Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

షీరోగా జయసుధ తొలి సినిమా… ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదామె…

August 5, 2024 by M S R

జయసుధ హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా 1975 సెప్టెంబరులో వచ్చిన ఈ లక్ష్మణరేఖ సినిమా . పండంటి కాపురం సినిమాతో అరంగేట్రం చేసిన తర్వాత ఒకటి రెండు సినిమాలు విలన్ గానో , అప్రధాన పాత్రల్లోనో నటించింది . షీరోగా నటించి , గుర్తింపు తెచ్చుకున్న సినిమా ఇదే . భవిష్యత్తులో కేరెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకోగలదు అనే సంకేతం ఈ సినిమాలోనే ఇస్తుంది . గ్లామర్ , విషాద పాత్రల్లో కన్నాంబ , సావిత్రి , వాణిశ్రీల తర్వాత స్థానం జయసుధదే అని నేనెప్పుడూ భావిస్తూ ఉంటాను .

సందేశాత్మక సినిమా . ఓ జడ్జి గారమ్మాయి , తండ్రి మాటలను పెడచెవిన పెట్టి , పెళ్ళి పీటల మీద నుంచి ప్రియుడితో లేచిపోతుంది . ఆ దొంగ ప్రియుడు వేశ్యాగృహానికి అమ్మివేస్తాడు . ఆ దొంగ ప్రియుడిని చంపేసి , జైలుకు వెళ్ళిపోవటంతో సినిమా ముగుస్తుంది . జయసుధ గ్లామరస్ గా , మోసపోయిన యువతిగా , కోర్టు సీనులో చాలా బాగా నటించింది . ఈ సినిమా టైంకు పెద్ద అనుభవం కూడా లేకపోయినా , పెద్ద నటిగా తన నటనను ప్రదర్శించింది .

జయసుధ , చంద్రమోహన్ , మురళీమోహన్ , సుమ , గుమ్మడి , సత్యనారాయణ , ఛాయాదేవి , రామదాసు , అల్లు రామలింగయ్య , కె వి చలం , గిరిజ ప్రభృతులు నటించారు . ఈ సినిమాలో విలన్ చంద్రమోహనే .

Ads

సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో బాగానే ఉంటాయి . సముద్రాల వ్రాసిన నాడు లక్ష్మణరేఖ దాటిన ఫలితమే నేడు నేను అనుభవించే నరకము పాట హైలైట్ . కొసరాజు వ్రాసిన నీదాననురా నీ నీడనురా అనే ఖవాలీ పాటలో జయసుధ డాన్స్ బాగుంటుంది .

jayasudha

ఆత్రేయ వ్రాసిన అందరి రాతలు రాసేది ఆ దేవుడు ఆడదాని రాత రాసేది మగవాడు , సి నారాయణరెడ్డి వ్రాసిన ఒక మాట ఒకే మాట వలచే రెండు హృదయాలు , ఆరుద్ర వ్రాసిన నీ సంగతి నాకు తెలుసు నీకివ్వనురా నా మనసు పాటలు బాగుంటాయి .

ఏదయినా వేరే భాషలో వచ్చిన సినిమాకు రీమేకేమో నాకు ఐడియా లేదు . యన్ గోపాలకృష్ణ దర్శకుడు . అప్పట్లో ఈ సినిమాకు , జయసుధకు మంచి పేరే వచ్చింది . ఈ సినిమా తర్వాతే సోగ్గాడు , జ్యోతి సినిమాలు వచ్చాయి . ఈ సినిమా అవకాశాలు తర్వాత జయసుధ మరలా వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు .

యూట్యూబులో ఉంది . సందేశాత్మక చిత్రం . జయసుధ అభిమానులు తప్పక చూడవలసిన సినిమా . చూడబులే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……. [ దోగిపర్తి సుబ్రహ్మణ్యం ]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అదే… జో జీతా వహీ సికిందర్ ! వహీ చంద్రబాబు !!
  • ఇరుముడి, హనుమాన్ అంశ్ – మధ్యలో మరో సెన్సేషనల్ హిట్ !!
  • వామ్మో… అమ్మ గారు- ఆరు గంటలు… ఎడిటర్లకు ఓ ‘టాక్సిక్‌’ టాస్క్ !!
  • ‘నాణ్యమైన వీర్యాని’కి మస్తు గిరాకీ – ‘మంచి సంతానం’ కోసం అడ్డగోలు రేట్లు !!
  • ఆల్ ది బెస్ట్ సుజయ్ S/o ETV సుమన్… రామోజీ ఏకైక మగవారసుడు…
  • రేవంత్ రెడ్డి తిట్టాడు సరే – కానీ ఒక్క ప్రశ్నకూ జవాబివ్వలేని BRS క్యాంపు !!
  • అల్లు అరవింద్ మాటల్లో తప్పు లేదు- తను యశ్‌ను కించపరచలేదు !!
  • బ్రెజిల్‌లో ఈ ఆవు ధర 36 కోట్లు !! ఆ జాతికి పూర్వీకులు మన పశువులే !!
  • ఏశ నాగుల కట్ట మీద – కంట్రవర్సీ ఏమిటి..? తప్పెవరిది..? రైట్స్ ఎవరివి..?
  • సమాజం అంతే, సర్కారూ అంతే – స్పందనను పూర్తిగా కోల్పోయాయి

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions