Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శ్రీదేవి బిడ్డకు తత్వం బోధపడిందట ! తప్పు జరిగిందని ఒప్పుకోలు !!

October 29, 2026 by M S R

.

ఎట్టకేలకు శ్రీదేవి బిడ్డ జాన్వీకపూర్ నోరు విప్పింది… పెద్ది సినిమాాలో తన ఎక్స్‌పోజింగ్ తప్పేనని ఒప్పుకుంది… మరీ చెంపలేసుకోలేదు గానీ ఇందులో తన తప్పు కూడా ఉందని ‘కాఫీ విత్ కరణ్9’ టాక్‌షోలో చెప్పుకొచ్చింది…

సినిమాలో ఆమె పాత్రకు ఏ ప్రాధాన్యమూ లేదు… ఆమె అందచందాల్ని అశ్లీలంగా చూపించడానికి తప్ప ఆమె ఉనికికి ఏ అర్థమూ లేదు ఆ సినిమాలో… నెటిజనం, ప్రేక్షకులు బూతులు తిట్టారు దర్శకుడిని… సినిమా ప్రచారాన్ని కూడా జాన్వీ పట్టించుకోలేదు…

Ads

అతిలోకసుందరిగా ఆమె తల్లి శ్రీదేవిని సగటు తెలుగు ప్రేక్షకులంతా ప్రేమించారు… జాన్వీకి సినిమాల్లో ఎంట్రీకి తల్లి పేరు, లెగసీయే కారణం… కానీ ఆమె పూర్తిగా దారితప్పింది… దేవర, పెద్ది సినిమాల్లో ఆమెను ఓ సొగసైన బొమ్మగా, ఆరబోతకు వాడుకున్నారు తప్ప… ఆమె పాత్రలకు ఏ ప్రాధాన్యమూ లేదు…

శ్రీదేవి బిడ్డగా ఆమెపై ఉన్న కాస్త అభిమానమూ ఆ రెండు పాత్రలతో ఆవిరైపోయింది… ఇలాగే కొనసాగితే తను తెరమరుగే అనే విమర్శలూ వచ్చాయి… పెద్ది దర్శకుడి డర్టీ టేస్టు మీద విమర్శలు బాగా రావడంతో బుచ్చిబాబు అప్పట్లోనే బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో పాటు, వెంటనే అలాంటి సన్నివేశాల్ని సినిమా నుంచి తొలగించాడు కూడా… కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది…

janhvi

‘‘ఇప్పటివరకూ నేను స్పందించకపోవడానికి కారణం ఏంటంటే… ఆ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు… అందుకే మౌనంగా ఉన్నాను… అయితే, ఆ వ్యవహారంలో నేను కూడా బాధ్యత తీసుకోవాలి… దానిపై నాకూ బాధగా ఉంది… ఆ భారాన్ని నేను ఎప్పటికీ మోస్తూనే ఉంటాను…’’ అని ఏదో కవర్ చేసుకోవడానికి ప్రయత్నించింది ఆమె తాజాగా…

ఈ చేదు అనుభవం వల్ల తనకు ఓ మంచి జరిగిందని, ఇకపై ఏ దర్శకుడైనా తనను అభ్యంతరకరంగా చూపిస్తే వెంటనే నిలదీస్తానని అంటోంది జాన్వి కపూర్… పాత్రల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానని చెబుతోంది… ఇకపై తాను ఈ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించాలనుకోవడం లేదని,  అలా మాట్లాడితే ఇతరులను నిందించినట్లు అవుతుందని చెప్పుకొచ్చింది…

సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు చెప్పినట్లు పనిచేయాలనే వృత్తిపరమైన ఒత్తిడి ఉంటుందని,  దక్షిణాది సినిమాల్లో ముందుగానే పూర్తి స్క్రిప్ట్ అందించడం, అందులో కెమెరా యాంగిల్స్ వంటి వివరాలను స్పష్టంగా పేర్కొనడం ప్రతిసారీ జరగదని అంటోంది…

కానీ ఈ సోయి షూటింగు సమయంలో ఎందుకు లేదు తనకు..? ఆమెకు బుద్ది లేదు సరే, తండ్రికి ఎందుకు లేదు..? ప్రివ్యూలు చూస్తున్నప్పుడు హీరో ఎందుకు ఆలోచించలేదు ఇదంతా..? ఒక్క జాన్వీదే కాదు తప్పు… ఆమె రెండు సినిమాల మేకర్స్ కూడా శ్రీదేవి బిడ్డ అనే ‘ఆకర్షణ’ గురించి ఆలోచించి, అడ్డగోలుగా చూపించారు తప్ప ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే విషయాన్ని మరిచిపోయారు…

నటి, ప్రధానంగా కథానాయిక అందంగా ఉండాలని సగటు ప్రేక్షకుడు కోరుకుంటాడు, నిజమే, కానీ అందాల ఆరబోతే ప్రధానమైతే చాలా త్వరగా తెరమరుగు చేస్తాడు అదే ప్రేక్షకుడు… ఈ నిజం ఆమెకు అర్థమైతే చాలు… డబ్బు కోసం తెలుగు సినిమాలు అంగీకరించేటప్పుడు ఇది గుర్తుంచుకుంటే చాలు..!! మనవాళ్లకు అసలే తెల్లతోలు ప్రదర్శనలపై పిచ్చి ఎక్కువ… నిన్నో మొన్నో నటి రాధికా ఆప్టే చెప్పింది కూడా ఇదే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శ్రీదేవి బిడ్డకు తత్వం బోధపడిందట ! తప్పు జరిగిందని ఒప్పుకోలు !!
  • కొంపదీసి సీతమ్మ కిడ్నాప్ లోకకల్యాణం కోసమేనని చెబుతారా ఏం?!
  • అమెరికాలో ‘హ్యూమన్ కంపోస్టింగ్’… గుర్తొస్తున్న వీరశైవుల అంత్యక్రియలు!
  • టైమ్ లూప్‌లో చిక్కుకున్న కథనం… నవ్వించాలని నీరసపరిచే కామెడీ !
  • హాలోవీన్ కోలాహలం… అమెరికా మొత్తాన్ని ఆత్మలు ఆవహిస్తాయి!
  • గురువులు, విజ్ఞులు దయచేసి ఈ ధర్మసందేహాలు తీర్చగలరు…
  • సుమో దీదీ… అసాధారణ క్రీడాకారిణి కథకు శ్రియమ్ భగ్నానీ ప్రాణం!! 
  • నెహ్రూ కుటుంబానికి మళ్లీ మహర్దశ ! ప్రియాంక శకం ఆరంభం !!
  • ఓ జాతీయ సర్వే నిర్వహించి- ఆర్టిస్టులను ఎంపిక చేయాల్సిందేమో !!
  • KCR – సొంత బిడ్డనే కాదన్నాడు – ఈ ‘బిడ్డ’నూ గాలికి వదిలేశాడు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions