Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డబల్ రొట్టెల ఎవడన్నా ఉల్లిగడ్డలేస్తాడ్రా… జయహో బలగం మేనత్త…

April 3, 2023 by M S R

మళ్లీ మళ్లీ చెబుతున్నా… బలగం సినిమాకు సంబంధించి ఏ చిన్న పాజిటివ్ పాయింట్ రాయాలన్నా ఆ దిల్ రాజుకు ఉపయోగపడుతున్నామే అనే బాధ కడుపులో కాలుతోంది… తనకు రూపాయి లాభం చేకూర్చినా సరే, మనకు మనం ద్రోహం చేసుకున్నట్టే… ఆ మనిషి అలాంటోడే… ఐనాసరే, సినిమాను సినిమాగా చూస్తే… అది ఓ కల్ట్ ఇప్పుడు… ఊరూరా పారాయణం సాగుతోంది… ఇదే కథాకాలక్షేపం… చాలామంది కలం పట్టి ఫేస్‌బుక్‌లో రకరకాల కోణాల్లో రివ్యూలు రాస్తూ, తమ భావాల్ని అద్భుతంగా వ్యక్తీకరిస్తున్నారు… తమ జీవితాలతో కనెక్ట్ చేసుకుంటున్నారు…ఒక్క సినిమా మీదే కాదు… అందులో చూపించబడిన ఆచారాల మీద కూడా… కొందరు అందులోని పాత్రల మీద కూడా విడివిడిగా…! మిత్రుడు  Bala Yugandar Chittalooru…..  రాసిన ఓ పోస్టు బలగంలోని మేనత్త మీద… బాగుంది… అది యథాతథంగా…



బలగం మేనత్త – ఎల్లల్లేని కళాకారిణి

ఆమె పేరు విజయలక్ష్మి కానీ నాకు మేనత్తనే…. వాస్తవానికి ఆంధ్ర కళాకారిణి కానీ మేనత్త ఆత్మను పట్టుకున్న స్వచ్ఛమైన మనిషి. వేణు ప్రతిభ గురించి మనము చెప్పుకున్నాం…. అద్భుతంగా నటన రాబట్టుకున్నాడు అందరి కొత్తవాళ్ళ నుండి… but మేనత్త ఎందుకు ప్రత్యేకం…. ఎంత గొప్ప నటులైనా , మనస్సుల్లో భావజాల ఆధిక్యత, మిగతా సంస్కృతుల పట్ల ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, భాష , యాసల పట్ల ఈసడింపు ఉంటే అంతగా తాదాత్మ్యంతో చేయలేరు. మసక కళ్లద్దాలు, పైన సూపు, చీర గోశి… మూతి విరుపు …. మా బాల లక్ష్మమ్మ అత్తమ్మ గుర్తొచ్చింది…

ఒక వైపు నిజమైన వాత్సల్యం, ఇంకో వైపు ఛీత్కారం, కొంచెం తాకట్లు, నిస్సహాయత అద్భుతంగా పండించింది …. లేదు లేదు జీవించింది! రెండో కొడుకు సూరత్ అంతా తిప్పేటోన్ని అని దొంగ ఏడ్పు ఏడుస్తుంటే … ఏడుస్తే బాపు తిరిగొస్తడా , తాగు కొడుకా తాగు అని వాన్నీ అనునయిస్తది, వీడు తాగుబోతైండు అనే కొంచెం ఈసడింపు చూపిస్తది … ఏక కాలంలో! ఇంట్ల బిందె పెట్టి పూజ జరుపుతున్న సమయంలో ‘మొగిలిగాడు తాగువోతైండని మా అన్న మనాది పెట్టుకుండో ఏమో, అరె మొగిలి తాగుడు మానెత్త అని జెప్పురా’… వాడు తరవాత జేస్త అని చికాకుపడితే ‘అప్పటి దాకా ఎందుకురా ఇప్పుడే జెయ్యి’ అని గసుర్తది. I cannot explain how true and natural she was…. absolutely internalized the character in all its nuances!

Ads

డబల్ రొట్టెల ఎవడన్నా ఉల్లిగడ్డలేస్తాడ్రా ….అని sandwich ని వ్రయ్యలు చేసి టీ లో అద్దుకొని తినడం… ఆ నవ్వు…. I got you type…. ఇంకా చెల్లెలి మీద అన్న ప్రేమ , బతుకమ్మ పండుగ ఎపిసోడ్ …. గుర్తొస్తనే కళ్ళ నీళ్లు …. so relatable, so brilliant and so so natural! Also notice that she pacifies the other brother during 3rd, 5th and 11th day fights and arguments. Venu, without being explicit, said many things… sibling love between menatta and the surviving old babai! మేనత్తది బహుశా మొదటి సినిమా కావొచ్చు …. కానీ గుండెలనిండా నిండి పోయింది తల్లి …. జై హో అత్తమ్మ!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions