Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బహుశా ఆ ‘శోభన్‌బాబు రింగ్’ ఈ సినిమా నుంచే ప్రారంభమైందేమో…

August 4, 2024 by M S R

శోభన్ బాబు-మంజుల జోడీలో వచ్చిన సూపర్ హిట్ సినిమా . వీరిద్దరి జోడీ కెమిస్ట్రీ బాగా పాకానికి తెచ్చిన సినిమా . ఈ సినిమా షూటింగ్ టైంలో పెళ్లి కూడా చేసుకుంటారేమో అని గుసగుసలు చక్కర్లు కొట్టాయట . వాళ్ళ పెళ్లి ఎలా ఉన్నా నిర్మాతకు , పంపిణీదార్లకు , థియేటర్ల వాళ్ళకు కనక వర్షం కురిపించింది . 1975 లో రిలీజయిన శోభన్ బాబు సినిమాల్లో సోగ్గాడు సినిమా తర్వాత కలెక్షన్లు బాగా వచ్చిన సినిమా ఇది .

పేరయితే జీవనజ్యోతి సినిమాకే ఎక్కువ వచ్చింది అనుకోండి . ఈ జేబుదొంగ సినిమాలో అంతగా కలెక్షన్లు వచ్చేదానికి ఏముందా అంటే శోభన బాబు-మంజుల జోడీ , పాటలు , గోవిందో గోవింద పాటలో NTR శోభన్ బాబుని ఆవహించటం , ఆటలు , శోభన్ బాబు హుషారయిన నటన , రాజబాబు అల్లరి ఈ సినిమా సక్సెస్ కు కారణాలు .

వి మధుసూధనరావు దర్శకుడు . ముళ్ళపూడి డైలాగ్స్ వ్రాసారు . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు బాగుంటాయి . నీలాల నింగిలో మేఘాల తేరులో పాట సినిమాకే హైలైట్ . చాలా శ్రావ్యంగా ఉండటమే కాకుండా బయట కూడా బాగా హిట్టయింది . గోవిందో గోవింద గుట్టు కాస్తా గోవిందా , రేగాడు రేగాడు పాటల్లో శోభన్ బాబు , మంజుల రేగిపోతారు . రాధా అందించు నీ లేత పెదవి అనే పాట బృందావన్ గార్డెన్సులో మురళీ మోహన్ , రోజారమణిల మీద షూట్ చేసారు . చాలా బాగా వచ్చింది .

Ads

మిగిలిన పాటలు చల్లంగ ఉండాలి మారాజులు నిండుగ ఉండాలి , చూసారా పిల్లదాని షోకైన కుర్రదాన్ని తోసింది , బాబూ దోబూచులా నాతో దొంగాటలా కూడా బాగుంటాయి . శోభన్ బాబు-రాజబాబు కెమిస్ట్రీ కూడా ఈ సినిమాలో , ఓ పాటలో బాగా క్లిక్ అయింది .

శోభన్ బాబు , మంజుల , మురళీ మోహన్ , రోజారమణి , సత్యనారాయణ , రావు గోపాలరావు , రాజబాబు , రమాప్రభ , అల్లు రామలింగయ్య , ప్రభాకరరెడ్డి ప్రభృతులు నటించారు .

హైదరాబాద్ , గుంటూరు , నెల్లూరు , తెనాలి , రాజమహేంద్రవరం , శ్రీకాకుళం , కాకినాడ , విశాఖపట్నం సెంటర్లలో వంద రోజులు ఆడింది . హైదరాబాదులో జరిగిన శత దినోత్సవ సభకు NTR ముఖ్య అతిధి . మా గుంటూరు వాళ్ళు అన్నదానం చేసారట . గుంటూరోళ్ళా మజాకా !! ఒరిస్సాలో 50 రోజులు ఆడిన మొదటి తెలుగు సినిమా . శోభన్ – మంజుల జోడీ జిందాబాద్ .

సినిమా యూట్యూబులో ఉంది . కాలక్షేపం సినిమా . An entertaining , visual , musical hit movie . ఇంతకుముందు చూడని శోభన్ బాబు , మంజుల అభిమానులు ఎవరయినా ఉంటే చూసేయండి . పాటల లొకేషన్స్ కూడా బాగుంటాయి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……. [ By దోగిపర్తి సుబ్రహ్మణ్యం ]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి దూకుడు! కేసీయార్‌కు ఇక చెరుపుకోలేని మరక!
  • భేష్ మృణాల్… కథ తడబడినా… నటన తగ్గనివ్వలేదు!
  • నేను రెడీ’ అని స్మృతి చెప్పింది.. మూడు నెలలకే హర్మన్ తప్పుకుంది!
  • అబ్బురపరిచే సినిమాటిక్ ‘ఎదుగుదల’..! ఎవరీ ‘పవర్‌ఫుల్ కేరక్టర్..?
  • అనుకుంటాం గానీ… రెహమాన్ సంప్రదాయ రాగాల్లోనూ దిట్ట !!
  • చో – ఎవడినీ లెక్కచేయలేదు- నమ్మిన ఏ మాటనూ దాచుకోలేదు…!!
  • SIR ప్రకంపనలు- న్యాయవ్యవస్థలోనూ చర్చ – భిన్నాభిప్రాయాలు !!
  • స్టీవ్ జాబ్స్ చివరి మాటలు “ఓహ్- వావ్!… ఏం చూశాడు తను..?!
  • పెళ్లి లేదు… పిల్లలు లేరు… అంతిమంగా మేనల్లుళ్లే వారసులు?
  • ఉన్నవాడి ఔదార్యమూ గొప్పదే- లేనివాడి ఔదార్యం మరీ మరీ గొప్పది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions