.
అతిలోకసుందరి శ్రీదేవి బిడ్డ… ఆ ట్యాగే జాన్వీకపూర్ కెరీర్‌కు ఎప్పటికప్పుడు ఊతం… అఫ్‌కోర్స్, అదే అందం, కాస్త చురుకుదనం… ఇంకాస్త నటన నేర్వాలి… మంచి పాత్రలు పడాలి…
చిన్నప్పటి నుంచీ సినిమా వాతావరణంలోనే పెరిగింది కాబట్టి కాస్త చిన్న వయస్సులోనే ముదురు… ఈమధ్య పరమ్ సుందరి సినిమాలో ఓ మలయాళీ పాత్ర వేస్తే, మాలీవుడ్ వ్యతిరేకంగా స్పందించింది… జాన్వీ ఆ పాత్ర చేసిందని కాదు, ఆ యాసకు ఓనర్లమైన మేమెందుకు ఆ పాత్రకు పనికిరాలేదు అని…
Ads
దీనికి జాన్వీ సరిగ్గా సమాధానాలు ఇచ్చుకోలేకపోయింది… ఏ పాత్రయితేనేం, ఎవరు చేస్తేనేం, దానికి న్యాయం చేశానా లేదానేదే ముఖ్యం, ఏ ప్రాంత పాత్ర అయితే ఆ భాష తారలే నటించాలా..? వంటి ప్రశ్నలు సరిగ్గా సంధించలేకపోయింది… సరే, ఆ సినిమా అంత హిట్ కాలేదేమో, బాక్సాఫీసు దగ్గర పోరాడుతోంది…
ఆమెను ఎవరు ఏమడిగినా సరే… అంటే వ్యక్తిగత విషయాలు… వెంటనే తన సౌత్ మూలాల్లోకి వేగంగా వచ్చేస్తుంది… తనది నార్త్ కుటుంబమే అయినా… అమ్మ సౌత్ కదా… తాజాగా తన కొత్త చిత్రం ‘పరమ్ సుందరి’ని ప్రమోట్ చేయడం కోసం కపిల్ శర్మ షోకు వెళ్లింది జాన్వి… తన పెళ్లి, పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది…
సరదాగా చేసినా సరే, వినడానికి బాగున్నయ్… అవేమిటంటే..? ‘‘ఈ జాన్వికి ముగ్గురు పిల్లలు కావాలి… చాలామంది హీరోయిన్లు అసలు పిల్లల్ని కనడానికే ఇష్టపడటం లేదు… అలాంటిది నాకు ఏకంగా ముగ్గురు పిల్లల్ని కనాలని ఉంది ఎందుకు అంటారా..? మూడు నా లక్కీ నంబర్ … ఐనా ఇద్దరు ఉంటే గొడవలు, ముగ్గురైతే బెటర్, సందడి ఉంటుంది’…
గతంలో కూడా ఓ ఇంటర్వ్యూలో జాన్వి మాట్లాడుతూ… ‘‘నాకు నా తల్లి స్వస్థలమైన చెన్నైలో, ఆమె పూర్వీకుల ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నది కోరిక… అక్కడ ప్రాథమిక పెళ్లి తంతులన్నీ పూర్తయ్యాక తిరుమలలో వివాహం చేసుకోవాలని ఉంది… అంతేకాదు, వీలైతే తిరుపతిలోనే సెటిల్ కావాలని ఉంది… పంచెలో ఉన్న తన భర్తతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం… అరటి ఆకుల్లో భోజనం చేస్తూ ‘గోవిందా గోవిందా’ అని నామస్మరణ చేయడం… ఇంతకంటే నాకు వేరే జీవితం అక్కర్లేదు…’’
అఫ్‌కోర్స్, ఆమె కెరీర్, ఆమె పెరిగిన వాతావరణం ప్రభావంతో అవేమీ ఆచరణసాధ్యం కావు… కానీ పిల్ల చాలా సరదాగా చెబుతున్న తీరు మాత్రం ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా ఉంది..!!
Share this Article