Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రజల్లోకి రీ-ఎంట్రీ..! ఈ ఒక్క సభ కోసమేనా..? ఇక ప్రజల్లోనే ఉంటాడా..?

April 20, 2026 by M S R

.

గత ఎన్నికల్లో జనం తిరస్కరించాక కేసీయార్… జనం మీద అలిగి, జనానికి దూరమై, జనం సమస్యలు పట్టక… ప్రజాజీవితంలో లేకుండా పోయాడు కదా… ఏ ఒక్కరోజూ ఏ ప్రజాసమస్య మీద కూడా జనంలోకి రాలేదు కదా… కోట్ల జీతభత్యాలు తీసుకుంటూ అసెంబ్లీకి కూడా రావడం లేదు కదా… నువ్వు ప్రతిపక్షంలో ఉండు అని జనం తీర్పు చెబితే, అదేమీ పట్టలేదు కదా… ఇప్పుడు వస్తున్నాడు జనంలోకి… దేనికి..? కేవలం రాజకీయ అవసరం…! జనం పట్టని రాజకీయం…!!

‘ జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర… కాంగ్రెస్‌పై దండయాత్ర ’ అంటూ కేసీయార్ క్యాంపు ప్రచారం… అసలు ఆ జగిత్యాల జైత్రయాత్ర అనే పదాలు వాడటం, 1978 నాటి లక్షల మంది రైతు కూలీల పోరాటాల్ని ఒకరకంగా అవమానించడమే… నాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పెట్టుకున్న సభ పేరు జగిత్యాల జైత్రయాత్ర… ఆ సభకు, ఆ పేరుకు ఓ విశిష్టత ఉంది… ఇప్పుడు కేవలం ఓ ప్రాంత రాజకీయ నాయకుడి కోసం జరిగే సభను దాంతో పోల్చడం ఆ విశిష్టతను భంగపరిచినట్టే…

Ads

  • అసలు జైత్రయాత్ర అంటే విజయయాత్ర… వరుసగా ఓటముల పాలైన నాయకుడు జనం ఓడించిన పార్టీలో చేరడానికి ఉద్దేశించిన సభకు ఆ పేరుతో ఈ ప్రచారం ఏమిటి అసలు..? జీవన్‌రెడ్డి తల్లి వంటి కాంగ్రెస్ పార్టీని వదిలేసి, ఇన్నేళ్ల ప్రత్యర్థి గడీలోకి ప్రవేశించడమా ఈ విజయ యాత్ర..? నిన్న ఈ సభను జగిత్యాల జనగర్జన అన్నారు, మళ్లీ ఈరోజు ప్రజా ఆశీర్వాద సభ అంటున్నారు… హేమిటో…

జైత్రయాత్ర

మరీ పింక్ క్యాంపు జీవన్ రెడ్డిని తెగ మోసేస్తోంది… నిజానికి బీఆర్ఎస్‌లోకి చాలామంది వచ్చారు, పోయారు… అన్ని పార్టీల్లోనూ అంతే… రాజకీయ పార్టీల్లో చేరికలకు, నిష్క్రమణలకు పెద్ద ప్రాధాన్యమే ఉండదు ఈ రోజుల్లో… పైగా జీవన్ రెడ్డి స్థాయి కూడా కేవలం జగిత్యాల ప్రాంతం తప్ప, ఆ పరిధులు దాటదు… దాటలేదు… మరెందుకు ఇంత హంగామా..?

ఉద్యమ పార్టీగా చెప్పుకుని, పదేళ్లు అధికారంలో ఉండి, తెలంగాణ ఆత్మను చంపేసుకుని, పేరు కూడా మార్చుకున్న పార్టీ కదా… ఈ జగిత్యాల సభకు జనగర్జన, జైత్రయాత్ర, దండయాత్ర, ప్రజా ఆశీర్వద సభ, జంగ్ సైరన్, సమరశంఖం అంటూ ఇంత అట్టహాసం ప్రదర్శిస్తోంది కదా… పార్టీ ఆవిర్భావ దినాల్ని గతంలో ఘనంగా నిర్వహించుకున్న పార్టీయే కదా… మరి ఈసారి 27వ తేదీని అలా అనామకంగా వదిలేసింది దేనికి..? ఆ తేదీ కదా సభలు నిర్వహించి, ప్లీనరీలు నిర్వహించి, తన రాజకీయ పోకడ ఏమిటో చాటుకోవాల్సింది… ఏదో తూతూమంత్రంగా ప్రతినిధుల సమావేశం పెట్టి మమ అనిపిస్తారట…

kcr

జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని..? దశాబ్దాలుగా జగిత్యాలలో తను ఏం చెబితే అదే చెలామణీ అయింది కదా పార్టీపరంగా..! ఐనా 2018లో ఓటమి, వెంటనే ఎమ్మెల్సీ కావాలన్నాడు, ఆ తరువాత మళ్లీ ఎమ్మెల్యే సీటులో ఓటమి, తరువాత ఎంపీ సీటులోనూ ఓటమి… ఐనా ప్రతిసారీ తనకే అవకాశాలు, జనం ఓడిస్తున్నా సరే… అలాంటిది కాంగ్రెస్‌లోకి వేరే నాయకత్వం వచ్చి చేరుతుంటే, అదేదో తన కోటను కూల్చుతున్నట్టు భావన ఏమిటి..? అంతకుమించిన కారణం ఏముంది ఈ జైత్రయాత్రకు..? జనగర్జనకు..?

