Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆల్రెడీ బాలయ్య హిట్ సినిమా ఇది! మరి రీమేక్ ఎవరు చూడాలి ?!

July 22, 2026 by M S R

.

వున్నట్లుండి అటు తమిళనాట, ఇటు తెలుగు ట్రేడ్ వర్గాల్లోనూ ఇదే ఇప్పుడు హాట్ టాపిక్! ‘‘జననాయగన్ తెలుగులో కూడా రిలీజ్ అవుతోందా? తేదీ ఎప్పుడు? ఫుల్ బుకింగ్స్ అంటున్నారు నిజమేనా? అది బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అట కదా, విజయ్ వంటి పాపులర్ హీరో తెలుగు నుంచి రీమేక్ చేసి, మళ్లీ తెలుగులో రిలీజ్ ఏమిటి..? బాలకృష్ణ ఆల్రెడీ తెలుగులో స్టార్ కదా, సినిమా హిట్టే కదా, తెలుగులో మళ్లీ ఎవరు చూస్తారు..? ఇవీ ప్రశ్నలు…

అవును, విజయ్ నటించిన ‘జననాయగన్’ (తెలుగులో ‘జననాయకుడు’ పేరుతో) చిత్రం తెలుగులో కూడా గ్రాండ్‌గా విడుదలవుతోంది… సెన్సార్ తదితర కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి, చివరికి జూలై 23, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది…

Ads

ఫుల్ బుకింగ్స్ వందశాతం నిజం. ఇది విజయ్ కెరీర్‌లో చివరి సినిమా (యాక్టింగ్ వీడ్కోలు చిత్రం) కావడంతో పాటు, ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న తొలి సినిమా కావడంతో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. బెంగళూరు, చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే టికెట్లు అమ్ముడైపోయి, చాలా చోట్ల షోలు ‘హౌస్‌ఫుల్’ అయ్యాయి.

‘భగవంత్ కేసరి’ రీమేకా? – విజయ్ లాంటి స్టార్ రీమేక్ చేయడం ఏమిటి?:

ఇది నిజమేనని స్వయంగా దర్శకుడు హెచ్. వినోద్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో స్పష్టం చేశాడు. బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ స్ఫూర్తితోనే ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు తెలిపిన వివరాల ప్రకారం, ఇది పూర్తిగా కాపీ చేయకపోయినా… ఆ సినిమా సోల్ (ఆత్మ) ఆధారంగా సుమారు 50 శాతం మేర (ముఖ్యంగా ప్రథమార్థంలో కాపీ ఎక్కువగా ఉంటుంది) రీమేక్ తరహాలోనే రూపొందింది…

అయితే, నందమూరి బాలకృష్ణ తెలుగులో ఇప్పటికే టాప్ స్టార్‌గా ఉండి, ఆ సినిమా ఇక్కడ ఘనవిజయం సాధించినప్పటికీ… మళ్లీ తెలుగులో ఎవరు చూస్తారు అనే ప్రశ్నకు జవాబు… ఇది తమిళ ప్రేక్షకుల కోసం… ఇందులోని ఎమోషన్, పొలిటికల్ డైలాగ్స్ టీవీకే పార్టీ కోసం ఉద్దేశించినవి… అందుకే విజయ్ ఈ కథ పట్ల చూపిన ప్రత్యేక ఆసక్తి,..

ఇందులోని మహిళా సాధికారత కోణం (Women Empowerment) నచ్చడంతో హెచ్. వినోద్ దీన్ని తమిళ నూతనోత్సాహానికి తగినట్లుగా మలిచాడు… పైగా విజయ్ తన రాజకీయ ప్రయాణానికి ముందు చేసిన ఆఖరి చిత్రం కావడంతో, ఇతర భాషల విజయవంతమైన కథలను కూడా తన శైలికి తగినట్లుగా మార్చుకుని ఫ్యాన్స్‌కు ఒక పొలిటికల్ ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ రీమేక్ ప్రయోగానికి ఒప్పుకున్నాడు. మరి తెలుగులో ఎవరు చూడాలి అంటారా..?  ఎంతొస్తే అంత, ఆఫ్టరాల్ డబ్బింగ్ ఖర్చులే కదా..!

‘జన నాయగన్‌’పై దర్శకుడు హెచ్. వినోద్ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఏమిటంటే… “రీమేక్ ఎందుకు అని అడిగాను… రెండుసార్లు ఏడ్చాను కూడా… ఒకటి సెన్సార్ చిక్కుల్లో పడి సినిమా రిలీజ్ గాకుండా పోయినప్పుడు… మరొకటి ప్రింట్ నెట్‌లో లీకయినప్పుడు…’’

‘‘నిజానికి విజయ్ చివరి సినిమా కదా, మొదట మరో కథ సిద్ధం చేశా… అయితే ఆ కథ చాలా హెవీగా ఉందని విజయ్ భావించాడు… అనంతరం ‘భగవంత్ కేసరి’ని రీమేక్ చేయాలని విజయ్ స్వయంగా సూచించాడు…  ‘భగవంత్ కేసరి’ కథ తనకు ఎందుకు నచ్చిందో విజయ్ సీన్ బై సీన్ వివరించాడు. ముఖ్యంగా మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు విజయ్‌ను ఆకట్టుకున్నాయి. ఇది కేవలం హీరోయిజం, కమర్షియల్ అంశాలతో రూపొందించిన సినిమా కాదు…. సున్నితమైన రాజకీయ పరిస్థితులు, భావోద్వేగాలు, సామాజిక సందేశంతో కథ సాగుతుంది’’ … ఇదీ తన వివరణ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆల్రెడీ బాలయ్య హిట్ సినిమా ఇది! మరి రీమేక్ ఎవరు చూడాలి ?!
  • డొల్ల మాటల వ్యాపారి..! మళ్లీ తెలంగాణ యాసపై అదే ఏడుపు !!
  • ఢిల్లీ అల్లర్ల వైఫల్యానికి, కల్లోలానికి ఎవరు అసలు బాధ్యులు..?
  • అబ్బో… ఈ ఉదయ్‌కృష్ణుడు మామూలోడు కాదు… ఎందుకంటే..?
  • నిజంగానే తెలుగు వర్ణమాలలోని అన్ని అక్షరాలూ మీకు తెలుసా..?
  • క్లియర్ ఎగ్జాంపుల్..! ఇలాంటి కేరక్టర్ల ఎంపిక లోపం యూపీఎస్సీదే..!
  • ఒక మెస్సీ తలవంచిన రాత్రి… ఒక యమాల్ తలెత్తిన ఉదయం!
  • ఆ బరాజులు పనికిరానట్టేనా? కాళేశ్వరం తాజా స్థితిపై సాంకేతిక విశ్లేషణ !!
  • ‘పెళ్లాల మార్పిడి’ – సొసైటీయే మారుతోంది – సర్కారు ఏం చేయగలదు..?
  • తిట్టు నేరం కాదా..? ఏది అశ్లీల నేరం..? ఏది కాదు..? వర్గీకరణ ఎలా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions