Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేవంత్ మరో ఉత్తమ ప్రతిపాదన – కానీ సమస్య ఎక్కడొస్తుందంటే..?

July 28, 2026 by M S R

.

నిర్మొహమాటంగా చెప్పాలంటే… రేవంత్ రెడ్డి కొన్ని ఆచరణాత్మక ప్రతిపాదనల్ని చర్చకు పెడతాడు… అవెందుకు మంచివో చెబుతాడు… కానీ దాన్ని అందిపుచ్చుకోవడంలో కాంగ్రెస్ హైకమాండ్ వెనుకబడిపోతుంది… ఎందుకంటే, అది ఇంకా పాతకాలపు ఆలోచన ధోరణుల్లోనే ఉండిపోయింది కాబట్టి… మారడానికి ఇష్టపడదు కాబట్టి…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్టించుకోదు, ఎందుకంటే..? రాజకీయం! కాంగ్రెస్ పార్టీ చెబితే మేం చేయాలా అనే ఇగో… నాన్ యూజ్‌ఫుల్ పొలిటికల్ యారొగెన్స్! అసలు ఆ ప్రతిపాదనల్లో మెరిట్స్, డీమెరిట్స్ ఆలోచించాలి కదా, దేశానికి, సమాజానికి మంచిదైతే ఆచరిస్తే తప్పేమిటి..?

Ads

ప్రస్తుతం రేవంత్ రెడ్డి జై జవాన్, జై కిసాన్, జై యువ అనే స్లోగన్ ఇస్తున్నాడు… ఇందులో తన ప్రధాన ఉద్దేశం ఏమిటంటే..? ఆర్మీకి, ఫార్మర్‌కు ప్రయారిటీ ఇస్తున్నట్టుగానే మన విధానాల్లో యువత ఆకాంక్షలు, ఆశలకూ ప్రయారిటీ ఇవ్వాలని! అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజాప్రాతినిధ్యంలోకి యువతను ఎక్కువగా తీసుకురావాలని!

రేవంత్ రెడ్డి

సందర్భం ఏమిటి..? పలు దేశాల్లోలాగే ఈ దేశ యువతలోనూ అసంతృప్తి బాగా పెరుగుతోంది… ఇది చల్లబడిన పెట్రోల్ వంటిది… ఎవరైనా ఏ కాజ్ కోసమైనా అంటిస్తే ఇట్టే భగ్గుమంటుంది… కాక్రోచ్ పార్టీ విజృంభణ అదే… పనిలోపనిగా అసాంఘిక శక్తులూ తలదూరుస్తాయి, ఇవన్నీ రావద్దంటే యువతకు వీలైనంత ఎక్కువగా ప్రజాప్రాతినిధ్యంలో వాటా ఇవ్వాలి…

ఉద్దేశం మంచిదే… సెంట్రల్ సర్వీస్‌కు 21 ఏళ్లు కనీస వయోపరిమితి అన్నప్పుడు… స్థానిక ఎన్నికల్లో అదే వయస్సు పరిమితి ఉన్నప్పుడు… చట్టసభలకు మాత్రం 25 సంవత్సరాలు దేనికి..? అందుకని తెలంగాణ శాసనసభలో ఈ వయోపరిమితిపై ఓ చట్టం చేసి కేంద్రానికి పంపిస్తామని అంటున్నాడు, గుడ్…

ఐతే, బీజేపీ దీన్ని స్వీకరించదు, కాంగ్రెస్ హైకమాండ్ టేకప్ చేయదు… ముందే చెప్పుకున్నట్టుగా ఈ హైకమాండ్ కాలానికి అనుగుణంగా మారడం లేదు, బీజేపీయేమో కాంగ్రెస్ ప్రతిపాదనగా మాత్రమే చూస్తుంది… కాకపోతే రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ‘‘యువతకే ప్రాధాన్యం’’ అనే స్టాండ్ తీసుకోబోతున్నాడు… అదెలా అనేది తరువాత చూద్దాం…

సేమ్, సీట్ల డీలిమిటేషన్ అంశం వచ్చినప్పుడు… దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, అలా గాకుండా 25 శాతం సీట్లను బ్లాంకెట్‌గా, మరో 25 శాతం జీఎస్డీపీ ఆధారంగా పెంచండి అన్నాడు… ఇదీ సౌత్ వాయిస్… కానీ కాంగ్రెస్ హైకమాండ్ దాన్ని అందిపుచ్చుకోలేకపోయింది… నిజానికి ప్రజాప్రాతినిధ్యానికి కొత్త నిర్వచనం ఇచ్చుకోగలిగితే ఇది అసాధ్యం ఏమీ కాదు…

బీజేపీ దీన్ని కూడా సానుకూలంగా చూడలేదు, సింపుల్ రీజన్… ఇది కాంగ్రెస్ వైపు నుంచి వచ్చిన ప్రతిపాదన అనే ఓ సంకుచిత రాజకీయ ధోరణి..! ఇక్కడ రేవంత్ రెడ్డా, మరొకరా కాదు చూడాల్సింది… ప్రతిపాదనల్లోని ఆచరణ సాధ్యత, ప్రయోజనం మాత్రమే చూసే ‘విశాల రాజకీయ ధోరణి’ అవసరం… ప్చ్, ఎన్‌డీయే దానికి చాలా దూరం… చాలా..!! అదీ అసలు సమస్య… పోనీ, ఎన్డీయే క్యాంపు నుంచి ఏమైనా నిర్మాణాత్మక, ఆచరణీయ కొత్త ప్రతిపాదనలు వస్తున్నాయా..? జీరో… అది మరో విషాదం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ మరో ఉత్తమ ప్రతిపాదన – కానీ సమస్య ఎక్కడొస్తుందంటే..?
  • శబరిమలలోనూ నెయ్యి కుంభకోణం ! లెఫ్ట్ నేతల నిర్వాకం !!
  • అబ్బే, ఐశ్వర్య రాయ్ అసలు అందగత్తె కానేకాదోయ్..! అందని ద్రాక్ష !!
  • పాలనలోనే… ఎక్కడో ఏదో బాగా తేడా కొడుతోంది మోదీ మహాశయా..!!
  • ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిష్టర్’ – ఏమిటి? ఎవరికి? ఎందుకు?
  • సీఎం విజయ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ! ‘ముచ్చట’ ముందే చెప్పింది!!
  • అపర కుబేరులు ఐతేనే పిల్లనిస్తారట! గొంతెమ్మ పేరెంట్స్ !!
  • పాడలేను అన్న పాటకే… జాతీయ పురస్కారం అందుకున్న నైటింగేల్!
  • సో వాట్? జైనాబ్ అఖిలకన్నా పెద్దదే! మళ్లీ పిచ్చి ట్రోలింగ్ షురూ!!
  • ప్రధాని మోడీ ఈ మూడో దఫా పదవీకాలం పూర్తి చేయగలడా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions