Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆహా… ఏం చెప్పితివి జగ్గన్నా… నువ్వు సిసలైన ఇరిగేషన్ మేస్త్రీవి…

July 8, 2026 by M S R

.

తొక్కలో మేడిగడ్డ బరాజు ఫెయిల్యూర్… తస్కింది, సో వాట్..? కేటీయార్ చెప్పినట్టు నాలుగు తట్టల కాంక్రీటు చాలు… కాదంటే, పింక్ విశ్వేశ్వరరావు హరీష్ రావు చెప్పినట్టు ఆఫ్టరాల్ రెండు పిల్లర్ల రిపేరు… ఈమాత్రం దానికి అటు ఉత్తమకుమార్ రెడ్డి, ఇటు రేవంత్ రెడ్డి ఇంత గాయిగత్తర చేయాలా..? సబ్జెక్టు నాలెడ్జి లేక..!

అరె, ఇల్లు కడుతుంటే నాలుగు పెళ్లలు కింద పడవా ఏంది..? మరి లక్ష కోట్ల ప్రాజెక్టు, కేసీయార్ భారీ కమీషన్ల ప్రాజెక్టు, సారీ, కలల ప్రాజెక్టు కాస్త తస్కితే ఇంత రాద్దాంతం చేస్తారా..? పైగా ఎవిడో బాంబులతో పేల్చాడు అని కథలు, కవరింగులు, ప్రయాసలు…

Ads

వాడెవడో NSDA అట… వాడికేం తెలుసు..? మా కేటీయార్, హరీష్ రావులకన్నా ఎక్కువ తెలుసా వాడికి..? సీకెంట్ పైల్స్ వేయడమే తప్పు, వాటి కింద నుంచి ఇసుకను తీసుకుని మరీ నీళ్లు పారి, పిల్లర్లు కంగిపోయాయి, మేడిగడ్డ కాదు, అన్నారం, సుందిళ్ల కూడా సేమ్ టు షేమ్ అని తీర్మానించేశాడు… ఛ, ఎవరో జలశక్తి మంత్రి అయితే లక్ష కోట్లు గోదాట్లో పోశారు కదరా అని వెక్కిరించాడు, ఏడ్వలేక…

ఎక్కడ, ఏం దెబ్బతింది, ఏ పిల్లర్ సక్కగుంది, ఏది నాశనమైపోయింది… తేల్చడానికి ప్రతి పిల్లర్ దగ్గర బోర్ వేసి దుర్భిణి పెట్టి చూస్తున్నారు, ఇదీ వందల కోట్లు ఖర్చు… అసలు వాళ్లకేం తెలుసు..? నిజంగా వాళ్లకు జ్ఙానం ఉంటే సంగారెడ్డి బండ్ల గణేష్, సారీ, జగ్గారెడ్డి అనే మరో కాంగ్రెస్ విశ్వేశ్వరరావును అడిగితే తను రోగనిర్ధారణ చేసేసేవాడు…

తనేమంటున్నాడో తెలుసా..?

జగ్గారెడ్డి

‘‘మనం ఇల్లు కట్టినప్పుడు సిమెంట్ క్యూరింగ్ కోసం పైపుతో నీళ్లు కొడతం, సిమెంట్ అతకాలి, గట్టిపడాలి, కానీ వీళ్లు గోదావరి నీళ్లు ఎట్లొస్తే అట్ల ఆపేసిన్రు… అంటే నిల్వ చేశారు అని… దాంతో బేస్‌మెంట్ కూలబడ్డది… నేను రోజూ రాత్రిపూట నాటుకోడిని లాగించినట్టు ఒకేసారి నీళ్లు నింపిన్రు… కొన్ని కొన్ని నీళ్లు నింపితే అయిపోయేది..’’ ఇదీ తన ఇంజినీరింగ్ పరిజ్ఞాన సంపద…

ఆహా… కాంగ్రెస్ పార్టీని ఎవడూ మర్డర్ చేయనక్కర్లేదు… అంతా హరాకిరీ యవ్వారం… ఇలాంటి జ్ఞానులు చాలు… దానంతటదే మేడిగడ్డలాగా తస్కడానికి, కూలిపోవడానికి..! రేవంత్ రెడ్డి పిచ్చోడు, తెల్వదు, మొత్తుకోదు… ఏదో కమిషన్ వేశాడు, ఏదో రిపోర్టు తెప్పించాడు, సీబీఐ అన్నాడు… మొదట్లోనే జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే అయిపోయేది, తాడోపేడో తేలిపోయేది…

అన్నట్టు… దీర్ఘకాలం సాగునీటి మంత్రిగా చేసి, స్వర్ణ తెలంగాణను సాధించిన హరీష్ రావు కూడా అప్పుడప్పుడూ తన పాత ఉమ్మడి జిల్లా సహచరుడు జగ్గారెడ్డితో పోటీపడుతున్నాడు పాపం…

మేడిగడ్డ

అయ్యా సారూ, మేడిగడ్డ చూడు మేలిమై ఉండును అని ఏదో పద్యపాదం… బాగా చదివినవాడు ఉన్న మతి పోగొట్టుకున్నట్టు… కన్నెపల్లి వద్ద 7 టీఎంసీలు ఏందివయా… పారే నీటిని క్యూసెక్కుల్లో చెబుతం, నిల్వ ఉంటే టీఎంసీల్లో చెబుతం…

కానీ ఒక్కటి మాత్రం కరెక్టు, మేం మూడేళ్లలో ప్రాజెక్టే కట్టినం, నీకు మూడేళ్లలో టెస్టులే చేతకాలేదు అంటున్నాడు… నిజం… అడ్డదిడ్డంగా కట్టడానికి చాలా కాలం దేనికి, రోగనిర్ధారణకు- చికిత్సకే చాలా సమయం పడుతుంది మరి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • AI పై సంచలనం… చూడబోతే కల్కి 2042…13 గంటల్లో 7 కోట్ల రీచ్ ట్వీట్ !!
  • ఇప్పటి ప్రపంచాన్ని ఏడు దశాబ్దాల క్రితమే ఊహించారు ఈ రచయితలు!
  • నోరా, నీది నోరేనా..? ఓ ఎయిర్‌లైన్స్ రుసరుస- 3 కోట్లకు కేసు !!
  • దొరహంకారం !! చావు డప్పుల బాటకు శుద్ధి !! ఇది మరింత అవమానకరం !!
  • శాసనసభకు స్పీకరే సుప్రీమ్ – చాలామందికి తెలియని ఓ ఇంట్రస్టింగ్ కేసు !!
  • నువ్వు చూడకపోవడమా..? ‘ఆమె’ కనిపించకపోవడమా..? ఏది బ్రహ్మచర్యం !!
  • బర్తరఫ్ వైపే ! లేటయినా గట్టిగానే కొట్టే ప్రొసీజరల్ అడుగులు !!
  • ముంతాజ్ పేరు మార్చుకుంది ! వైసీపీ ‘స్వరం’ మారింది ! అంతా మాయ !!
  • ఇదేమైనా అట్లాస్ సైకిలా..? 40 రోజులకు ఓ వార్‌షిప్ నిర్మించడానికి !!
  • ఖడే హనుమాన్ ! భారీ యంత్రాలెన్ని తెచ్చినా ఇంచ్ కదలని విగ్రహం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions