Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరో భారీ ఫోటోలతో హీరోయిన్ రొమాన్స్… విజయశాంతి ఆరబోత…

June 21, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …….. అగ్ని జమదగ్ని , అగ్గిపెట్టుందా !? ఈ సినిమా వచ్చినప్పుడు జనంలో మారుమోగిన ఊతపదాలు . ఆడోళ్ళతో సహా అందరూ అగ్గిపెట్టెల్ని మెయింటైన్ చేస్తారీ సినిమాలో . ఈ లైటర్ పార్ట్ పక్కన పెడితే సినిమా నిజంగా అగ్నిపర్వతమే .

అలాగే డబ్బుల లావా కురిపించింది . 12 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . షిఫ్టులతో కొన్ని సెంటర్లలో సిల్వర్ జూబిలీ ఆడింది . ఒక చోట 225 రోజులు కూడా ఆడింది .

Ads

కృష్ణ కోసమే తయారుచేసిన కధ . తన తల్లికి ద్రోహం జరిగిందనే వ్యధతో తండ్రి మీద , తండ్రి కుటుంబం మీద కక్ష , ద్వేషాన్ని పెంచుకునే పాత్ర . సమాజ విద్రోహులను కొట్టి లేనివాళ్ళకు బదిలీ చేసే రాబిన్ హుడ్ పాత్ర .

ఈనాడు , ప్రజారాజ్యం వంటి సినిమాల్లో లాగానే అగ్నిగుండం పాత్ర . కృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపిన పాత్ర . కృష్ణకు ఇంత గొప్ప పాత్రని సృష్టించిన పరుచూరి బ్రదర్సుని మెచ్చుకోవలసిందే .

కృష్ణ ద్విపాత్రాభినయం . కృష్ణ తండ్రి పాత్రలోని జగ్గయ్యకు ఇద్దరు భార్యలకు ఇద్దరు కుమారులు ఒకే రూపంలో పుడతారు . వారిలో ఒకరు జమదగ్ని అయితే మరొకరు ఆ జమదగ్నిని అరెస్ట్ చేసేందుకు నియమించబడే యస్సై చంద్రం . చంద్రం పాత్రలో కూడా కృష్ణ బాగా నటించారు .

ఈ రెండు పాత్రల తర్వాత చెప్పుకోవలసిన పాత్ర విజయశాంతిదే . గ్లామర్+ రొమాన్స్+ మూడు రసాలు కలబోసిన పాత్ర . బాగా నటించింది . మరో కధానాయిక రాధ . గ్లామరుతో పాటు కూస్తంత కామెడీ కూడా పండించింది .

తర్వాత శారద పాత్ర . కాసేపే ఉన్నా ప్రేక్షకులు మరచిపోలేరు . విలన్లుగా రావు గోపాలరావు , నూతన్ ప్రసాద్ , ప్రభాకరరెడ్డి , అల్లు రామలింగయ్యలు .

పాపం ! సత్యనారాయణది కమేడియన్ పాత్ర . కాస్త అపహాస్యం కూడా అయిందని అనిపిస్తుంది . ఇతర ప్రధాన పాత్రల్లో జగ్గయ్య , అన్నపూర్ణ , పూర్ణిమ , నాగేష్ , సారధి , సాయికుమార్ , పి జె శర్మ , రాధాకుమారి , రావి కొండలరావు , ప్రభృతులు నటించారు . మాస్టర్ అర్జున్ని ప్రత్యేకంగా అభినందించాలి . బాగా నటించాడు .

ఈ సినిమా ఘన విజయానికి రాళ్ళెత్తిన వారిలో ముఖ్యులు సంగీత దర్శకుడు చక్రవర్తి , పాటల్ని వ్రాసిన వేటూరి , డాన్సులను కంపోజ్ చేసిన సలీం , పాటల్ని పాడిన బాలసుబ్రమణ్యం , యస్ జానకి , సుశీలమ్మలు .
ఇదే ఇదే రగులుతున్న అగ్నిపర్వతం ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ . రాఘవేంద్రరావు చాలా ఎఫెక్టివుగా చిత్రీకరించారు . రొమాంటిక్ డ్యూయెట్లన్నీ అదరగొట్టేసారు . ఈ గాలిలో ఎక్కడో అలికిడి పాటలో కృష్ణ ఫొటోని విజయశాంతి లవ్వాడుతూ పాడే పాటని చాలా రొమాంటిగ్గా తీసారు రాఘవేంద్రరావు . ఫొటోలతో కూడా శృంగార రసాన్ని పండించగల దర్శకేంద్రుడు దొరకటం తెలుగు ప్రేక్షకుల అదృష్టం .

ఆ రోజుల్లో కృష్ణ అభిమానుల హుషారుకు పగ్గాలు లేని పాట వెయ్యి వెయ్యి చెయ్యి చెయ్యి నంబర్ వన్ . రాధ , కృష్ణల మీద ఉండే ఈ పాటలో కృష్ణ నలభై డ్రెస్సులు వేస్తాడు . మరి అభిమానుల సంతోషానికి అవధులు ఉంటాయా !?

వీరిద్దరిదే మరో డ్యూయెట్ గోడ దూకి వచ్చాను చందమామ . వేటూరి ఏదయినా దూకిస్తాడు . మరో అల్లరి డ్యూయెట్ రావే ఇంగ్లీష్ రంభ . రాధ , కృష్ణలు కలిసి రావు గోపాలరావు , సత్యనారాయణలను గోల చేసే డ్యూయెట్ . బాగుంటుంది . వయ్యారాలు సింగారాలు గ్రూప్ డాన్స్ ఫక్తు రాఘవేంద్రరావు స్టైల్లో ఉంటుంది . వెరశి పాటలన్నీ సూపర్ డూపర్ .

సినిమా షూటింగ్ మద్రాస్ , హైదరాబాద్ , ఊటీలలో 30 లక్షల రూపాయల బడ్జెటుతో నిర్మించారు అశ్వినీదత్ . కనక వర్షం కురిసింది . వంద రోజుల ఫంక్షన్ మద్రాస్ తాజ్ కోరమాండల్లో జరిగింది . జమదగ్ని భవనం భారీ సెట్ చాలా ఇంపోజింగుగా ఉంటుంది . పద్మాలయా స్టూడియోలో వేసారు .

ఈ రౌద్ర , శృంగార , ఏక్షన్ , డ్రామా , మ్యూజికల్ , సెంటిమెంట్ సినిమా ఆరోజుల్లో చూడని వారు ఎవరూ ఉండరు . అప్పుడప్పుడు టివిలో కూడా వస్తుంటుంది . సినిమా యూట్యూబులో ఉంది .

చూడనివారు తప్పక చూడండి . పాటల వీడియోలను మాత్రం అస్సలు మిస్ కాకండి . కనుల విందుగా ఉంటాయి . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక అంబానీ ఎదుగుదల..! కుబేర చూస్తుంటే ఏమీ గుర్తుకురాలేదా..?
  • పుడితే ఒక్కటి, చస్తే రెండు… అసలు ఆ మాటలో అర్థమేమిటో తెలుసా..?!
  • హీరో భారీ ఫోటోలతో హీరోయిన్ రొమాన్స్… విజయశాంతి ఆరబోత…
  • నగరం వదిలేశాడు… సొంతూరు చేరాడు… ఆ పల్లెకు మళ్లీ జీవకళ తెచ్చాడు…
  • మరీ సిల్క్ స్మిత మీద ప్రతీకారం, అదీ పునర్జన్మతో… నచ్చలేదు..!!
  • బనకచర్ల సినిమా కథలో మరో పెద్ద ట్విస్టు…! బస్తర్ టు బనకచర్ల..!!
  • జూన్ 20… నిజంగానే ఈ దినానికి ఇండియన్ క్రికెట్‌లో పవిత్రత ఉందా..?!
  • భార్యా చైతన్యవతీ శత్రు..! నిజమేనా..? స్త్రీలు అంత ప్రమాదకారులా..?!
  • ఓ మేనత్త కథ… ఓ కుటుంబ కథ… సొంత బిడ్డలూ కానని దుఖపు కథ…
  • వాడెప్పుడూ పాకిస్తానీ స్నేహితుడే… మనమెందుకు సాగిలబడుతున్నాం…!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions