.
గతంలో నిజాం రాజు తనకు సేవలు చేసిన చాలామందికి వందల ఎకరాలను రాసిచ్చినట్టు చరిత్రలో చదివినట్టు గుర్తు… చివరకు తనకు సున్నితంగా క్షురకర్మ చేసినవారికి, వంటవాళ్లకు, బట్టలు కుట్టిన దర్జీలకు కూడా..! విశాల హృదయుడు… ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ వ్యవహారశైలి చదువుతూ ఉంటే, నిజాం రాజే గుర్తొస్తున్నాడు.
తను చుట్టూ తిరిగేవాళ్లకు, రాజకీయాల్లో ప్రవేశం లేనివాళ్లకు, రాజకీయ వ్యవహారాలు తెలియనివాళ్లకు… ఉదాహరణకు తన దగ్గర ఎంతోకాలంగా పనిచేస్తున్న డ్రైవర్ కొడుక్కి కూడా టికెట్లు ఇచ్చాడు… చాలామంది విజయ్ హవాలో గెలిచేశారు, ఒకరిద్దరు ఏకంగా మంత్రులు కూడా అయిపోయారు.
Ads
ఎలాగూ డీఎంకే కూటమి నుంచి అందరూ బయటికి వచ్చేస్తున్నారు, వద్దంటే విజయ్ పార్టీకి మద్దతు అంటున్నారు… ఏళ్లుగా డీఎంకే దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్న ఎండీఎంకే కూడా చివరకు స్టాలిన్ గుడ్‌బై అనేసింది… ఇదంతా విజయ్‌కు అనుకోని అనుకూలత… దాంతో ఇక తగ్గేదేలా అని చెలరేగుతున్నాడు.
తను క్రిస్టియనే అయినా, కర్నాటకలోని మూకాంబిక గుడికి వెళ్లొచ్చాడు, తమిళనాట గుళ్ల ఆదాయం గుళ్లకే తప్ప ప్రభుత్వ కార్యక్రమాలకు వెచ్చిందేది లేదు అన్నాడు. పెరియార్ నాస్తికభావజాన్ని మేం అంగీకరించం అన్నాడు. ఇన్నేళ్ల ద్రవిడ రాజకీయ పోకడలకు భిన్నంగా ఉన్నాడు అనుకునేలోపు… తిరుప్పరంకుండ్రం కొండపై ‘కార్తీక దీపం’ కేసులో యాంటీ- హిందూ పోకడలకు మళ్లాడు. హైకోర్టులో అప్పీల్ చేశాడు.
తాజాగా ఏం జరిగిందీ అంటే… తనతో జననాయగన్ అనే సినిమా తీశాడు కదా ఓ నిర్మాత…పేరు వెంకటనారాయణ… విజయ్ పార్టీకి మెజారిటీ వస్తోంది అని తేలిన క్షణం నుంచీ విజయ్ వెంటే తిరుగుతున్నాడు… కనిపిస్తున్నాడు… ఆ సినిమా రిలీజ్ కాకపోవడానికి కారణాలు వేరు. కానీ తన వల్ల నిర్మాత నష్టపోయాడు అనే ఏదో భావన విజయ్‌లో ఉంది…
తనను ఏకంగా ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించేశాడు… చాలా కీలకమైన బాధ్యత అది… కేంద్రం- రాష్ట్రం నడుమ ఇష్యూస్ గురించి ఆ పక్కా వ్యాపారికి ఏం తెలుసు? ఎందుకు ఈ నియామకం? తమిళనాడు జనానికి ఏం ప్రయోజనం? అప్పట్లో ఇలాగే తన వ్యక్తిగత జ్యోతిష్యుడిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించి, తరువాత అందరూ తిట్టేసరికి, నాలుక కర్చుకుని నిర్ణయం వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే కదా…
సో, అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అది తమిళనాడును ఎటు తీసుకుపోతుందో తెలియదు గానీ… ఈ వెంకటనారాయణ నియామకంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి… తెలివిలేని నిర్ణయం అని మండిపడ్డాయి… ఏడాది కాలపరిమితితో తాత్కా లిక ప్రాతిపదికన క్యాబినెట్ హోదాతోఈ నియామకం జరిగినా… అత్యంత కీలకమైన ఆ పోస్టులో ఓ సినిమా నిర్మాతను తన మెహర్బానీతో ఎంపిక చేయడం మూర్ఖత్వం అనే విమర్శలు వెల్లువెత్తాయి…
ఇక్కడ మరో అంశం… తమిళనాడుకు కర్నాటకతో జలవివాదాలు సహా చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఈ స్థితిలో బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపార నిర్మాతకు ఈ కీలకపోస్టు కట్టబెట్టడం స్పష్టంగా అవగాహన రాహిత్యమే అనే విమర్శ కూడా వస్తోంది…
“ముఖ్యమంత్రి సినిమా నిర్మిస్తే చాలు.. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి అయ్యే అర్హత వచ్చేస్తుందా?” అని అన్నాడీఎం కే ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించగా… ఈ నిర్ణయం పదవి గౌరవాన్ని తగ్గించేలా ఉందని డీఎంకే రాజ్యసభ సభ్యుడు విమర్శించారు. గతంలో రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థ ప్రెసిడెంట్, సీఈవోగా పనిచేసిన వెంకట నారాయణ, మే నెలలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్న ర్ అర్లేకర్‌ను కలిసినప్పుడు కూడా ఆయన వెంట ఉన్నాడు… ఇదేం పోకడ జననాయగా..? అసలే డీఎంకే, అన్నాడీఎంకే కాచుక్కూర్చున్నాయి బహుపరాక్..!!
Share this Article