అకియా… అంటే పాడుబడిన ఇల్లు… భూత్ బంగ్లా… జపాన్‌లో..! ప్రస్తుతం ఇలాంటి అకియాలు ఆ దేశంలో అక్షరాలా కోటి… అంటే కోటి ఇళ్లున్నయ్, కానీ ఉండటానికి జనం లేరు… అవి అలా పఢావు పడిఉన్నయ్, పాడుబడి పోతున్నయ్… మరేం చేస్తుంది ఆ దేశం… పిల్లల్ని కనేవాళ్లు లేరు, కొత్త కుటుంబాలు లేవు, జనాభా వేగంగా పడిపోతోంది…
మిగతా ప్రపంచం మొత్తానిది ఒక బాధ అయితే జపాన్‌ది మరో బాధ… అఫ్ కోర్స్, చైనా కూడా ఇలాంటి దిశలోనే వేగంగా అడుగులు వేస్తోంది… పెళ్లి చేసుకొండర్రా, పిల్లల్ని కనండర్రా, డబ్బులిస్తాం, సబ్సిడీలిస్తాం అని మొత్తుకుంటున్నా సరే, ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు… చివరకు పెళ్లి, బాధ్యత, బంధం, కొత్త కుటుంబం అంటే చైనీయుల్లో, జపానీయుల్లో ఎంతగా వైరాగ్యం ఉందంటే… మంచి జీతాలతో అమెరికా వంటి దేశాల్లో సెటిలైనా సరే, ఒంటరి బతుకులకే ఇష్టపడుతున్నారు…
పట్టణాల్లో, నగరాల్లో అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నచోట్ల ఖాళీ ఇళ్లను కొనడానికో, అద్దెకు తీసుకోవడానికే ఎవరైనా ముందుకొస్తున్నారు తప్ప పల్లెల్లో ఉన్న ఈ భూత్ బంగ్లాలను కొనేవాళ్లు లేరు… చూసేవాళ్లు లేరు… మేనేజ్ చేసేవారు లేక, మెయింటెనెన్స్ లేక… తెలుగులో చెప్పాలంటే దీపం పెట్టేవాళ్లు లేక శిథిలమవుతున్నయ్…
Ads
‘అబ్బే, ఇళ్లు కట్టడం పెద్ద సమస్యే కాదు, ఇళ్లకు డబ్బులూ సమస్య కాదు, ఎటొచ్చీ ఆ ఇళ్లల్లో ఉండటానికి మనుషులు లేరు’ అదే జపాన్ సమస్య అంటున్నారు విశ్లేషకులు… ఆ దేశ విదేశాంగ శాఖ ఈ లెక్కలు క్రోడీకరిస్తే మొత్తం ఇళ్లల్లో 14 శాతం ఖాళీ అని తేలింది… జపాన్ అంటేనే భూకంపాలు, సునామీలు కదా… ఆ దెబ్బలకు శిథిలమైన ఇళ్లను కూడా రిపేర్లు చేసేవాళ్లు, చేయించుకునేవాళ్లు కూడా లేరిప్పుడు… జస్ట్, అలా వదిలేస్తున్నారు…
ఒక ఇల్లు ఉందీ అంటే ఒక తరం తమ తరువాత తరానికి వారసత్వంగా ఇస్తుంది… కానీ అక్కడ జనరేషన్సే ఆగిపోతున్నయ్… యువత కూడా నగరాల్లోకి వెళ్లిపోతోంది… పల్లెలు ఇలా కూడా ఖాళీ అయిపోతున్నాయి… కొన్నిచోట్ల అసలు ఏ ఇల్లు ఎవరిదో కూడా చెప్పలేని స్థితి, అంత పూర్ రికార్డ్ కీపింగ్…
జపాన్ పన్నుల విధానం మేరకు… పాత ఇంటిని కూలగొట్టి, కొత్తగా కట్టుకోవడంకన్నా దాన్నలా వదిలేయడమే మేలట… పోనీ, అమ్ముదాం, ఏదో ఓ రేటుకు అనుకుంటే, అసలు కొనేవాడే లేడు కదా… మరీ ప్రజారవాణా, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి సౌకర్యాలు లేని చోట్ల భూత్ బంగ్లాలు ఎక్కువైపోయి, ఊళ్లకు ఊళ్లే నిర్మానుష్యం అయిపోతున్నాయి…
జనాభా కొన్నేళ్లుగా క్షీణిస్తూనే ఉంది… ఉదాహరణకు 2021 నాటికి 12.5 కోట్ల జనాభా ఉంటే అది ఒకే ఏడాదిలో ఏకంగా 8 లక్షల మేరకు తగ్గిపోయింది… అంటే మరణాల సంఖ్యకు సరిపడా జననాలు ఉండటం లేదు… అదీ క్షీణత… 2023 వరుసగా ఎనిమిదో సంవత్సరం ఇలా వరుస జనాభా క్షీణత…
ఏ దేశమైనా సరే జనాభాను బ్యాలెన్స్ చేయాలంటే కనీసం 2.1 బర్త్ రేట్ ఉండాలి… దానివల్ల జనాభా పెరగకపోయినా తగ్గదు, కానీ జపాన్‌లో బర్త్ రేట్ జస్ట్ 1.3 మాత్రమే… 15 ఏళ్లలోపు పిల్లల సంఖ్య తగ్గిపోవడం అనేది వరుసగా 43 సంవత్సరాలు…
Share this Article