కేజీఎఫ్ ఒకటీరెండు పార్టులకు వరదలా వచ్చిపడిన సొమ్ముతో నిర్మాతలు అదే హీరో, అదే దర్శకుడితో ఎంచక్కా ఆరేడు సంవత్సరాలపాటు జయాపజయాలతో సంబంధం లేకుండా కేజీఎఫ్ 3, 4, 5, 6, 7 అని సీరీస్ తీయవచ్చు… ఆడుతూ పాడుతూ, సంపాదిస్తూ… సేమ్, కార్తికేయ-2కు వచ్చిన సొమ్ముతో కార్తికేయ 3, 4, 5, 6 అని తీసేయొచ్చు… అంత డబ్బొచ్చింది… అదే హీరో, ఎంచక్కా ప్రతి పార్టుకు ఓ కొత్త హీరోయిన్‌తో కృష్ణుడి కంకణాలు, రాముడి పాదుకలు, ధర్మరాజు పాచికలు, సీతమ్మ కాలిమెట్టె అన్వేషణ కథల్ని తెరకెక్కించవచ్చు…
అంతెందుకు..? అశ్వినీదత్‌కు డబ్బుకు కొదువ లేదు… కానీ టేస్ట్ లేదు, అయితే ఆయన ఇద్దరు బిడ్డలకు టేస్టుంది… సీతారామం ఘనవిజయంతో అనూహ్యంగా డబ్బొచ్చింది… మంచిదే… అశ్లీలం, అసభ్యత ఏమాత్రం కనిపించని ప్లెయిన్, ఫెయిర్, డిఫరెంట్ సినిమాలు ఇంకొన్ని తీయడానికి అది ఊతం ఇస్తుంది… ఇవన్నీ సక్సెస్ అనంతర ఆనందాలు… మరి దెబ్బతిన్న ప్రాజెక్టులు అయితే..? దాని ఇంపాక్ట్ దారుణంగా ఉంటుంది… కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది…
ఉదాహరణ లాల్‌సింగ్‌చద్దా… ఇప్పట్లో మరో భారీ బడ్జెట్ సినిమా జోలికి అమీర్‌ఖాన్ వెళ్లడు… తగిలింది మామూలు దెబ్బ కాదు… తొలిసారి బాలీవుడ్ చరిత్రలో బయ్యర్లకు ఎంతోకొంత పరిహారం వాపస్ ఇవ్వడం… నైతికంగా కూడా ఆ సినిమా ఫ్లాప్ ఆమీర్‌ను బలంగా దెబ్బకొట్టింది… లైగర్ కూడా అంతే… 20 ఏళ్ల సంపాదన హారతి కర్పూరం అయిపోయిందంటూ చార్మి ఏడవడం పక్కన పెట్టేయండి, ఆ డిజాస్టర్ ప్రభావం వెంటనే పూరీజగన్నాథ్, విజయ్ దేవరకొండ తదుపరి ప్రాజెక్టు మీద పడింది…
Ads
జనగణమన అని జేజీఎం పేరిట ఓ ప్రాజెక్టు ప్రకటించారు కదా… వచ్చే సంవత్సం విడుదల కావల్సి ఉంది… పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు… ఐరన్ లెగ్ పూజాహెగ్డేను హీరోయిన్‌గా తీసుకున్నారు… పూరీ, చార్మిల సొంత సినిమా… డౌటేముంది..? మరో పాన్ ఇండియా సినిమా అని ప్లాన్ చేశారు… కానీ లైగర్ దెబ్బ మామూలుగా పడలేదు కదా… ఫాఫం, హీరో, దర్శకుడు మనోళ్లే కదా, కాస్త ఆసరాగా నిలిచి, నిలబెడదాం అని మైహోం వాళ్లు అనుకున్నారు, కానీ మళ్లీ బడ్జెట్ విషయంలో వెనక్కి వెళ్లారు… వెరసి జనగణమన సినిమాకు జనగణమన పాడినట్టే… కొబ్బరికాయకు ముందే గుమ్మడికాయ కొట్టేశారు ఈ మిలిటరీ యాక్షన్ మూవీకి…
ఇదేకాదు, విజయ్ దేవరకొండ సినిమాలు సందేహంలో పడతాయి… ప్రత్యేకించి బిగ్ బడ్జెట్ సినిమాలు ప్రశ్నార్థకం అవుతాయి… లైగర్ ఫెయిల్యూర్‌కు కారణాలు ఏమిటన్నది కాదు ఇష్యూ ఇక్కడ… సినిమా ఇండస్ట్రీలో మెరిట్, కష్టం మన్నూమశానం కాదు, లక్ మాత్రమే ప్రధానం… సక్సెస్ మాత్రమే నిలబెడుతుంది… ఇది దందా… ప్రతి పైసాకూ చాలా లెక్కలుంటయ్… ఇదే డెస్టినీ అంటే… ఓ చిన్న హీరో నిఖిల్ సుడి తిరిగింది… దేశంలో ఎక్కడికి వెళ్లినా యూత్ నీరాజనాలు పడుతున్న స్టార్ హీరో విజయ్‌ను మాత్రం విధి ఈడ్చికొట్టింది…
నిజానికి జేజీఎంకు అవసరమైన 20 కోట్లో, 30 కోట్లో పెట్టడం మన తెలుగు నిర్మాతలకు చాలా చిన్న విషయం… బోలెడు మంది నిర్మాతలు వందల కోట్లు పెట్టగలిగే స్థితిలో ఉన్నారు… కానీ లెక్కల్లో ఎక్కాలు కుదరడం లేదు… విజయ్‌కు చాన్నాళ్లయింది సక్సెస్ లేక, లైగర్ కూడా దెబ్బేయడంతో ఆమాత్రం బడ్జెట్ పెట్టి, సినిమాకు సై అనేవాళ్లు కనిపించకుండా పోయారు… జేజీఎంకు వంశీ పైడిపల్లి కూడా ఓ నిర్మాత… ఐనాసరే, సినిమాకు జనగణమన పాడాల్సి వచ్చింది…!! బ్రహ్మాస్త్రం ఫస్ట్ పార్ట్ హిట్టయితే సరి… అనుకున్నట్టు మూడు పార్టులూ ఇదే భారీ బడ్జెట్‌తో తీస్తారు… లేదంటే..? పాపం శమించుగాక… టైం డిసైడ్ చేస్తుంది…!!
Share this Article