అసలు ఇది వాార్త అవుతుందా..? ఇందులో ప్రజల కోణం ఏముంది..? ఆంధ్రజ్యోతికి ఏమైంది..? మరీ మాస్ట్ హెడ్ పక్కన బొంబాట్ చేసింది..? ఫేస్‌బుక్ కమ్యూనిటీ స్టాండర్ట్స్ వంటి డొల్లేనా ఆంధ్రజ్యోతి ప్రొఫెషనల్ ప్రమాణాలు..? ప్రస్తుతానికి నెట్‌లో ఈ చర్చ బాగానే నడుస్తోంది…
ఈ చర్చకు కారణం ఒక వార్త… హైదరాబాద్, తెలంగాణ ఎడిషన్లలో ఏదో మొక్కుబడిగా వేశారు, ఎందుకంటే తెలంగాణలో ఆ వార్త ద్వారా వారు కోరుకున్న ఫాయిదా ఏమీ లేదు… కానీ ఏపీలో ఆ వార్త ఉద్దేశపూర్వకం, తనకు ప్రయోజనకరం, తమ తెలుగుదేశం పార్టీకి ఉపయోగకరం కాబట్టి ధూంధాం వేసేశారు… ఇదుగో ఇదీ వార్త…
Ads
‘‘విజయమ్మ జన్మదినాన్ని జగన్ మరిచేపోయాడు… ఏదో మొక్కుబడిగా, మరీ బాగుండదని అనుకుని మధ్యాహ్నం వేళ ఓ ట్వీట్ వదిలి మమ అనిపించాడు… కానీ షర్మిల తన తల్లికి కేక్ తినిపిస్తున్న ఫోటో జతచేసి మరీ ట్వీటింది… విజయమ్మను గౌరవాధ్యక్షురాలిగా తీసేశాడు కదా వైసీపీ శ్రేణులు కూడా పట్టించుకోలేదు… షర్మిలకు మద్దతుగా ఉన్నందుకు జగన్‌కు తల్లి మీద కోపం’’ దాదాపు ఈ అభిప్రాయం వచ్చేలా ఆంధ్రజ్యోతి వార్త సాగింది…
ఇక్కడ డిబేట్ అది వార్తేనా..? ఒక తల్లికి ఒక కొడుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పకపోతే, మామూలుగా చెప్పినా సరే అది వార్త అవుతుందా..? అది వాళ్లిద్దరి నడుమ ఉన్న సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది… పైగా వాళ్లిద్దరికీ సంబంధించిన వ్యవహారం… ఇందులో ప్రజల కోణం ఏముంది..? ఇలాంటి చిన్న చిన్న కోపాలేమైనా ఉంటే… తాత్కాలికం… ఎప్పటికైనా ఆమె అమ్మే, ఆయన కొడుకే… అంతే… అనేది ఈ వార్తను వ్యతిరేకించేవారి వాదన…
కానీ… అది వార్తే… తల్లిని అమితంగా ప్రేమించే కొడుకు ఈసారి హఠాత్తుగా ఆమె జన్మదినాన్ని మొక్కుబడిగా, ఏదో తప్పదు అన్న తరహాలో గుర్తుచేసుకుని, ఓ ట్వీట్ కొట్టేసి, మమ అనిపించేయడం వార్తే… పాలకుడి ప్రతి అడుగూ వార్తే అవుతుంది… జనం చూపు, ఆసక్తి ఉంటుంది ఇలాంటి వ్యవహారాలపైన… గత ఏడాది ఆసక్తికీ, ఈ ఏడాది అనాసక్తికీ నడుమ పరిణామాలపై ప్రజల్లో సమీక్ష ఉంటుంది… అవి రాజకీయ సంబంధం అయితే మరీ ఖచ్చితంగా జనం చూపు ఉంటుంది…
నిజం గాకపోయినా సరే…. జగన్ మీద షర్మిలకు కోపం, అందుకే పార్టీ పెట్టింది, ఆమెకు విజయమ్మ మద్దతు, ఆ కోఫంతో జగన్ ఆమెను దూరం పెట్టాడు… అనే విషయాన్ని ఆంధ్రజ్యోతి వీలైనంత అధికంగా ప్రచారం చేస్తుంటుంది… ఇదేకాదు, వివేకా హత్య కేసును, వివేకా బిడ్డ పోరాటాన్ని కూడా బాగా హైలైట్ చేస్తుంటుంది… దానికి కారణం జగన్‌ను వీలైనంత బ్యాడ్ లైట్‌లో చూపించడమే…
జగన్‌కు కుటుంబబంధాలు పట్టవు… అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు… హత్యలు చేయిస్తాడు, అమ్మ అక్కర్లేదు, చెల్లె అక్కర్లేదు… ఇదుగో ఈ ముద్రను జగన్ మీద బలంగా వేయడానికి ఆంధ్రజ్యోతి విస్తృతంగా ప్రయత్నిస్తుంటుంది… జగన్ చెడ్డవాడు అనే ముద్ర తన చంద్రబాబుకు అవసరం… అందుకని అది ఆంధ్రజ్యోతి అవసరం… ఇలాంటి రాగద్వేషాలు, అవసరాలే కదా ఇప్పుడు ఏ మీడియా హౌజునైనా నడిపించేవి…
సో, రాధాకృష్ణకు ఇలాంటి వార్తల్ని కళ్లకద్దుకుంటాడు… ఫస్ట్ పేజీలో బొంబాట్ చేస్తాడు… చంద్రబాబు కళ్లలో తృప్తి చూడటం కోసం, రాధాకృష్ణ ఇంకా ఏ స్థాయికైనా దిగిపోగలడు… అలాగని మిగతా పత్రికలు ఏవో శుద్ధపూసలు కావు సుమీ…! అవునూ, ఈరోజు చంద్రబాబు బర్త్ డే కదా… లోకేష్ తన పాదయాత్రకు ఒకరోజు బ్రేక్ ఇచ్చి మరీ చంద్రబాబు వద్దకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పి వచ్చాడా…?!
Share this Article