మొత్తానికి సోషల్ మీడియా హైపర్ ఆదికి జనసేన నుంచి అసెంబ్లీ టికెట్టు కన్‌ఫరమ్ చేసేశాయి… ఒంగోలు లేదా దర్శి నుంచి పోటీ చేయబోతున్నాడట… హిందీ రాదు కాబట్టి లోకసభ టికెట్టు సందేహం, కానీ ఎన్నికల్లోపు హిందీ నేర్చేసుకుంటే ఎంపీ సీటు కూడా ఆలోచించే అవకాశం ఉంది…
అంతెందుకు..? రేప్పొద్దున చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీట్ల పొత్తు చర్చల్లో కూర్చుంటే… మా హైపర్ ఆది సీటు సంగతి తేలాకే, మిగతా సీట్ల సంఖ్య గురించి చర్చిద్దాం అంటాడేమో పవన్ కల్యాణ్… అంత బలంగా ఫిక్స్ చేశాయి మీడియా సైట్లు హైపర్ ఆదికి సీటును..! మొన్న శ్రీకాకుళం మీటింగు వేదిక మీద హైపర్ ఆది స్పీచ్ విన్న తరువాత విశ్లేషణలన్నమాట ఇవన్నీ…
సహజంగానే స్పాంటేనియస్‌గా పంచులు వేయగలడు హైపర్ ఆది… పొలిటికల్ పంచులు కూడా అలా అలవోకగా వేస్తూ వెళ్లాడు… పలుచోట్ల ఆ పంచులకు పవన్ కల్యాణ్, ఎదుట ఉన్న జనం నవ్వారు… మొత్తానికి రక్తికట్టించాడు… అయితే నాణేనికి ఒక కోణం చూద్దాం… పార్టీకి హైపర్ ఆది రూపంలో ఓ వక్త దొరికాడు… ఆ పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కాదు కాబట్టి, హైపర్ ఆదికే పార్టీ విధానాల వివరణను అప్పగిస్తే బెటర్…
Ads
రెండో కోణం ఏమిటంటే… పవన్ కల్యాణ్ మాటతీరు చెప్పుకున్నాం… నాగబాబు గురించి చెప్పుకోవడం దండుగ… నాదెండ్ల మనోహర్‌కు మాట్లాడటం రాదు… ఇంకెవరూ లేరా పార్టీలో..? పార్టీ కార్యాచరణ గురించి చెప్పడానికి ఓ మంచి పొలిటికల్ వక్త లేడా..? హైపర్ ఆది కూడా ఓవరాల్‌గా పవన్ కల్యాణ్‌ను కీర్తించే నాలుగు పంచులు వేయగలడు తప్ప తనకు పార్టీలు, విధానాలు, కార్యాచరణ వంటి లోతైన, గంభీరమైన విషయాలపై అవగాహన ఏముంటుంది..?
అసలు తన పొలిటికల్ లైన్ మీద పవన్ కల్యాణ్‌కే ఓ క్లారిటీ ఉండదు… అప్పుడే లెఫ్ట్, అప్పుడే బీఎస్పీ, అప్పుడే టీడీపీ, అప్పుడే బీజేపీ… తను పయనం ఏమిటో తనకే తెలియదు… కనీసం పవన్ కల్యాణ్ అడుగులకు జస్టిఫికేషన్ చెప్పేవాడు లేడా పార్టీలో..? హైపర్ ఆదికి అసెంబ్లీ టికెట్టు అనేది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు… అసలు అంతకుముందు చాలా ఇష్యూస్ ఉన్నాయి…
బయటికి ఎంత తిట్టిపోసినా సరే, పవన్ కల్యాణ్ టీడీపీ మనిషి… అందుకే యాంటీ వైసీపీ పోకడలు తప్ప చంద్రబాబు మీదకు వెళ్లడు… పైగా ఇప్పుడు బీజేపీ ఫోల్డ్‌లో ఉన్నాడు… టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటే బీజేపీని కత్తిరించుకుంటాడా..? చంద్రబాబు ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు ఇస్తాడు తనకు..? తన బలాన్ని ఎలా అంచనా వేస్తాడు..? తన అంచనాను పవన్ కల్యాణ్ అంగీకరిస్తాడా..? పొత్తులో భాగంగా సీట్లు ఇచ్చినా సరే, దానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండే అలవాటు కూడా లేదు చంద్రబాబుకు…
ఇక్కడ హైపర్ ఆది పోటీ ఫైనల్ అని పవన్ కల్యాణ్ చెప్పగానే… చంద్రబాబు వోకే వోకే అని తలూపేసే రకం కాదు… తెలుగుదేశం వోట్లన్నీ పడతాయని లేదు… సరే, అదంతా ఓ రాజకీయం, కానీ నిజంగా హైపర్ ఆది రాజకీయాల్లోకి వెళ్తాడా..? నిజంగానే వెళ్లేటట్టయితే ఒంగోలు లేదా దర్శి ఏరియాల్లో వర్క్ స్టార్ట్ చేసుకోవడం బెటర్… రోజాను తిడతాడో, అంబటి రాంబాబును తిడతాడో… జనంలోకి వెళ్తూ, జనంలో ఉంటూనే ఓ పొలిటికల్ యాక్షన్‌లో ఉండాలి… అక్కడ పాతుకుపోయిన వేరే పార్టీల లీడర్ల రాజకీయాలు ఎలా ఉంటాయో అప్పుడు గానీ ఆదికి అర్థం కావు… పాలిటిక్స్ అంటే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో తోటి ఆర్టిస్టుల మీద ర్యాగింగ్ పంచులు వేయడమంత సులభం కాదని తెలుస్తుంది..!
Share this Article