల తీరు తెలిసిందే కదా… సాక్షాత్తూ శాసనసభలోనే తిట్లు, బూతులు ఇష్టారాజ్యంగా సాగుతుంటాయి… చంద్రబాబే ఓ దశలో రోదించిన తీరు కూడా చూశాం… ఈ ధోరణి ఆగినట్టు లేదు, ఆగదు… ఇప్పుడు బాలకృష్ణ జగన్‌ను ఉద్దేశించి సైకో గాడు అని ప్రస్తావించడం మళ్లీ పెద్ద ఎత్తున చర్చకు, విమర్శలకు దారితీస్తోంది…
సరే, బాలకృష్ణ భాష, తన మాటల ధోరణి తెలిసిందే కదా… పైగా ఏదైనా చెబుతుంటే సగం అర్థమే కాదు… అప్పట్లో చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ స్పందించాడు అంటూ కామినేని శ్రీనివాస్ ఏదో మాట్లాడాడు… దానికి బాలకృష్ణ అంత స్పందించాల్సిన అవసరమే కనిపించదు… ‘‘చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఆయన దిగి వచ్చాడు అనేది అబద్ధం, గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ’’ అని నోరుపారేసుకున్నాడు…
Ads
కోటపై అప్పట్లో ఉమ్మేయడం దగ్గర నుంచీ… మా బ్లడ్డు బ్రీడు వంటి వ్యాఖ్యల దాకా… బాలకృష్ణ ధోరణి ఎప్పుడూ అదే…
ఎస్, జగన్‌ను ఓ ముఖ్యమంత్రిగా టాలీవుడ్ పరిగణనలోకే తీసుకోలేదు మొదట్లో… అది నిజం… అంతెందుకు, రేవంత్ రెడ్డి పట్ల కూడా అదే ధోరణి… బన్నీని లోపలేశాక కదా కాస్త కుదురుకుంది… టాలీవుడ్‌కు తెలుగుదేశమే ముఖ్యం… ఇండస్ట్రీకి, జగన్‌కూ నడుమ ఉన్న గ్యాప్ ఎంతోకొంత పూడ్చడానికి చిరంజీవి ప్రయత్నించిన మాట కూడా నిజం…
చిరంజీవి కూడా బాలకృష్ణ సభలో చేసిన వ్యాఖ్యలతో హర్టయ్యాడు… కానీ సున్నితంగానే ఓ వివరణను జారీ చేశాడు…
(విదేశాల్లో ఉన్నట్టున్నాడు…. అది చిరంజీవి లేఖేనా అనే సందేహాలు కూడా సోషల్ మీడియాలో వినిపించాయ, కానీ తనదే… తను చెప్పిన మాటల్నే చిరంజీవి పీఆర్ వ్యవహారాలు చూసే శేఖర్ ఈ నోట్ డ్రాఫ్ట్ చేసి మీడియాకు రిలీజ్ చేసినట్టు సమాచారం… కాకపోతే చిరంజీవి ఇంత వేగంగా స్పందించడం, బాలకృష్ణకు సుతిమెత్తగా చురకలు పెట్టడం ఎవరూ ఊహించనిది… అందుకే లేఖ కరెక్టేనా అనే డౌట్స్ వచ్చినట్టున్నాయి అందరిలో…)
‘బాలకృష్ణ వ్యంగ్యంగా చెప్పడాన్ని సభ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను… ఇండస్ట్రీకి చెందిన ముఖ్యులు అడిగితేనే సినిమా టికెట్ల ధరల గురించి చొరవ తీసుకున్నాను, మొదట పేర్ని నానిని అడిగాను… జగన్ వన్‌టువన్ కలుస్తానని నానికి చెప్పడంతో నేను సీఎం ఇంటికి వెళ్లాను… సాదరంగా ఆహ్వానించారు, లంచ్ చేశాం, అప్పుడే ఇండస్ట్రీ సమస్యలు చెప్పాను… టైమ్ ఇస్తే ముఖ్యులు మిమ్మల్ని కలుస్తారనీ చెప్పాను…
బాలకృష్ణను కూడా రమ్మని చెప్పడానికి ట్రై చేశాను, కుదరలేదు, దొరకలేదు… ఇక మేమే ఓ ఫ్లైట్‌లో వెళ్లాం, కలిశాం… ఇండస్ట్రీ సమస్యలు చెప్పాం, జగన్ సానుకూలంగా స్పందించాడు కాబట్టే బాలకృష్ణ నరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ ధరలు పెరిగాయి… ఇండస్ట్రీకి మంచి జరిగింది…’’ ఇదీ తన వివరణ సారాంశం…
