తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ… ఇది సోషల్ మీడియా ప్రచారం ప్లస్ ఆంధ్రజ్యోతి తాజా ప్రచారమే కాదు… కొద్దిరోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలోనూ ఈ ప్రచారం నానుతోంది… అది సోషల్ మీడియా ప్రచారం వల్ల జరుగుతున్న ప్రచారం కావచ్చు, చంద్రబాబు నియమించుకున్న సోషల్ టీం రాబిన్ శర్మ టీం ప్రయోగిస్తున్న భేదోప్రచారం వల్ల కావచ్చు… పీకే మార్కు ఫేక్ పోస్టులు కూడా కావచ్చు… కానీ అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రి ఆయన, తన సోదరి ఆమె… ఇది తప్పుడు ప్రచారం అయ్యే పక్షంలో జగన్ సోషల్ మీడియా వింగ్స్ ఏం చేస్తున్నట్టు..? పోనీ, షర్మిల వైపు నుంచి ఖండన రావాలి కదా… అంటే ఈ ప్రచారం జరగనీ అనుకుంటున్నదా ఆమె..? లేక నిజంగానే ఆ పార్టీ ఆలోచనల్లో ఉన్నదా..? ఇక ఈ వ్యవహారంపై తలెత్తే ప్రశ్నల్ని చూద్దాం… నిజంగానే ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉందా..? ఇదీ అసలు ప్రశ్న…
- తనకు పొలిటికల్ ఇంట్రస్టులు లేవని ఆమె గతంలో చెప్పింది… చెప్పినట్టుగానే జగన్ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలవుతున్నా ఆమె ఎక్కడా పొలిటికల్ స్క్రీన్ మీదకు రాలేదు… ఏ రాజకీయ వ్యవహారంలోనూ వేలు పెట్టలేదు… జగన్ భార్య భారతి జోక్యం చాలా అంశాల్లో కనిపిస్తుంది కానీ షర్మిల కనిపించలేదు… మరి ఈ రాజ్యసభ సీటు, తెలంగాణ సీఎం ప్రస్తావనలు ఎక్కడి నుంచి వచ్చాయి..?
- రాజ్యసభ సీటు అనేది జగన్‌కు చాలా చిన్న విషయం… కనిమొళి, కవిత, సుప్రియా సూలే తరహాలో ఆమెను పార్లమెంటుకు పంపించడం పెద్ద కథేమీ కాదు… ఇక తెలంగాణ సీఎం అనేది ఊహాజనితం… తెలంగాణ తన కార్యక్షేత్రం కాదని తెలిసే జగన్ తెలంగాణలో దుకాణం క్లోజ్ చేశాడు… ఏపీకి పరిమితం అయ్యాడు… అలాంటప్పుడు షర్మిలను తెలంగాణ సీఎం ఎలా చేయగలడు..?
- షర్మిల ఒకవేళ జగన్‌కు గుణపాఠం చెప్పాలీ అనుకుంటే ఏపీలోనే కొత్త పార్టీ పెట్టాలి గానీ… తెలంగాణలో ఏం చేయగలదు ఆమె..? యుద్ధరంగం అమరావతిలో ఉంటే, ఆమె హైదరాబాదులో కత్తితిప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి..? ఇదేమిటో ఆర్కే మాత్రమే చెప్పాలి…
- రాజన్నరాజ్యం తెస్తా అన్నాడు, రాజారెడ్డి రాజ్యం తెచ్చాడు అనేది బహుశా ఆర్కే మార్కు లేదా రాబిన్ శర్మ మార్కు క్రియేషన్ కావచ్చు… ఎందుకంటే..? రాజన్నరాజ్యానికీ, రాజారెడ్డి రాజ్యానికీ ఇవీ నిర్వచనాలు, సూత్రాలు, ప్రమాణాలు, విలువలు అని ఎవరైనా రాసిపెట్టారా..? రాజన్నరాజ్యంపై ఆమె ప్రజలకు ఏమైనా నైతిక పూచీకత్తు పడిందా..?
Ads
- సరే, జగన్ ద్రోహం చేశాడు సరే… తనకు ఏం కావాలో అడగకుండా… అన్నా, నీ సంగతి చూస్తా అంటూ… కొత్త పార్టీ పెడతా అంటూ… బ్లాక్ మెయిల్ చేయదు కదా… ఆమె అలాంటిదే అయితే ఇన్ని నెలలు అసలు ఎక్కడా కనిపించలేదు ఎందుకు…? అసలు పొలిటికల్ స్ట్రీమ్‌లోనే ఆమె లేదు కదా… పైగా తెలంగాణ సీఎం అనేది అంత వీజీ సీటు అనుకుంటున్నారా ఏం..?
- మరి ఆమె తెలంగాణ ప్రాంత వైఎస్ అభిమానులతో ఎందుకు మాట్లాడుతోంది అనేది మరో కీలకప్రశ్న… ఇది నిజమేనా..? నిజం కాకపోతే ఆమె ఆంధ్రజ్యోతి మీద కేసు పెడుతుందా..? నిజం అయితే ప్రజలకు క్లారిటీ ఇస్తుందా..? తప్పుడు ప్రచారాలపై ఆమె గతంలోనూ కేసులు పెట్టింది… తప్పులేదు, తప్పదు కూడా… ఆంధ్రజ్యోతి రాసింది అక్షరసత్యం అనుకుందాం… అలాంటప్పుడు ఆమె మంచి సోదరి కాదు, మంచి రాజకీయవేత్త కూడా కాదు…!
- ఎక్కడో నాలుగో పేజీలో ఉండే సంపాదకీయ ఫీచర్‌కు సూపర్ లీడ్ ఫస్ట్ పేజీ బ్యానర్‌గా వేయడం బహుశా ప్రపంచ డెయిలీ ఫీల్డులో ఇదే మొదటిసారి కావచ్చు…. వాట్సప్ ఫేక్ న్యూస్‌ను బ్యానర్ చేసిన మొదటి పత్రిక కూడా ఇదే అయి ఉంటుంది… జయహో నిమ్మగడ్డ రాధాకృష్ణా… సారీ, నారా రాధాకృష్ణా…
చివరగా :: షర్మిల పేరు మీద మొదలుపెట్టిన ప్రచారం ఒకవేళ తుస్పుమన్నది అనుకుందాం… అప్పుడు ఆంధ్రజ్యోతి కొత్తగా ఏం స్టార్ట్ చేయాలి..? ‘‘వైఎస్ జగన్ భార్య భారతి భర్త మీద విపరీతమైన కోపంతో ఉంది… తనకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని రుసరుసలాడుతోంది… ఎలాగూ నేను జైలుకు పోతాను, నువ్వే సీఎం, రెడీగా ఉండు అని నమ్మబలికాడు… కానీ అది సాధ్యం కావడం లేదు, ఎప్పటికప్పుడు ఢిల్లీకి పోయి, బెయిల్ రద్దు గాకుండా ఏవో ప్రయత్నాలు చేసుకుంటున్నాడు… చూస్తుంటే రెండేళ్లు గడిచిపోతున్నయ్… కనీసం మండలి సీటు ఇచ్చి, డిప్యూటీ సీఎంను చేయలేదు… అందుకని అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది… జగన్ రెడ్డి సొంత కుటుంబమే చీలిపోనుంది…’’…. ఎహె, మరీ చిల్లరగా ఉందీ అంటారా..? మరి జగన్-షర్మిల నడుమ పుల్లలు పెట్టే కథనాలు ఇంతకుభిన్నంగా, గొప్పగా ఉన్నాయా ఏం..?!
Share this Article