జగన్ చేసింది తప్పా..? ఒప్పా..? మరీ ఆస్తుల కోసం చెల్లిని, తల్లిని కూడా మోసగిస్తాడా..? ఇచ్చిన మాట తప్పుతాడా..? చెల్లిని మోసగత్తె అంటాడా..? చివరకు తండ్రి చెప్పింది కూడా పాటించకుండా ద్రోహం చేస్తాడా..? ఇచ్చిన షేర్లను కూడా వాపస్ తీసుకుంటాడా..?
….. ఇలా జగన్ వ్యతిరేక శిబిరాలు రెచ్చిపోయి ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయి… సహజంగానే ఎప్పటిలాగే వైసీపీ సోషల్ శిబిరం సరిగ్గా డిఫెండ్ చేయలేక చేతులెత్తేసింది… షర్మిల వర్సెస్ జగన్ ఆస్తి వివాదాలు, పంచాయితీల గురించే కాదు, ఆమె రాజకీయాల పోకడల గురించి కూడా వైసీపీ నేతలు ఎవరూ పెద్దగా మాట్లాడరు… సంయమనం పాటిస్తారు…
అదే కోణంలో తాజా ఎన్‌సీఎల్‌టీ కేసు వివాదంపై కూడా ఎవరూ కిక్కుమనడం లేదు… అనరు… చివరకు సాక్షి కూడా సైలెంట్… ఎవడేమైనా రాసుకోనీ… కుటుంబ తగాదాలపై నిశ్శబ్దమే సిద్ధాంతం… స్థూలంగా చూస్తే బాగానే ఉన్నా, జగన్ వ్యక్తిగతంగా బాగా అప్రతిష్టపాలవుతున్నాడు… కనీసం వైసీపీ సోషల్ మీడియా ఎంతో కొంత డిఫెండ్ చేయాల్సి ఉండింది… కానీ ప్చ్… పూర్ నెట్‌వర్క్… వందల కోట్లు ఖర్చు చేశాడు, చేస్తున్నాడు జగన్… కానీ నిరాశా ఫలితాలే… మొన్నటి ఎన్నికల్లోలాగా…
Ads
ఎన్‌సీఎల్‌టీ కేసు వార్తను మొదట పయనీర్ అందుకుంది… సరిగ్గా రాయలేకపోయినా ఏదో ఎంగిలి చేసి వదిలింది… అర్రెర్రె అని నాలుక కర్చుకున్న ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇతర టీవీ చానెళ్లు నిన్నటి నుంచీ అందుకుని కథలకుకథలు మాల్‌మసాలా వేసి వండి వడ్డిస్తున్నాయి… షర్మిల గానీ, జగన్ గానీ ఒక్క ముక్క స్పందించడం లేదు…
అరె, ఇలాగైతే ఎలా..? జగన్‌ను ఇంకా బదనాం చేయాలనే భావనతో షర్మిల తన అన్నకు రాసిన ఘాటు లేఖను కూడా టీడీపీయే సర్క్యులేట్ చేసి, జగన్ మీద దుమ్మెత్తిపోస్తోంది… టీడీపీ ఎందుకు ఓవరాక్షన్ చేస్తోంది..? ఎందుకంటే..? జగన్ మీద నెగెటివిటీ పెంచడం కోసం… అంతేనా..?
కాదట… షర్మిలను ముందుపెట్టి టీడీపీయే జగన్ బెయిల్ రద్దయ్యే కుట్రకు పాల్పడిందని వైసీపీ వర్గాల వాదన… ఎలా అంటారా..? జగన్ ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్నాయి… ఒక ఒప్పందం మాత్రమే షర్మిల, విజయలక్ష్మి, జగన్, భారతి నడుమ సరస్వతి షేర్ల బదిలీకి కుదిరింది… కానీ షేర్లు అటాచ్‌మెంట్‌లో ఉండగా, బెయిల్ కండీషన్ల మేరకు బదిలీ కుదరదు, కానీ బోర్డు తీర్మానం కుదిరి, ఆమేరకు షేర్ల బదిలీకి షర్మిల ప్రయత్నించింది… తల్లి షేర్లు కూడా బదలాయించుకునే ప్రయత్నం ఏమిటి…? ఒరిజినల్ షేర్ హోల్డర్ల సంతకాలు లేకపోతే చెల్లుతుందా ఈ బదిలీ..?
బెయిల్ కండిషన్ల ఉల్లంఘన ప్లస్ ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల అక్రమ బదిలీ అవుతుంది… అసలే కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు… తన బెయిల్ రద్దు చేసే కుట్ర ఏదో జరుగుతోందనీ, షర్మిల వాళ్ల చేతుల్లో పావు అవుతోందనీ జగన్ సందేహం, ఆందోళన… అందుకే ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ వేశాడు… ఇదంతా జగన్ వర్గాల వాదన…
మరి అక్రమంగా షేర్ల బదిలీకి షర్మిల ప్రయత్నిస్తుంటే జగన్ క్రిమినల్ కేసు ఎందుకు పెట్టలేదు..? పోనీ, షర్మిల కోణంలోనే చూద్దాం… జగన్ ప్రత్యర్థులకు ఉపయోగపడుతోందా..? ఏ కాంగ్రెస్ అయితే తన కుటుంబాన్ని నానాతిప్పలూ పెట్టి, వైఎస్ పేరును చార్జిషీటులో పెట్టిందో ఆ కాంగ్రెస్ పంచన చేరడమే గాకుండా… వైఎస్‌కు ఆది నుంచీ ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం, చంద్రబాబు కుట్రలకు ఉపయోగపడుతోందా..? షర్మిలే వివరణ ఇవ్వాలి… టీడీపీ వాళ్లు లీక్ చేసే లేఖలు కాదు… (ఆల్రెడీ పయనీర్ ఎంగిలి చేసిన వార్తను ఆంధ్రజ్యోతి తన ప్రత్యేక కథనంలా రాసుకోవడం నవ్వు పుట్టించేదే…)
అసలు బోర్డు తీర్మానం ఎలా సాధ్యమైంది..? షర్మిలకు ఈమేరకు సాయపడింది ఎవరు..? చట్టబద్ధమేనా..? సరే, అవన్నీ ఎన్‌సీఎల్‌టీ తేలుస్తుంది… దాన్ని వదిలేస్తే తండ్రి నలుగురు పిల్లలకూ సమవాటాలు అన్నారు, వోకే… కానీ వైఎస్ సీఎం అయ్యేవరకు ఆయన దగ్గరున్న ఆస్తి ఎంత..? తరువాత జగన్ సొంతంగా సంపాదించుకున్నదే అపారం… అందులో తను ఇస్తేనే షర్మిల తీసుకోవాలి తప్ప, హక్కుగా డిమాండ్ చేసే అర్హత ఉందా..? ఇదీ బహుశా రేప్పొద్దున ఇంకేదైనా కోర్టులో విచారణకు వస్తుందేమో… తల్లి షేర్లను కూడా తను బదలాయించుకోవడాన్ని ఏమనాలి..? ఇలా ఎన్నో సందేహాలు…
ప్రస్తుతానికి యెల్లో మీడియా సంస్థలు షర్మిల వాదనను ఆమెకన్నా ఎక్కువగా మోస్తున్నాయి… జగన్ మీద వ్యతిరేకతతో జనంలోకి తీసుకుపోతున్నాయి… ఇక్కడ జగన్ సెక్షన్ ఫెయిల్యూర్ ఏమిటంటే..? షర్మిలను సరిగ్గా టార్గెట్ చేయలేకపోవడం..!! జగన్‌ను డిఫెండ్ చేయలేకపోవడం..!!
Share this Article