ఆంధ్రజ్యోతి రాధాకృష్ణది ఖతర్నాక్ న్యూస్ నోస్… ఎక్కడ కాస్త లీలగా పొగ వాసన వచ్చినా సరే, నాలుగు వేపమండలు పట్టుకుని, నిప్పు ఎక్కడుందో అర్జెంటుగా వెతుకుతాడు… ఒక్క నిప్పు రవ్వ ఉండీ లేనట్టు కనిపించినా సరే, ఇక ఆ వేపమండలతో కొట్టీ కొట్టీ పొగను ఇంకా రాజేస్తాడు… ఆ నిప్పు మీద కాస్త పెట్రోల్ పోసే ప్రయత్నం చేస్తాడు… ఇప్పుడు ఓ కొత్త నిప్పును చూపిస్తున్నాడు జనానికి… ఈ పొగతో జగన్ పని ఇక ఖతం అంటున్నాడు… ఈసారి ఏకంగా జగన్ చెల్లె షర్మిలను తమ ప్రచారంలోకి లాక్కొస్తున్నాడు… అన్నిరకాల ప్రచారాలూ అయిపోయాయి కదా, ఇక జగన్ మీద మరో మైండ్ గేమ్ ప్రారంభమైంది… ఆమధ్య జగన్ సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ప్రారంభించబోతోంది అని సోషల్ మీడియాలో ప్రచారాలు జోరుగా సాగాయి… షర్మిల వైపు నుంచి ఏ ఖండన, స్పందన లేవు… జగన్ శిబిరం కూడా పట్టించుకోలేదు… ఇక రాధాకృష్ణ దాన్ని కాస్త కెలికీ కెలికీ… ఇదేదో తనకు ఉపయోగపడుతుందని భావించి, సందర్భం చూసి ఇక మొదలుపెట్టాడు… జగన్‌కూ, షర్మిలకూ నడుమ ఓ పెంట గేమ్ స్టార్ట్ చేశాడు… ఆయన ఏమంటాడంటే..?
‘‘జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల అన్న వదిలిన బాణంగా పాదయాత్ర చేసింది… అప్పుడు తనకు రాజ్యసభ సభ్యత్వాన్ని లేకపోతే తెలంగాణ సీఎంను చేస్తానని జగన్ హామీ ఇచ్చాడు… కానీ వదిలేశాడు… వ్యాపారాల్లో ఆమె భాగస్వామ్యం లేకుండా చేశాడు… అందుకే ఆమె కోపంతో రగిలిపోతోంది… అన్నతో మాటామంతీ బంద్, అందుకే మొన్న క్రిస్టమస్‌కు పులివెందులకు కూడా వెళ్లలేదు… సంక్రాంతికి రమ్మని పిలవడానికి ఫోన్లు చేసినా ఆమె స్పందించలేదు… అంతేకాదు, తెలంగాణలో వచ్చే నెల మొదటివారంలో (9వ తేదీ) కొత్త పార్టీ పెట్టబోతోంది… వైఎస్ అభిమాన నేతలకు ఫోన్లు చేస్తోంది… చేవెళ్లలో పార్టీ స్టార్ట్ చేసి, పాదయాత్ర చేయబోతోంది… ఆమె జగన్‌ను మించిన మొండి, అందుకే వైఎస్ కుటుంబ అభిమానులు కొందరు నచ్చజెప్పినా సరే ఆమె వినిపించుకోవడం లేదు… తనకు నమ్మకద్రోహం చేశాడు కాబట్టే అన్నకు గుణపాఠం చెప్పాలనేది ఆమె అభిమతం… క్రిస్టియన్ల వోట్లన్నీ గంపగుత్తాగా తెచ్చిపెట్టిన ఆమె భర్త బ్రదర్ అనిల్ తోడ్పాటుతో ఆమె తెలంగాణ క్రిస్టియన్ల మద్దతు పొంది, పాత వైఎస్ అభిమానుల మద్దతు పొంది, కలకలం సృష్టించబోతోంది…
Ads
అందుకే అటు సోనియా, ఇటు బీజేపీ కూడా ఆసక్తిగా ఆమె కదలికల్ని గమనిస్తున్నారు… అసలే వివేకా బిడ్డ జగన్‌ను బజారుకు లాగే ప్రయత్నం చేస్తోంది… ఇక ఇప్పుడు షర్మిల… ఆమె తెలంగాణతో ఆగదు కదా, ఏపీ వైపూ వస్తుంది… అదీ జగన్ కలత చెందుతున్నాడు… ఈ దెబ్బకు తన విశ్వసనీయత గోవిందా..? కేసీయార్‌తో తన సంబంధాలు గోవిందా..? తన కోపానికి ఆమె చెబుతున్న కారణాలు ఏమిటయ్యా అంటే..? జగన్ రాజన్నరాజ్యం తెస్తానన్నాడు, కానీ రాజిరెడ్డి రాజ్యం తెచ్చాడు… సో, షర్మిల ఆగ్రహానికి జగన్ దెబ్బతినక తప్పదు…’’….. ఇదండీ రాధాకృష్ణ తాజా పరిశోధనాత్మక కథన సారాంశం… సరే, నిజమే అనుకుందాం కాసేపు, డిబేట్ కోసం… ఆమె ఈ ప్రచారాల్ని ఖండించడం లేదు కాబట్టి, ఆర్కే చెప్పినట్టు నిజంగానే ఆమె కొత్త పార్టీ పెట్టబోతోందీ అనుకుందాం… ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి కదా మరి… అవి చెప్పుకోవాలి కదా… అవేమిటంటే..? (పార్ట్-2 కథనంలోకి వెళ్దాం…)
Share this Article