తనకు రాజ్యసభ సీటు, కోడలికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కేసీయార్ హామీ ఇచ్చాడని ఓ ప్రచారం సాగుతోంది… నిజానికి జీవన్‌రెడ్డిని ప్రస్తుత అవసరానికి నాలుగు రోజులు నెత్తిన మోశాక… ఆ తరువాత బీఆర్ఎస్‌లో తన పరిస్థితేమిటో కాలం చెబుతుంది… జస్ట్, కేటీయార్… అంతా, తనొక్కడికే ప్రాధాన్యం, తప్పనిసరై హరీష్ రావుకు… అంతకుమించి ఏ నాయకుడికీ ఏ ప్రాధాన్యమూ ఉండదు…

నిన్న పింక్ క్యాంపు తన పత్రికలో జీవన్‌రెడ్డి ఇంటర్వ్యూ ఫస్ట్ పేజ్ బ్యానర్, సెకండ్ హాఫ్ పేజీ… సరే, ఆ పింక్ పేపర్ రేంజ్ అదే… కానీ ఏకంగా జీవన్‌రెడ్డి జాతీయ రాజకీయాలు మాట్లాడుతున్నాడు… రాహుల్‌ను ప్రధాని గాకుండా రేవంత్ రెడ్డి ఆపిండట… తను ప్రధాని అయ్యే చాన్స్ ఎప్పుడొచ్చింది..? రేవంత్ ఎలా, ఎప్పుడు అడ్డుపడ్డాడు..? పైగా రేవంత్ చేతిలో హైకమాండ్ బందీ అట…

జీవన్ రెడ్డి

నేను పోతా, నేను పోతా అంటుంటే… పీసీసీ అధ్యక్షుడు సహా అందరూ ఏవో సంప్రదింపులు చేస్తున్నా సరే… రేవంత్ రెడ్డి మాత్రం పోయేవాళ్లు పోతారులే అన్నట్టు లైట్ తీసుకోవడంతో… ఆ మంట ఎక్కువైనట్టుంది జీవన్ రెడ్డికి… ఆ ఉక్రోషంలో ఏదేదో మాట్లాడేస్తున్నాడు…

తాజాగా రేవంత్ రెడ్డి మేడిగడ్డకు వెళ్తుంటే… అదేదో జగిత్యాల పింక్ సభకు మైలేజీ, ప్రచారం దక్కకుండా చేసే కుట్ర అని మరో ప్రచారం… అసలు ఆ బరాజును అక్కరకు రాకుండా చేసిందే కేసీయార్ కదా… ఈ నిర్వాకం మళ్లీ మళ్లీ జనంలో చర్చకు వస్తుందని ఆందోళన, అంతే… ఐనా రేవంత్ రెడ్డి కూడా పొలిటిషియనే కదా… తను చేసేది కూడా రాజకీయమే కదా… ఎదుటి పార్టీకి ప్రచారం దక్కకుండా చేయాలనుకుంటే, అందులో రాజకీయ కోణంలో తప్పేముంది..?!

జగిత్యాల

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రజల్లోకి రీ-ఎంట్రీ..! ఈ ఒక్క సభ కోసమేనా..? ఇక ప్రజల్లోనే ఉంటాడా..?
  • బ్యాక్ టు బేసిక్స్..! పుస్తకాలు- పెన్నులు మళ్లీ…! మనమూ మారదాం..!!
  • మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్ లింక్… ఇదుగో క్లారిటీ…
  • తెలంగాణపై విషం కాదు తేజస్వీ… ఇదుగో మీవాడే… కిక్కుమనవేమి…
  • సంక్రాంతి విందులో ఖర్జూరాలు..! మరో వివాదంలో లెన్స్‌కార్ట్..!!
  • B-Grade Reply… దురంధర్‌కు కౌంటర్ కొట్టబోయి పాకిస్థానీలు నవ్వులపాలు..!!
  • … ఇంతకీ హీరో శోభన్ బాబు చేసింది నేరమా..? న్యాయమా..?
  • సినిమా తీసేవాడికి చూసేవాడు లోకువ… బ్యాడ్ బాయ్ నాగశౌర్య…
  • పాపం ప్రతాప్… పాపం ప్రేక్షకుడు… టైటిల్ జస్టిఫికేషన్ ఎవరికి..?!
  • రాహుల్ గాంధీ పోటీ చేయలేడా ఇక…? పౌరసత్వానికే ముప్పుందా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions