Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం… అప్పట్లో ఊపేసిన మాస్ పాట…

August 17, 2024 by M S R

మోగింది వీణ పదే పదే హృదయాలలోన, ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే అనే ఈ పాట క్లాస్ ఆడియెన్సుని రంజింపచేస్తే , మంగమ్మా నువ్వు ఉతుకుతుంటె అందం అనే పాట మాసుని ఒక ఊపు ఊపి గంతులు వేయించింది . దాశరధి వ్రాసిన మొదటి పాట ఈరోజుకీ సంగీత ప్రియులు ఆస్వాదిస్తూనే ఉంటారు . వీణ మీద సుశీలమ్మ , పార్కులో రామకృష్ణ కూడా పాడారు .

ఇంక రెండో పాట తిరునాళ్ళలో , ఫంక్షన్లలో ఇరగతీసింది . కొసరాజు వ్రాయగా మాధవపెద్ది రమేష్ , పుష్పలు పాడారు . బాబీ సినిమాలో హం తుం ఏక్ కమరేమే బంద్ హో పాట ట్యూన్లో ఉంటుంది .

1975 లో వచ్చిన ఈ జమీందారు గారి అమ్మాయి కె వి రెడ్డి గారి శిష్యుడైన సింగీతం శ్రీనివాసరావుకు , హీరో రంగనాధ్ కు బ్రేక్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు . 1950 లో హిందీలో వచ్చిన షీష్ మహల్ సినిమా ఆధారంగా మన తెలుగు సినిమా తీయబడింది . హిందీలో సొహ్రాబ్ మోడీ , నసీం బాను , ప్రాణ్ లు నటించారు . అదీ బాగా ఆడింది . మన తెలుగు సినిమా కూడా వంద రోజులు లాగించబడింది . మొత్తం మీద రంగనాధ్ కు , సింగీతానికి బ్రేక్ ఇచ్చింది . నవతా కృష్ణంరాజు నిర్మాత .

Ads

జి కె వెంకటేష్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిగతా పాటలు కూడా బాగుంటాయి . ఇంటింటా దీపాలు వెలగాలి , కొండపల్లి బొమ్మా , దిసీజ్ లైఫ్ ఇది జీవితం , ఈ లోకపు చదరంగంలో జీవులంతా పావులే పాటలు శ్రావ్యంగా ఉంటాయి . వక్కలంక లక్ష్మీపతిరావు వ్రాసిన ఈ లోకపు చదరంగంలో పాట సాహిత్యపరంగా కూడా బాగుంటుంది .

రంగనాధ్ , శారద , గుమ్మడి , కృష్ణకుమారి , పి జె శర్మ , రాజబాబు , అల్లు రామలింగయ్య , గిరిబాబు , రావి కొండలరావు , మమత , సారధి ప్రభృతులు నటించారు . శారదకు ఇలాంటి సినిమాలు కొట్టిన పిండే .

తరతరాలుగా మా తాతలు నేతులు తాగారని , దానధర్మాలు చేసారని , వాళ్ళ వారసత్వాన్ని నిలబెట్టాలని అప్పులు చేసి తాతల కట్టించిన ఇంద్రభవనాన్ని అమ్మేసి వీధిన పడ్డ ఓ జమీందారి కధ . ఏ ఇంట్లో అయితే పుట్టి పెరిగిందో అదే ఇంట్లో పని చేసే పాత్రను శారద అలవోకగా చేసేసింది . జమీందారు గారి అమ్మాయి ఇంద్రభవన్ని కొనుక్కున్న ఆసామికి కోడలు కావటంతో సినిమా ముగుస్తుంది . హిందీ సినిమాలో జమీందారి గారి భవనం పేరు షీష్ మహల్ , మన తెలుగులో ఇంద్రభవనం .

చక్కటి ఫీల్ గుడ్ , ఎమోషనల్ మూవీ . యూట్యూబులో ఉంది . చూడబుల్ సినిమా . ఖాళీ టైంలో మంచి సినిమా చూడాలనుకునే వాచ్ లిస్టులో పెట్టుకోండి . మోగింది వీణ పాట వీడియో మాత్రం తప్పక చూడండి . చాలా చాలా శ్రావ్యంగా ఉంటుంది. #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……….. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రిట్రీట్..? మావోయిస్టుల ఆయుధసన్యాసం నిజమేనా..? వాట్ నెక్స్ట్..?!
  • అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
  • అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…
  • మంచు కాదు కంచు లక్ష్మి..! డ్రెస్‌ సెన్స్‌ ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు…!
  • కృష్ణాజలాలపై కేసీయార్ తప్పుటడుగులకు రేవంత్ విరుగుడు ప్రయాస..!
  • కేసీయార్ బాపతు గోదావరి జలవైఫల్యాలకు రేవంత్‌రెడ్డి దిద్దుబాట..!
  • విరిగిన ఎముకలకు ‘క్విక్ ఫిక్స్’… నిమిషాల్లో అతికించే మ్యాజికల్ జిగురు..!!
  • విలనుడు రేపు చేస్తే కేరక్టర్ అవుతుంది గానీ వీరోయిన్ అయిపోదు కదా…
  • వాణిశ్రీ అనుకుని భానుమతి రూమ్ బెల్ కొట్టాను… ఆమె ఏమన్నారంటే!
  • భారీ బ్యానర్ ఐనంతమాత్రాన … సినిమా ఆడాలనేముంది..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions