.
అవును, శ్రీదేవి బిడ్డ జాన్వీకపూర్ అడిగిన ప్రశ్న సరైనదే… దేశాన్ని కీర్తించడానికి సందర్భం ఏముంటుంది అనడుగుతోంది… భారత్ మాతాకీ జై అని ఉత్సాహంగా నినదిస్తే ఎవరికైనా ఎందుకు అభ్యంతరం ఉండాలి..? అసలు విషయం ఏమిటంటే..?
ఈమె ఇటీవల ఒక జన్మాష్టమి వేడుకలో పాల్గొంది… అక్కడ ‘దహి హండి’ సంప్రదాయం… అంటే, ఏమీ లేదు, ఉట్టి కొట్టే కార్యక్రమం… దహి హండిని కొబ్బరికాయతో పగలగొడతారు… ఈ సందర్భంగా హోస్ట్‌తో కలిసి, అందరూ ఆ నినాదాలు చేస్తుంటే ఆమె కూడా ‘భారత్ మాతా కీ జై’ అని నినదించింది… తర్వాత, దహి హండిని పగలగొట్టే ముందు కూడా మరోసారి అదే నినాదాన్ని గట్టిగా పలికింది…
Ads
ఇంకేముందు కోతికి దహి హండి కొబ్బరికాయ దొరికినట్టు… కొందరు నెటిజన్లు ఆ వీడియోను జతచేస్తూ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు… ఆ వీడియో క్లిప్ వైరల్ చేశారు… కొందరు ఆమెకు మద్దతుగా, కొందరు వ్యతిరేకంగా చీలిపోయి వాదనలు షురూ…
కేవలం స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా తప్ప హిందూ పండుగలు, ఉత్సవాల్లో ఈ నినాదాలు ఏమిటనేది చాలామంది వేసిన ప్రశ్న…
తరువాత దీని మీద జాన్వి తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, ‘‘హోస్ట్ అడిగిన తర్వాత నేను నినాదం ఇవ్వకపోతే ఒక సమస్య, ఇస్తే ఇదీ సమస్య… ఆ నినాదం ఇస్తేనేమో మీరు కేవలం నా మాటల వీడియో వరకూ కట్ చేసి మీమ్ మెటీరియల్‌గా మార్చారు” అని అసహనం వ్యక్తం చేసింది…
“ఐతే ఏమిటట..? సో వాట్..? జన్మాష్టమి రోజునే కాకుండా, నేను ప్రతిరోజూ ‘భారత్ మాతా కీ జై’ అని అంటాను… నా ఇష్టం… ఏం చేసుకుంటారో, ఏం రాసుకుంటారో మీ ఇష్టం” అంటూ కరాఖండీగా రాసింది ఆమె తన పోస్ట్‌లో… అవును, ఈ నినాదం ఎప్పుడు పలికితే ఏం నష్టం..? ఆ నినాదంలో తప్పేముంది..? దీనికి వేరే కలర్లు పూయడం దేనికి..?
'పరమ్ సుందరి' చిత్రంపై కూడా వివాదం
జాన్వి కపూర్ నటించిన కొత్త సినిమా ‘పరమ్ సుందరి’ కూడా విడుదల కాకముందే వివాదాల్లో చిక్కుకుంది… చిత్రం ట్రైలర్ విడుదలైన తర్వాత, మలయాళీ నటి పావిత్ మేనన్ జాన్వి పాత్రపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది… జాన్వి కపూర్ యాస మలయాళీ పాత్రకు సరిగ్గా కుదరలేదని ఆమె విమర్శించింది…
పావిత్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, “సరైన మలయాళీ నటిని ఎంపిక చేసుకోవడంలో సమస్య ఏంటి? మేము తక్కువ టాలెంటెడ్‌వాళ్ళమా?” అని ప్రశ్నించింది… “నేను హిందీ ఎలా మాట్లాడుతున్నానో, అలాగే మలయాళం కూడా బాగా మాట్లాడగలను. ఒక హిందీ సినిమాలో పాత్ర కోసం మలయాళీ నటిని కనుగొనడం అంత కష్టమా?” అని చెప్పుకొచ్చంది…
ఈ చిత్రం ఢిల్లీ, కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమకథను వివరిస్తుంది (మరో చరిత్ర తరహాలో..? ఇందులో సిధార్థ్ మల్హోత్రా, రాజీవ్ ఖండేల్వాల్, ఆకాష్ దహియా కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు… !!
Share this Article