నేను చొరవ తీసుకున్నాను కాాబట్టే నీ సినిమాకూ టికెట్ ధరలు పెరిగాయి సుమా అని గుర్తుచేశాడు సుతిమెత్తగా చురక పెడుతూ…! అంతేకాదు, నేను రాష్ట్ర ముఖ్యమంత్రితో నైనా, సామాన్యుడితో నైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను…’’ అని మరో చురక అంటించాడు…
తనను గౌరవించని ఇండస్ట్రీ పట్ల జగన్ కూడా కఠినంగా, నిర్దయగా వ్యవహరించాడు కాబట్టే ఇండస్ట్రీ దిగివచ్చింది… కలిసింది… ఇవన్నీ నిజాలే…
చిరంజీవి చొరవ కూడా నిజమే… జగన్‌తో ఆ భేటీలో చిరంజీవి మరీ వంగిపోయి, అయ్యా అప్పా అన్నట్టు మాట్లాడిన తీరు మీద కూడా విమర్శలొచ్చాయి… సరే, అప్పట్లో ఇండస్ట్రీ అవసరం అది… తను మాట్లాడే పద్ధతి అది… ఇప్పుడు బాలకృష్ణ చెబుతున్నాడు, మొన్న ఏదో మీటింగుకు సంబంధించి తన పేరు తొమ్మిదో స్థానంలో పెట్టారు అని… హేమిటో ఈ అనవసరం, అసందర్భ రాద్దాంతం, వివాదం… రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి, అవి కదా చర్చించాల్సింది…
ఆమధ్య మురళీమోహన్ కూడా జగన్ సినిమా పెద్దలను అవమానించాడు, కారును గేటు దగ్గరే ఆపితే వాళ్లు నడిచి వెళ్లిన తీరు అవమానకరం అని ఏదో మాట్లాడాడు… ఘనస్వాగతాలు ఏర్పాటు చేయాల్సిందా..?!
- పోనీ, తనే గట్టిగా అడగకపోయాడా బాలకృష్ణ..? ఎవరు వద్దన్నారు..? తనే లీడ్ తీసుకుంటే ఇంకా బాగుండేది కదా… ప్రత్యర్థి పార్టీకి చెందిన వాడైనా సరే, ఇండస్ట్రీ కోసం ఒక హీరోగా సీఎంను కలిశాడు అనే సద్బావన నెలకొనేది కాదా..? ఇందులో ఇగోల సమస్య దేనికి..? పైగా అదెప్పుడో జరిగితే ఇప్పుడు జగన్‌ను సైకో గాడు అంటూ, ఎవడూ గట్టిగా అడగలేదు వంటి పరుషపదాల్ని చిరంజీవికి వర్తిస్తూ మాట్లాడటం బాగోలేదు…
- అప్పట్లో అఖండ, భీమ్లానాయక్ రిలీజ్ సమయాల్లో పవన్ కల్యాణ్ గానీ, బాలకృష్ణ గానీ సినిమా రేట్ల పెంపు విషయంలో ప్రయత్నించలేదు… జగన్‌ను అడిగేదేముంది అనుకున్నారు… ఇందులోనూ పొలిటికల్ రైవల్రీయే ప్రధానపాత్ర…
సైకో అనే పదం వాడటంతో ఇక జగన్ క్యాంపు కూడా సోషల్ మీడియాలో బాగా రియాక్టవుతోంది… నాడు కాల్పుల కేసులో ఎవరు మనోవైకల్యం సర్టిఫికెట్‌తో, ఎవరి ఔదార్యంతో బయటపడ్డావు అని కౌంటర్లు మొదలు పెట్టింది…
ప్రజాజీవితంలో ఉన్న పొలిటిషియన్, ఇండస్ట్రీ ముఖ్యుడు, ముఖ్యమంత్రి వియ్యంకుడు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు… సరైన అప్రోచ్‌తో వెళ్లి ఉంటే తను ఎన్టీయార్ వారసుడిగా సీఎం కావల్సిన వ్యక్తి… ఒక అల్లుడు ఎంపీ, మరో అల్లుడు కాబోయే సీఎం…పైగా అది శాసనసభ… చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం… తెలుగుదేశంతో జనసేన భాగస్వామ్యం, కూటమి ప్రభుత్వం… ఈ సున్నితమైన వ్యవహారంలో బాలకృష్ణ తన భాష పట్ల ఖచ్చితంగా సంయమనం పాటించి ఉండాల్సింది..!!
Share this Article